కారు తాళం చెవి పోయిందా? ఏం భయపడకండి.. ఈ స్టెప్స్ ద్వారా కొత్త కీని పొందండి!
మీ దగ్గర కారు ఉంటే దాని తాళం చెవిని మర్చిపోయినా లేదా పోగొట్టుకున్న ఆందోళన చెందాల్సిన పనిలేదు. కారు వాడే వ్యక్తులు లేదా ఇతర వాహనాలు వినియోగించే వారు చాలా సందర్భాల్లో తాళం చెవిని మర్చిపోతుంటారు. ఇది మీకు అసౌకర్యాన్ని కలిగించడంతో పాటు తలనొప్పిగా మారుతుంది. దీనివల్ల మీ ముఖ్యమైన పనులు మిస్ అవ్వడం, అదనపు ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. అయితే మీరు కీ పోగొట్టుకున్న భయపడాల్సిన అవసరం లేదు. మీ కారు కీ మిస్ అయితే ఏం చేయాలో ఇక్కడ మీకు వివరించబోతున్నాం.
మీరు కారు యజమాని అయితే మొదట చేయవలసిన పని ఎల్లప్పుడూ కీని సురక్షితమైన ప్రదేశంలో ఉంచాలి. పొరపాటున మీరు తాళం చెవిని కోల్పోవడం వల్ల అనవసర ఖర్చులకు దారితీయడమే కాకుండా మీ ఒత్తిడిని పెంచుతుంది. రోజు మీరు పెట్టే ప్లేస్‌లో ఓసారి వెతకండి. ఆ తర్వాత మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వారు తిరిగే ప్రదేశాల్లో చెక్ చేయండి. మీ కీ త్వరగా దొరికేందుకు బాగా గుర్తుండే ప్లేస్‌లోనే ఉంచండి.

కారు తాళం మార్చడం చాలా ఖర్చుతో కూడుకున్న పని. స్టాండర్డ్ బ్రాండ్ల రిమోట్ కీ ధర సాధారణంగా రూ .8,500 లేదా అంతకంటే ఎక్కువగా ఉంటుంది. బేస్ మెకానికల్ కీ ధర సుమారు రూ.1,500 కాగా.. లగ్జరీ కార్ల వాహనాలు కీ ప్రారంభ ధర రూ.30,000కు పైగానే ఉంటుంది. మీ కారు మోడల్ దాని విలువను బట్టి ధర మారుతుంది.
పోగొట్టుకున్న కీ ని రిప్లేస్ చేయడానికి కొత్తదాన్ని కొనుగోలు చేయడానికి ముందు మీ వాహనం గురించి ముఖ్యమైన సమాచారాన్ని సేకరించండి. ఇందుకోసం దాని మోడల్, తయారీ సంవత్సరాన్ని నోట్ చేసుకోండి. వీటితో పాటు వెహికల్ ఐడెంటిఫికేషన్ నంబర్ (VIN) కూడా అవసరం. తదుపరి చేయవలసిన పని కారు డీలర్‌ని సంప్రదించడం. డీలర్లు మీకు పరిచయస్తులు అయితే పనులు కాస్త సులువు అవుతాయి.

మీరు డీలర్‌ని కలిసినప్పుడు వాహనం యజమాని ధృవీకరణ పత్రాన్ని మీతో తీసుకెళ్లండి. కారు మీదేనని మీకు నమ్మకం ఉంటేనే తాళం చెవిని మార్చేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు కారు యజమాని అని నిరూపించడానికి అవసరమైన డాక్యుమెంట్లు మీ వద్ద ఉండాలి. అప్పుడు మార్చాల్సిన కీ రకాన్ని నిర్ణయించిన తర్వాత దానికి అయ్యే ఖర్చును అడిగి తెలుసుకోండి. మీరు కీని సెలెక్ట్ చేసుకుని అవసరమైన ఫీజును చెల్లించండి.
అప్పుడు డీలర్ మీ కారు కొత్త కీని సిద్ధం చేయడం ప్రారంభిస్తాడు. మీరు ఎంచుకున్న కీ రకాన్ని బట్టి కీ మీకు ఎప్పుడు అందుతుందనే విషయాన్ని డీలర్ వివరిస్తాడు. కారు తాళాలు కోల్పోవడం డబ్బు ఖర్చుతో కూడుకున్నది. అంతే కాకుండా సమయం వృధా ఒత్తిడిని కలిగిస్తుంది. పై స్టెప్స్ ఫాలో అయి మీ కారు తాళం చెవిని సులభంగా తీసుకోవచ్చు.

పరిమాణంలో చిన్నదైనా కారు తాళం చెవిని కోల్పోవడం పెద్ద తలనొప్పి. భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే ముందుగా చెప్పినట్లు తాళం చెవిని ఎప్పుడూ ఒక నిర్దిష్ట ప్రదేశంలో ఉంచే అలవాటును పెంచుకోవాలి. లోపల తాళం చెవిని మర్చిపోయి కారుకు తాళం వేసి బయటకు వెళ్లేవాళ్లు కూడా ఉన్నారు.
కారులోంచి బయటకు వెళ్లే సందర్భంలో కీపై ఓ కన్నేయండి. కీని కోల్పోకుండా ఉండేందుకు కీ హోల్డర్ కారు తాళాన్ని తగిలేంచాలా చూసుకోండి. పైన చెప్పిన విధంగా మీరు కీని పోగొట్టుకుని ఎక్కువ డబ్బు వెచ్చించి రీప్లేస్ చేయించుకోవడం కంటే అలా జరగకుండా చూసుకోవడం ఉత్తమం.


Click it and Unblock the Notifications








