మీ ఫేవరెట్ బైక్‌ను మీకు నచ్చినట్లుగా మార్చుకోవాలనుకుంటున్నారా.. అయితే ఈ విషయాలు గుర్తుంచుకోండి..

చాలా మందికి బైక్ అంటే మహా క్రేజ్.. అందుకే ధర గురించి ఆలోచించకుండా తమకు నచ్చిన స్టైల్, మోడల్ ఉన్న బైక్ కొనడానికే ఆసక్తి చూపుతారు. బైక్ కొన్న అనంతరం అంతటితో ఆగకుండా దానిని తమకు నచ్చినట్లుగా మోడిఫై చేసుకోవాలనుకుంటారు. అయితే దీనికి కొన్ని పరిమితులు ఉన్నాయి. అవేంటంటే..

బైక్‌ను మీకు నచ్చినట్లుగా మోడిఫై చేసుకోవాలనుకుంటే.. దానికి చాలా కృషితో పాటు పరిశీలనలు కూడా అవసరం. ఇక్కడ మీ బైక్‌ను మీకు నచ్చిన రీతిలో మార్పులు చేయాలనుకుంటే కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. ముందుగా మీరు వాహనానికి చేసుకునే మాడిఫికేషన్స్.. మీ RTOతో నమోదు అవ్వడంతో పాటు.. ఇన్సూరెన్స్ చెల్లుతుందో లేదో కూడా చెక్ చేసుకోవాలి.

Modify-Your-Motorcycle

మీ బైక్‌కు చేసిన ఏవైనా మార్పులు తప్పనిసరిగా సెట్ స్పెసిఫికేషన్‌లో ఉండాలని గుర్తుంచుకోండి. 2019లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం, తయారీదారులు రూపొందించిన ఒరిజినల్ స్పెసిఫికేషన్‌లను గణనీయంగా మార్చే విధంగా వాహనాలను మార్చకూడదు. బైక్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌లో తయారీదారు పేర్కొన్న స్పెసిఫికేషన్లను పరిశీలించాలి.

ఉదాహరణకు మీ ద్విచక్ర వాహనాన్ని రూపొందించేటప్పుడు బైక్ నడిపే వ్యక్తితో పాటు మరొకరు కూర్చునేలా తయారుచేస్తారు. అయితే మీరు ఏ విధంగానూ ఇద్దరి కంటే ఎక్కువ మంది ప్రయాణించేలా మార్చలేరు. అదేవిధంగా, వాహనం సైజ్, ఇంజిన్ మరియు బ్రేకింగ్ సిస్టమ్‌ను సవరించడం సాధ్యం కాదు.

Modify-Your-Motorcycle

బైక్ మాడిఫికేషన్స్‌లో ఏవైనా హెవీ డ్యూటీ సవరణల పరిధిని గణనీయంగా తగ్గించినప్పటికీ, మీరు ఇంకా అనేక మార్పులు చేసుకునే అవకాశం ఉంది. RTO పరిమితులకు లోబడి మీ బైక్‌కు పెయింటే చేసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా, డీకాల్స్, వైజర్లు మరియు ఇంజిన్ ఫెయిరింగ్ వంటి చిన్న ఉపకరణాలను చేర్చడం లాంటివి చట్టపరమైన పరిమితుల్లో చేసుకోవచ్చు.

ఈ చిన్న చిన్న మార్పులకు మీరు నిపుణుల సహాయం తీసుకోవాల్సి ఉంటుంది. మీ బైక్‌కు ఆకర్షణీయమైన పెయింటింగ్ ఫినిషింగ్ ఇచ్చేందుకు ఆ పని మీరు చేయకుండా అందులో ప్రొఫెషనల్స్ సహాయంతో పెయింటింగ్ చేయడం ఉత్తమం. దీని ద్వారా పర్ఫెక్ట్ పెయింటింగ్‌త బైక్ లుక్ మరింత అట్రాక్టివ్ లుక్‌తో కనిపిస్తుంది.

Modify-Your-Motorcycle

మీ బైక్‌లో చిన్న చిన్న సవరణలు చేస్తున్నప్పుడు కూడా మీరు ఫారమ్‌పై ఆధారపడి ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా భద్రతలో రాజీ పడకుండా చూసుకోవాలి. మీ బైక్ ఆకర్షణీయమైన లుక్ కంటే.. మీ భద్రత ముఖ్యమని గుర్తుంచుకోవాలి. ఇది ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం.

చాలా మంది తమ బైక్‌లు లేదా స్కూటర్‌ల నుంచి సైడ్ మిర్రర్‌లను తొలగిస్తుంటారు. ఇలా చేయడం ద్వారా దాదాపు రూ. 1,000 చలాన్‌ విధించే అవకాశం ఉంది. ఇంకా ముఖ్యంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా సవరణలు చేసేటప్పుడు ఆ భాగం ఎంత ముఖ్యమనేది గుర్తుంచుకోవాలి.

Modify-Your-Motorcycle

మీరు ఆన్‌లైన్‌లో ద్విచక్ర వాహన ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేసినప్పుడు, మీరు ముందుగా అన్ని మాడిఫికేషన్స్ అందులో ఉన్నాయో లేదో పరిశీలించాలి. మీరు కావాలనుకున్న మాడిఫికేషన్స్ అందులో లేకపోతే.. మీరు బీమా క్లెయిమ్ చేసుకోలేరు. ఆన్‌లైన్‌లో ద్విచక్ర వాహన బీమాను విక్రయించే చాలా కంపెనీలు మాడిఫికేషన్స్ ని స్వీకరిసస్తాయి.

మొత్తం మీద, సవరణల పరిధిని గణనీయమైన స్థాయిలో పరిమితం చేసినా.. మీ వాహనంలో కొన్ని చిన్న చిన్న మార్పులు చేయడం ఇప్పటికీ సాధ్యమే. మీరు మీ ద్విచక్ర వాహన బీమా కంపెనీతో మీ సవరణలను అంగీకరించేలా ఉన్నాయో లేదో నిర్ధారించుకోవాలి. ముఖ్యంగా బైక్, మీరు, మీ సన్నిహితుల భద్రతను దృష్టిలో ఉంచుకుని మీకు నచ్చిన మాడిఫికేషన్స్ చేయాలని గుర్తుంచుకోండి.

More from DriveSpark

Article Published On: Sunday, September 10, 2023, 8:01 [IST]
English summary
Main things you should know before modify your motorcycle
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+