ఈ యాక్ససరీలతో వర్షాకాలంలో మీ కారును సురక్షితంగా ఉంచుకోండి!

భారతదేశంలోకి రుతుపవనాలు ప్రవేశించాయి. అనేక ప్రాంతాల్లో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కూడా పడుతున్నాయి. రుతుపవనాలు దక్షిణాది రాష్ట్రాలను ముంచెత్తగా, ఇప్పుడు అవి ఉత్తరం వైపు కదులుతున్నాయి. మరి ఈ వర్షాకాలంలో వాహనాల నిర్వహణ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

ఈ యాక్ససరీలతో వర్షాకాలంలో మీ కారును సురక్షితంగా ఉంచుకోండి!

వర్షాకాలంలో వాహనాల నిర్వహణ చాలా ముఖ్యమైనది, ఈ సీజన్‍లో మీ వాహనల పట్ల ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న, దాని మరమ్మత్తుల కోసం భారీ మూల్యం చెల్లించాల్సి రావచ్చు. రెయినీ సీజన్ కోసం ప్రస్తుతం మార్కెట్లో అనేక రకాల యాక్ససరీలు అందుబాటులో ఉన్నాయి. వీటి సాయంతో మీ వాహనాలను సురక్షితంగా ఉంచుకోవచ్చు. ఆ యాక్ససరీలు ఏంటో చూద్దాం రండి:

ఈ యాక్ససరీలతో వర్షాకాలంలో మీ కారును సురక్షితంగా ఉంచుకోండి!

1. వాటర్ ప్రూఫ్ కార్ బాడీ కవర్

కారును దుమ్ము, ధూళి నుండి రక్షించుకోవడానికి మనం కార్ బాడీ కవర్లను ఉపయోగిస్తుంటాం. అయితే, మనం ఉపయోగించే అన్ని కార్ బాడీ కవర్లు వాటర్‌ప్రూఫ్ కాదు. ఉదాహరణకు, సింథటిక్ కార్ కవర్ మీ వాహనాన్ని దుమ్ము, ధూళి నుండి మాత్రమే రక్షిస్తుంది, కానీ నీటి నుండి కాదు. అందుకే వాటర్‌ప్రూఫ్ సామర్థ్యం కలిగిన పాలిమర్ కార్ కవర్‌లను ఉపయోగించాలి. ఇవి వర్షపు నీటిని అడ్డుకొని, కారులోనికి నీరు ప్రవేశించకుండా చేస్తాయి. తద్వారా కారు బాడీ తుప్పు పట్టకుండా ఉంటుంది.

ఈ యాక్ససరీలతో వర్షాకాలంలో మీ కారును సురక్షితంగా ఉంచుకోండి!

2. యాంటీ-ఫాగ్ మెంబ్రేన్

రెయినీ సీజన్ కార్ యాక్ససరీస్‌లో ఇది చాలా ముఖ్యమైనది. వర్షంలో కారును డ్రైవ్ చేస్తున్నప్పుడు సైడ్ మిర్రర్స్‌పై వర్షం నీరు పడి, రియర్ వ్యూ దృష్టి మందగించేలా చేస్తుంది. దీని వలన వెనుక నుండి వచ్చే వాహనాలు సరిగ్గా కనిపించవు. ఈ సందర్భంలో యాంటీ-ఫాగ్ మెంబ్రేన్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఇవి బ్లైండ్ స్పాట్ మిర్రర్స్‌లా కూడా పనిచేస్తాయి. వీటిపై వర్షపు నీరు, పొగమంచు నిల్వ ఉండదు. ఫలితంగా సైడ్ మిర్రర్స్ దృశ్యమానత (విజిబిలిటీ) సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది.

ఈ యాక్ససరీలతో వర్షాకాలంలో మీ కారును సురక్షితంగా ఉంచుకోండి!

3. మడ్ ఫ్లాప్స్

ప్రతి కారుకు మడ్ ఫ్లాప్‌లు చాలా అవసరం. కేవలం వర్షాకాలంలోనే కాదు, ప్రతి సీజన్‌లో కూడా ఇవి చక్కగా ఉపయోగపడుతాయి. సాధారణంగా ఫ్యాక్టరీ నుండి వచ్చే కారుకు మడ్ ఫ్లాప్స్ ఉండవు, వీటిని యాడ్-ఆన్ యాక్ససరీస్‌గా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీ కారుకి మడ్ ఫ్లాప్స్ లేకున్నా లేదా అవి పాడైపోయినా వాటి స్థానంలో వెంటనే కొత్త వాటిని అమర్చుకోవాలి. ప్రత్యేకించి వర్షాకాలంలో మడ్ ఫ్లాప్స్ రోడ్డుపై ఉండే నీటిని, బురదను వెదజల్లకుండా ఉండేందుకు సహకరిస్తాయి.

