మీ కారు రిపేర్‌కు ఎక్కువగా ఖర్చు అవుతోందా.. అయితే ఈ టిప్స్ పాటించి డబ్బు ఆదా చేసుకోండి..
ఈ మధ్య కాలంలో ప్రతి కుటుంబానికి కారు తప్పనిసరి అయింది. ఆఫీస్, కుటుంబ అవసరాల కోసం తమ బడ్జెట్ ధరలో కారును కొనుగోలు చేస్తున్నారు. అయితే ఎవరైనా సరే కారు కొన్నంత మాత్రాన సరిపోదు.. దాని నిర్వహణ చాలా ముఖ్యం. కానీ కొంతమంది కారు మరమ్మతుల కోసం ఎక్కువగా ఖర్చు పెడుతుంటారు.
కొందరు కారు నిర్వహణలో ప్రాథమిక విషయాలను నిర్లక్ష్యం చేయడం వల్ల మరమ్మతులు, నిర్వహణ కోసం ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. కానీ మీరు మీ కారుపై కొంచెం శ్రద్ధ పెట్టినట్లయితే.. మీరు చాలా వరకు రిపేర్ ఖర్చులు మిగుల్చుకోవచ్చు. ఆ చిట్కాలు ఏంటో ఈ కథనంలో చదవండి.

ఆయిల్ మార్చండి: ఇంజిన్ ఆయిల్, ట్రాన్స్‌మిషన్ ఆయిల్ ఇంకా బ్రేక్ ఆయిల్ లాంటి మార్పులను నిర్లక్ష్యం చేయడం కారణంగా ఎక్కువగా మీ కారు రిపేర్లకు గురవుతుంటుంది. లూబ్రికేటింగ్ ఆయిల్ మీ కారు పనితీరుపై ప్రభావం చూపుతుంది. కాబట్టిప్రతి 8000 కి.మీకు ఒకసారి ఆయిల్‌ను మార్చడం చేయండి లేదా కార్ల తయారీదారును సంప్రదించండి.
బ్యాటరీ నిర్వహణ: కారులో బ్యాటరీ టర్మినెల్స్ ద్వారా తుప్పు పట్టడం వల్ల మొత్తం విద్యుత్ వ్యవస్థ పనితీరుపై ప్రభావితం చూపిస్తుంది. దీని ద్వారా బ్యాటరీలో పగుళ్లు ఏర్పడటం లేదంటే బ్యాటరీ పనిచేయడం ఆగిపోవచ్చు. కాబట్టి బ్యాటరీని తరచుగా క్లీన్ చేసుకోవాలి. ఇంకా ఏడాదికి రెండుసార్లు తనిఖీ చేయాలి.

ఎయిర్ ఫిల్టర్: కారులోని క్యాబిన్ ఎయిర్ ఫిల్టర్.. ఏసీ వెంట్స్ ద్వారా కాలుష్య కారకాలు లోపలికి రాకుండా చేస్తుంది. అందువల్ల ఎయిర్ ఫిల్టర్‌ను ఎల్లప్పుడూ తనిఖీ చేసుకోవాలి. పాత ఎయిర్ ఫిల్టర్‌ను దాని నిర్ణీత వారంటీ కంటే ఎక్కువ కాలం ఉపయోగించకూడదు. ఏసీ యూనిట్ సర్వీసింగ్ అంత పెద్ద ఖర్చుతో కూడుకున్నది కాదు. సర్వీసింగ్ చేయకపోతే రిపేర్ ఖర్చు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఏడాదికోసారి ఎయిర్ ఫిల్టర్‌ను మార్చడం కీలకం.
విండ్ షీల్డ్ వైపర్: వర్షాకాలంలో విండ్ షీల్డ్ వైపర్లు చాలా కీలకం. ఇవి వర్షం సమయంలో విజిబిలిటీని పెంచడానికి సహాయపడతాయి. అధిక ఉష్ణోగ్రతల కారణంగా విండ్ షీల్డ్ వైపర్లకు పగుళ్లు ఏర్పడే అవకాశం ఉంది. అందువల్ల సకాలంలో వాటిని మారుస్తూ ఉండాలి.

లైట్ల తనిఖీ: కార్లలో ప్రయాణికుల భద్రతను నిర్ధారించడంలో కారు లైట్లు కీలక పాత్ర పోషిస్తాయి. నైట్ డ్రైవింగ్ చేసేటప్పుడు హైడ్ లైట్ల ద్వారా విజిబిలిటీ పెరుగుతుంది. టర్న్ ఇండికేటర్లు, బ్రేక్ లైట్లు, ఇంకా టెయిల్ లైట్ల ద్వారా వచ్చే పోయే వాహనాలు, పాదచారులను స్పష్టంగా చూడవచ్చు. అందువల్ల కారులోని అన్ని లైట్లు సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో క్రమం తప్పకుండా తనిఖీ చేసుకోవాలి.
టైర్లలో గాలిని తనిఖీ చేసుకోవాలి: కారు టైర్లు, మరియు స్టెఫ్నీలో ఎల్లప్పుడూ గాలి నిండుగా ఉండేలా చూసుకోవాలి. ఇంకా ఆ టైర్లు మంచి కడిషన్‌లో ఉన్నాయో లేదో చూసుకోవాలి. వాటిలో ప్రెజర్‌ను తనిఖీ చేస్తూ అవసరమైనప్పుడు పెంచాల్సి ఉంటుంది. దీనివల్ల కారు నిర్వహణ మెరుగుపడుతుంది.

అత్యవసర పరిస్థితుల్లో బ్రేక్ ప్యాడ్లను మార్చాల్సి ఉంటుంది. లేదంటే సమస్యకు దారి తీస్తుంది. బ్రేకే వేసినప్పుడు కీచు మని శబ్దం వినిపిస్తే.. దాని వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఎలా అంటే ఒక్కోసారి దీని ద్వారా బ్రేకులు పనిచేయకుండా పోవచ్చు. దీని వల్ల నష్టం జరగొచ్చు.

కారు సరైన నిర్వహణ కోసం, రిపేర్ ఖర్చులు తగ్గించుకునేందుకు అప్పుడప్పుడూ కారు టైర్లను రొటేట్ చేస్తుండాలి. దీని ద్వారా వాటి లైఫ్ వారంటీ పెరుగుతుంది. ప్రతి 8000 కి.మీకు టైర్లను రొటేట్ చేయండి. అంతే కాకుండా సస్పెన్షన్ సిస్టమ్‌ను కూడా రెగ్యులర్‌గా తనిఖీ చేసుకోవాలి. ఈ టిప్స్ పాటించడం ద్వారా మీ కారు తరచుగా రిపేర్లకు గురికాకుండా ఎక్కువ డబ్బు వృథా కాకుండా చూసుకోవచ్చు.


Click it and Unblock the Notifications








