కారు టైర్లను మార్చేటప్పుడు ఈ విషయాలను తప్పక గుర్తుంచుకోండి.!!

కారుకు సంబంధించి ముఖ్యమైన భాగాల్లో టైర్లు(Car Tyres) ప్రధానమైనవి. కారును నడపడానికి ఇంజిన్‌ ఎంత ముఖ్యమో.. నాణ్యత కలిగిన టైర్లు కూడా అంతే ముఖ్యం. మీరు కారు, బైక్‌ ఇలా ఏ వాహనం నడుపుతున్నా.. ఖచ్చితంగా మీరు టైర్లను మార్చే పరిస్థితి ఏర్పడుతుంది. వాహనం ఎక్కువ కాలం నడుస్తున్న కొద్దీ టైర్లు అరిగిపోతుంటాయి.

అయితే చాలా మంది కారులోని ఇతర భాగాలకు ఇచ్చిన విలువ టైర్లకు ఎక్కువ ఇవ్వరు. చాలా కాలం వరకూ వాడుతూనే ఉంటారు. లేదంటే కొత్తది కొనుగోలు చేయాల్సి వచ్చినప్పుడు ఖర్చును దృష్టిలో ఉంచుకుని నాణ్యత లేని టైర్లను కొనుగోలు చేస్తుంటారు. ఇది చాలా ప్రమాదకరం. ఇది రోడ్డుపై మీకే కాదు.. ఇతరులకూ హాని కలిగిస్తుందని గుర్తుంచుకోవాలి.

Tips-For-Buying-New-Tyres-Car

టైర్ యొక్క జీవితకాలం(Car Tyres Maintenance) అనేది వాతావరణం, రహదారి పరిస్థితులు, డ్రైవింగ్ అలవాట్లు మొదలైన వాటిపై ఆధారపడి ఉంటుందని గమనించాలి. మీ కారు టైర్ల పనితీరు తగ్గిందని.. వాటికి రీప్లేస్‌మెంట్ అవసరమని మీరు భావిస్తే, వెంటనే ఆ పని మొదలుపెట్టింది. అయితే కొత్త టైర్లు కొనుగోలు చేసేటప్పుడు మీరు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి.

బ్రాండ్: టైర్లను కొనుగోలు చేసేటప్పుడు మంచి బ్రాండ్ టైర్లను మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. భారతీయ రహదారి పరిస్థితులకు అనుగుణంగా ISI మార్కులు ఉన్న టైర్లకు ప్రాధాన్యత ఇవ్వాలి. చౌకైన చైనీస్ టైర్లు మరియు ఇతర చౌకైన మోడళ్లను నివారించాలి. ఇంకా ఎక్కువ దూరం ప్రయాణాలు చేసేవారికి.. ఎక్కువ పనితీరు మరియు సౌకర్యాన్ని అందించే టైర్లు సరైనవి. ఇక సిటీ అవసరాల కోసం ప్రయాణించేవారు అధిక మైలేజ్‌ టైర్లపై దృష్టి సారించాలి.

Tips-For-Buying-New-Tyres-Car

సరైన పరిమాణాన్ని పొందండి: వాహనం పనితీరు మరియు భద్రత కోసం సరైన సైజు టైర్‌ని కొనుగోలు చేయడం కీలకం. సాధారణంగా, తయారీదారు టైర్‌ సైజ్‌ను దాని సైడ్‌వాల్‌పై ప్రింట్‌ చేస్తారు. కాబట్టి మీరు కొత్త టైర్లను కొనుగోలు చేస్తున్నట్లయితే.. మీరు ప్రస్తుతం వాడుతున్న టైర్లను తనిఖీ చేయాలి. లేదంటే.. మాన్యువల్‌గా సెలెక్ట్‌ చేయాల్సి ఉంటుంది. దీని వల్ల ఇబ్బందులు ఏర్పడతాయి.

తయారీ తేదీని తనిఖీ చేయండి: టైర్‌(Brand Tyres)ను కొనుగోలు చేసేటప్పుడు, టైర్‌ను తయారు చేసిన తేదీని టైర్ వైపు రాసి ఉంటుంది. దాని తనిఖీ చేయాలి. పాత స్టాక్‌ను కొనుగోలు చేయకుండా ఉండేందుకు ఇది సరైన ఆప్షన్‌. మీరు సరికొత్తగా కనిపించే టైర్‌ని కొనుగోలు చేస్తున్నప్పటికీ, దానిపై ముద్రించిన తేదీని ఖచ్చితంగా పరిశీలించాలి.

ముఖ్యంగా భారత్‌లో వేడి వాతావరణం కారణంగా టైర్లు వేగంగా అరిగిపోతుంటాయి. అందుకే కొత్త టైర్‌ను కొనుగోలు చేసేటప్పుడు తయారీ తేదీని తనిఖీ చేసుకోవాలి. టైర్ తయారు చేయబడిన వారం మరియు సంవత్సరాన్ని సూచించే DOTతో ప్రారంభమయ్యే అక్షరాల సిరీస్‌ను పరిశీలించాలి. ప్రతి టైర్‌పై దాని తయారీ నెల రాసి ఉంటుంది. ఆ వివరాలు లేకపోతే దానిని నివారించాలి.

కాగా టైర్లను క్రమం తప్పకుండా తనిఖీ చేయడం కారు మెయింటెనెన్స్‌లో కీలక భాగం. కొత్త టైర్ ఎల్లప్పుడూ కంపెనీ సిఫార్సు చేసిన గాలి పీడనం వద్ద ఉండేలా చూసుకోవాలి. ఆధునిక కార్లు TPMS వంటి ఫీచర్లను కలిగి ఉంటాయి. ప్రతి 5,000 కిలోమీటర్లకు ఒకసారి టైర్లను మార్చడం వల్ల టైర్ లైఫ్ మరియు పనితీరును మెయింటెయిన్ చేయడంలో మీకు దోహదపడుతుంది.

More from DriveSpark

Article Published On: Friday, March 15, 2024, 9:27 [IST]
English summary
Key tips to follow for buying a new tyres for your car
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+