దీపావళికి కొత్త కారు కొంటున్నారా.. అయితే టెస్ట్ డ్రైవ్ చేసేముందు ఈ విషయాలు గుర్తుంచుకోండి.!!
దీపావళి పండుగ సీజన్ వచ్చిందంటే చాలు.. చాలా మంది కొత్త వాహనాలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తారు. భారత్‌లో కస్టమర్లకే కాదు.. ఆటో మేకర్లకు కూడా సెంటిమెంట్.. అందుకే పండుగ సీజన్లలో ఆకర్షణీయమైన ఆఫర్లు, డిస్కాంట్లను ఆటో కంపెనీలు ప్రవేశపెడతాయి. ఈ నేపథ్యంలో మీరు కొత్త కారు కొనుగోలు చేసేముందు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి.
పండుగ సీజన్ సందర్భంగా కార్ల తయారీదారులు కొత్త మోడళ్లతో కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. ఈ సమయంలో బెస్ట్ డీల్స్, తగ్గింపులతో పాటు ప్రత్యేక ఆఫర్లను అందిస్తాయి. దీపావళి సందర్భంగా కొత్త కారు కొనాలనేకునేవారు.. ముందుగా బడ్జెట్, లోన్ ఆప్షన్‌లు, మోడళ్లు, అందులో వేరియంట్లను పరిశీలిస్తారు. ఆ తర్వాత కారు పర్ఫామెన్స్ ఎలా ఉందో తెలుసుకోవడానికి టెస్ట్ డ్రైవ్ నిర్వహిస్తారు. ఈ క్రమంలో కారు టెస్ట్ డ్రైవ్ చేసేముందు కొన్ని విషయాలు గుర్తించుకోవాలి.

వేరియంట్: మీరు కొత్త కారును టెస్ట్ డ్రైవ్(Test Drive) చేసేటప్పుడు ముందుగా ఏ మోడల్ కారు, అందులోని వేరియంట్‌ను టెస్ట్ డ్రైవ్ చేయాలనుకుంటున్నారో నిర్ణయించుకోవాలి. ఎందుకంటే డీలర్‌షిప్‌ల వద్ద టెస్ట్ డ్రైవ్ కోసం షోరూమ్‌ల్లో పరిమిత వేరియంట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయని గుర్తుంచుకోవాలి. పీక్ సీజన్‌లో ముఖ్యంగా ఈ కార్లు బిజీగా ఉంటాయి.
ఆ సమయంలో మీరు టెస్ట్ డ్రైవ్ చేయాలనుకున్నప్పుడు.. అదే ట్రిమ్ లేదా దానికి దగ్గరగా ఉండే వేరియంట్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. కానీ పెట్రోల్ వేరియంట్ కారు బదులు డీజిల్ వేరియంట్ కారును టెస్ట్ డ్రైవ్ చేస్తే ప్రయోజనం ఉండదని గమనించాలి. ఆ డీలర్‌షిప్‌లో మీరు కావాలనుకున్న ట్రిమ్ లేకపోతే వేరే షోరూమ్‌లో ట్రై చేయండి.

తొందరపడవద్దు: డీలర్‌షిప్‌లు తరచుగా సాయంత్రం 6 లోపు మాత్రమే టెస్ట్ డ్రైవ్‌లను అందిస్తాయి. కాబట్టి మీరు టెస్ట్ డ్రైవ్‌లో ఆ కారు నాణ్యతను పూర్తిగా పరిశీలించాలంటే.. తగినంత సమయం తీసుకోవాలి. హడావుడిగా టెస్ట్ డ్రైవ్ చేస్తూ ఓవర్‌వ్యూలో ఓ అంచనాకు రావద్దు. మీకు తగినంత సమయం కేటాయించే షోరూమ్‌ల్లో టెస్ట్ డ్రైవ్ చేయడం ఉత్తమం.
ఎక్కువ రోజులు తీసుకోవద్దు: మీకు నచ్చిన అన్ని కార్లను వీలైనంత తక్కువ రోజుల్లోనే టెస్ట్ డ్రైవ్ చేయండి. ఎందుకంటే ఓ కారు టెస్ట్ డ్రైవ్ చేసిన చాలా రోజుల తర్వాత మరో కారును ప్రయత్నిస్తే రెండు కార్ల మధ్య తేడాలను గుర్తించలేరు. అందుకే వీలైనంత త్వరగానే మీ బడ్జెట్‌లోని కార్లను టెస్ట్ డ్రైవ్ చేయండి.

ఫ్యామిలీతో టెస్ట్ డ్రైవ్: కారును టెస్ట్ డ్రైవ్ చేసేటప్పుడు ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీతో వెళ్లడం బెటర్. ఎందుకంటే టెస్ట్ డ్రైవ్‌లో వెనుక సీటు ప్రయాణికులు కూడా సౌకర్యంగా ఫీలవుతున్నారో లేదో తెలుసుకోవచ్చు. ఇంకా ఫీచర్లు, కలర్స్ ఆప్షన్‌పై కూడా మీరు వారి సలహా ద్వారా ఓ అంచనాకి రావచ్చు.
బేసిక్ పాయింట్స్: కారును టెస్ట్ డ్రైవ్ చేసేటప్పుడు కొన్ని ప్రాథమిక విషయాలను గుర్తుంచుకోవాలి. వీటిలో డ్రైవ్, ఇంజిన్, స్టీరింగ్ వీల్, ట్రాన్స్‌మిషన్, బ్రేక్‌లు, సీటింగ్ సౌకర్యంగా ఉన్నాయో లేదో నిర్ధారణకు రావాలి. వేగాన్ని మారుస్తూ బ్రేకులు ఎలా పనిచేస్తున్నాయో తెలుసుకోండి. ఇంకా కారు కెపాసిటీ కూడా తెలుసుకోవాలి.

ముఖ్యంగా కారు డ్రైవర్ సీటులో ఉండేవారు.. ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఇంకా డ్రైవర్‌కు అన్ని వైపులా ఉండే ఫిజికల్ బటన్‌ల పనితీరును పరిశీలించాలి. ఇంకా కారులో సేఫ్టీ ఫీచర్లు, మైలేజ్ గురించి డీలర్ ద్వారా పూర్తిగా తెలుసుకోండి. ఒకవేళ మీరు ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేస్తున్నట్లయితే.. ఛార్జింగ్, రేంజ్ గురించి పూర్తిగా వివరాలు సేకరించాలి. ఇవి పాటించడం ద్వారా మీ కారు టెస్ట్ డ్రైవ్‌లో మంచి ఫలితాలు రాబట్టవచ్చు.



Click it and Unblock the Notifications








