మీ కారులో డోర్, విండో సీల్స్ పాడవకుండా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించాలి.. లేదంటే.!!

మీరు ఎంతో ఇష్టపడి మీ బడ్జెట్‌లో కొనుగోలు చేసుకున్న కారును సొంతం చేసుకున్న తర్వాత.. దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవడం చాలా అవసరం. కారు లుక్‌, మెయింటెనెన్స్‌, డిజైన్‌, ఇంటీరయర్‌, ఎక్స్‌టీరియర్(car seals maintenance), ఇంజిన్‌ ఇలా అన్ని భాగాలు సక్రమంగా పనిచేసేలా ఎల్లప్పుడూ పర్యవేక్షిస్తుండటం చాలా అవసరం. లేదంటే మరమ్మతులకు చాలా ఖర్చు చేయాల్సి వస్తుంది.

అయితే ఇక్కడ కారులో డోర్‌, విండోస్‌ చాలా ముఖ్యమైన భాగాలు. మీకు సేఫ్టీతో పాటు భద్రతతో కూడిన డ్రైవింగ్‌(Car doors and windows seals maintenance)ను ఇవ్వడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. ఇక్కడ మీకు మీ కారు డోర్‌, విండోస్‌ ఎక్కువ కాలం మన్నికగా ఎలా ఉంచుకోవాలో కొన్ని గైడ్‌లైన్స్‌ ఈ కథనంలో అందిస్తున్నాం.

Car-Seals-Maintenance

మీ కారు డోర్ మరియు విండోల చుట్టూ ఉండే సీల్స్ వాటర్‌ రెసిస్టెన్స్‌, బయట నుంచి వచ్చే నాయిస్‌, ఉష్ణోగ్రత మార్పుల నుంచి కారును రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. సౌకర్యవంతమైన మరియు సాఫ్ట్‌ డ్రైవింగ్‌ అనుభవాన్ని అందించడంలో వీటి పాత్ర చాలా కీలకం.

మీ కారు విండోస్‌ మరియు డోర్ సీల్స్‌(car seals)ను క్రమం తప్పకుండా తనిఖీ చేసుకోవడం చాలా అవసరం. దీని ద్వారా ఏవైనా సమస్యలున్నా ముందుగానే గుర్తించి పరిష్కరించుకోవచ్చు. వాటి మధ్య పగుళ్లు, గట్టిపడటం లేదా ఇతర సమస్యలు ఏవైనా గుర్తిస్తే, మీరు ముందుగానే జాగ్రత్త తీసుకోవచ్చు. దీని ద్వారా నష్టాన్ని నివారించవచ్చు.

Car-Seals-Maintenance

కారు విండోస్‌ మరియు డోర్ సీల్స్‌ను పదునైన వస్తువులు తాకకుండా జాగ్రత్త వహించాలి. ఎందుకంటే వీటి ద్వారా డోర్స్, విండోస్‌ త్వరగా, సులభంగా దెబ్బతినడం లేదా చిరిగిపోయే అవకాశం ఉంది. డ్యామేజ్‌ అయినట్లయితే మీరు కొత్త సీల్స్‌తో మార్చాల్సి ఉంటుంది. కాబట్టి దీనితో జాగ్రత్తగా ఉండాలి. పదునైన వస్తువులు తగలకుండా మరింత అలర్ట్‌గా ఉండాలి.

మీ కారు విండో మరియు డోర్ సీల్స్ తీవ్రంగా దెబ్బతిన్నట్లయితే వాటిని మార్చడం అవసరం. రెగ్యులర్ మెయింటెనెన్స్‌, తనిఖీలు.. సీల్స్‌ మార్చాల్సని అవసరమున్నప్పుడు వాటిని గుర్తించడంలో సహాయపడతాయి. దెబ్బతిన్న సీల్స్ ఉన్న కారును ఉపయోగించడం ప్రమాదకరం. దీని ద్వారా వర్షాకాలంలో కారు లోపలికి నీరు చేరే అవకాశం ఉంది.

Car-Seals-Maintenance

మీ కారు డోర్ల(car maintenance tips)ను రెగ్యులర్‌గా శుభ్రం చేసుకోవాలి. సీల్స్‌ను తుడవడానికి ఇంకా పేరుకుపోయిన దుమ్ము, ధూళిని తొలగించడానికి తడి క్లాత్‌ను ఉపయోగించాలి. వీటిలో దుమ్ము లేదా ధూళి ఎక్కువగా పేరుకుపోయినట్లయితే కారు డోర్‌ విండోస్‌లో సీల్స్‌ను త్వరగా దెబ్బతీస్తుంది. అందుకే వీటిపై ఎక్కువ శ్రద్ధ వహించడం అవసరం.

విండోస్‌, డోర్‌ సీల్స్‌(windows and doors seals maintenance)పై సిలికాన్ ఆధారిత కందెనను పూయడం వల్ల అవి గట్టిపడకుండా లేదా పగుళ్లు ఏర్పడకుండా నిరోధించే అవకాశం ఉంటుంది. తద్వారా అవి ఎక్కువ కాలం మన్నుతాయి. కందెనను పూయడం వల్ల కారు సీల్స్‌కు హాని కలగకుండా చూడవచ్చు. ఎక్కువ కాలం పాటు కారు నిర్వహణ ఖర్చును తగ్గించడంలో మీకు సహాయపడుతుంది.

Car-Seals-Maintenance

మీ కారును సన్‌లైట్‌ తగలని ప్రదేశంలో పార్క్ చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే డైరెక్ట్‌ సన్‌లైట్‌ ద్వారా సీల్స్ డ్రై అవడం లేదా త్వరగా పగుళ్లు ఏర్పడై అవకాశం ఉంది. సూర్య కాంతి తగలని చోట ఉంచినట్లయితే అనవసర ఖర్చులకు దారి తీస్తుంది. నీడ ఉన్న ప్రదేశంలో కారును పార్క్ చేస్తే ఈ సమస్య ఉండదు.

More from DriveSpark

Article Published On: Tuesday, September 19, 2023, 21:46 [IST]
English summary
Most important guidelines for car window door seals maintenance
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+