ఈ యాక్ససరీలతో వర్షాకాలంలో మీ కారును సురక్షితంగా ఉంచుకోండి!

4. పాకెట్ అంబ్రెల్లా లేదా గొడుగు

వర్షాకాలంలో మనకు గొడుగు ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు గొడుగులు భారీ సైజులో ఉండేవి. కానీ, ఇప్పుడు అవి జేబులో ఇమిడిపోయే సైజుల్లో కూడా అందుబాటులోకి వచ్చాయి. కాబట్టి, మనం వర్షంలో తడవకుండా ఉండేందుకు పాకెట్ అంబ్రెల్లాను కొనుగోలు చేయటం మంచిది. ఒకవేళ ఇవి అందుబాటులో లేకుంటే, సాధారణ గొడుగులు కొనుగోలు చేసి కారులో ఉంచుకోవచ్చు. మనం తడవకుండా కారు లోనుంచి బయటకు మరియు బయటి నుంచి కారు లోనికి వచ్చినట్లయితే సీట్లు తడవకుండా ఉండి, ఎక్కువ కాలం మన్నుతాయి.

ఈ యాక్ససరీలతో వర్షాకాలంలో మీ కారును సురక్షితంగా ఉంచుకోండి!

5. రబ్బర్ లేదా ఆల్-వెథర్ ఫ్లోర్ మ్యాట్స్

వర్షాకాలంలో కారులోని ఫాబ్రిక్ కార్పెట్ మ్యాట్స్ త్వరగా తడిచిపోయి మురికిగా మారుతాయి. ఫలితంగా కారు క్యాబిన్‌లో అవాంఛిత తేమ లేదా దుర్వాసన వస్తుంటుంది. కాబట్టి, మీ కారులో ఫ్యాబ్రిక్ మ్యాట్స్ ఉన్నట్లయితే, వర్షాకాలంలో వాటి స్థానంలో రబ్బరు లేదా ఆల్-వెథర్ మ్యాట్లను ఉపయోగించాలి. ఇవి తడిని కారు అడుభాగానికి చేరకుండా అడ్డుకుంటాయి. అంతేకాకుండా, ఒకవేళ ఇవి మురికిగా మారినా వెంటనే వాటిని నీటితో క్లీన్ చేసుకోవచ్చు.

ఈ యాక్ససరీలతో వర్షాకాలంలో మీ కారును సురక్షితంగా ఉంచుకోండి!

6. డోర్ / విండో వైజర్

డోర్ లేదా విండో వైజర్స్ అనేవి కేవలం వర్షాకాలంలోనే కాదు అన్ని కాలాల్లోనూ మీ కారును సురక్షితంగా ఉంచుతాయి. ఈ వైజర్స్ సాయంతో ప్రత్యేకించి వర్షాకాలంలో డ్రైవ్ చేస్తున్నప్పుడు బయటి వాతావరణాన్ని మీరు కారులో కూర్చునే ఆస్వాదించవచ్చు. ఈ వైజర్స్ వర్షపు నీటిని కారులోకి ప్రవేశించకుండా అడ్డుకుంటాయి. తద్వారా మీరు కారు విండో అద్దాన్ని కొంత వరకు క్రిందికి దించి, బయట చల్లటి గాలిని ఎంజాయ్ చేయవచ్చు.

ఈ యాక్ససరీలతో వర్షాకాలంలో మీ కారును సురక్షితంగా ఉంచుకోండి!

7. రెయిన్ షూ కవర్స్

రెయిన్ షూ కవర్స్ వర్షాకాలంలో మీ పాదరక్షలను పాడవకుండా కాపాడటమే కాకుండా, బయట ఉండే బురద మీ కారులోకి ప్రవేశించకుండా ఉంచడంలో కూడా సహకరిస్తాయి. ఈ షూ కవర్లు సాగే గుణం కలిగిన సిలికాన్ రబ్బరుతో తయారు చేయబడి ఉంటాయి. ఫలితంగా ఇవి ఎవ్వరికైనా ఇట్టే సరిపోయేలా ఉంటాయి. ఒక విధంగా చెప్పాలంటే, ఇవి మీ బూట్లకు రెయిన్ కోట్ల మాదిరిగా పనిచేస్తాయి.

Most Read Articles

English summary
Monsoon Car Care Tips: Protect Your Car In The Monsoon With These Accessories. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X