మీ కారు డీజిల్‌ ఎక్కువగా తాగుతోందా.. అయితే ఒక్కసారి ఈ టిప్స్‌ పాటించి చూడండి..

వాహనదారులకు పెరుగుతున్న ఫ్యూయెల్‌ ధరలు పెనుభారంగా మారాయి. దీనికి తోడు మీ జర్నీలో ఎక్కువ ఫ్యూయెల్‌ ఖర్చు అవుతుండటం. కొంతమంది తమ వాహనాలు ఎక్కువ డీజిల్‌ తాగుతున్నాయని బాధపడుతుంటారు. కానీ అందుకు కారణమేంటని ఎప్పుడైనా ఆలోచించారా.. మీరు చేసే చిన్న చిన్న పొరపాట్లే దీనికి కారణం.. అయితే కొన్ని టిప్స్‌ పాటించడం ద్వారా పెట్రోల్‌ లేదా డీజిల్‌ను ఆదా చేసుకోవచ్చు.

చాలా మంది కార్ల యజమానులకు అతిపెద్ద సమస్య ఫ్యూయెల్‌ కాస్ట్‌.. ప్రస్తుతం భారత్‌లో లీటరు డీజిల్‌ దాదాపు 100 రూపాయలు ఉంది. ఈ నేపథ్యంలో కార్ల యజమానులు రోజుకు 50 కిలోమీటర్లు ప్రయాణించాలంటే 500 నుంచి 700 రూపాయల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇది చాలా పెద్ద భారంగా మారుతోంది.

Car-Fuel-Cost-Tips

దీంతో వాహనదారులు తమ నెలవారీ ఆదాయంలో కొంత మొత్తాన్ని ఫ్యూయెల్‌ ఖర్చుల కోసమే కేటాయిస్తున్నారనడంలో సందేహం లేదు. అయితే మీరు కారు డ్రైవింగ్ చేసేటప్పుడు చేసే చిన్న చిన్న పొరపాట్ల కారణంగానే పెట్రోలు ఎక్కువగా తాగుతుందని ఎప్పుడైనా అనుకున్నారా.. డ్రైవింగ్ అలవాట్లను మెరుగుపరుచుకుంటే మీ కారు మైలేజ్‌ని ఇట్టే పెంచుకోవచ్చు. అవేంటంటే..

Regular Car Maintenance: కారు వాడే కొద్దీ పాతబడుతుందనే సంగతి తెలిసిందే. అయితే రెగ్యులర్‌ మెయింటెనెన్స్‌ ద్వారా మీ కారును ఎల్లప్పుడూ కొత్తగా ఉంచుకోవచ్చు. ఇది మీ కారు మైలేజ్‌పై కూడా ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా కారు టైర్ ప్రెజర్, ఎయిర్ ఫిల్టర్‌ను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలి. దీని ద్వారా డీజిల్‌ ఖర్చు తగ్గుతుంది.

Car-Fuel-Cost-Tips

Route Planning: రెగ్యులర్‌ జర్నీస్‌తో పోలిస్తే.. లాంగ్‌ జర్నీల్లో మీ కారుపై ఎక్కువ ప్రెజర్‌ పడుతుంది. అందుకే మీ ట్రిప్‌ ప్లాన్‌ చేసేటప్పుడు ఏ రూట్లో వెళ్తే త్వరగా గమ్యం చేరుకోవచ్చు ముందే తెలుసుకోవాలి. దీని ద్వారా ఫ్యూయెల్ ఎక్కువగా తాగదు. ఈ పరిస్థితుల్లో ముఖ్యంగా ట్రాఫిక్‌ ఎక్కువగా ఉండే రోడ్లు, గుంతలు, బాగా లేని రోడ్లను నివారించడం ఉత్తమం.

Acceleration and Braking: ఖాళీగా ఉండే రోడ్లు, హైవేలపై ఎవరైనా సరే ఎక్కువ స్పీడ్‌తో వెళ్తుంటారు. ఈ క్రమంలో సడెన్‌గా స్పీడ్‌ బ్రేకర్‌ వచ్చినా లేదంటే ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ ఇంకా ఏదైనా వాహనం అడ్డొచ్చినా సడెన్‌ బ్రేక్‌ వేయడం చాలా మందికి అలవాటు.

Car-Fuel-Cost-Tips

కానీ ఇది చాలా తప్పు. మీరు సడెన్‌గా కారు స్పీడ్‌ పెంచినా.. లేదంటే హై స్పీడ్‌లో వెళ్తున్నప్పుడు సడెన్‌ బ్రేక్ వేసినా.. ఫ్యూయెల్‌ ఎక్కువగా తీసుకుంటుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఒకే రకమైన వేగం మెయింటెన్‌ చేయడం ద్వారా ఫ్యూయెల్‌ను ఆదా చేసుకోవచ్చు. కారు హై స్పీడ్‌లో వెళ్లడం కంటే పరిమిత వేగంతో వెళ్తేనే మైలేజ్‌ మెరుగుపడుతుందనే విషయాన్ని వాహనదారులు గుర్తుంచుకోవాలి.

మీ కారు బరువు కూడా మైలేజ్‌పై ప్రభావం చూపిస్తుంది. ఎక్కువ మంది ప్రయాణించినా.. ఎక్కువ లగేజ్‌ ఉన్నా మైలేజ్‌ తక్కువ ఇస్తుంది. తక్కువ మంది ప్రయాణించినప్పుడు, తక్కువ లగేజ్‌ ఉన్న సందర్భాల్లో మైలేజ్‌ ఎక్కువగా ఇవ్వడాన్ని మీరు గమనించవచ్చు. అందుకే మీరు కారులో అనవసరమైన బరువులు ఉండకుండా చూసుకోవాలి.

AC: ఇంజిన్‌ ద్వారా వచ్చే శక్తితో మీ కారు ఏసీ పనిచేస్తుంది. కాబట్టి అవసరమైన సందర్భాల్లో మాత్రమే ఏసీని ఉపయోగించడం అలవాటు చేసుకోవాలి. లోకల్‌ అవసరాలు కాకుండా లాంగ్‌ డ్రైవ్‌లో మాత్రమే ఏసీని ఆన్‌ చేసినట్లయితే మైలేజ్‌ విషయంలో మీరు మంచి ఫలితాలను చూడవచ్చు.

ప్రతి కారు మేకర్‌.. కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని వాటిని రూపొందిస్తారు. కొన్ని కార్లను మరింత లగ్జరీని దృష్టిలో ఉంచుకుని తయారు చేస్తారు. కొన్ని కార్లు హై-స్పీడ్ స్పోర్ట్స్‌ కార్లుగా తయారవుతాయి. మరి కొన్ని కార్లు అధిక మైలేజ్ ఇచ్చే కార్లుగా మార్కెట్లోకి వస్తుంటాయి. ఈ క్రమంలో అధిక మైలేజ్‌నిచ్చే కార్లను ఎంచుకోవడం వల్ల ఫ్యూయెల్‌ ఖర్చులు ఆదా అవుతాయి.

దేశంలో నిత్యం పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూ ఉండటంతో మీరు దానికి అనుగుణంగా డ్రైవింగ్‌ అలవాట్లను మార్చుకోవాల్సి ఉంటుంది. పైన చెప్పిన టిప్స్‌ను పాటించడం ద్వారా మీ కారు సంతృప్తికర స్థాయిలో మైలేజ్‌ ఇవ్వడంతో పాటు మీ కారు ఎక్కువ కాలం సురక్షితంగా ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Monday, October 30, 2023, 9:34 [IST]
English summary
Most useful tips for lowering your car fuel costs and improving mileage
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+