మోటార్ ఇన్సూరెన్స్: తరచూ అడిగే ప్రశ్నలు, సమాధానాలు

By Ravi

వాహన బీమా (ఆటో ఇన్సూరెన్స్, గ్యాప్ ఇన్సూరెన్స్, కార్ ఇన్సూరెన్స్ లేదా మోటార్స్ ఇన్సూరెన్స్ అని కూడా పిలుస్తారు) అనేది కార్లు, ట్రక్కులు, మోటార్‌సైకిళ్లు మరియు రోడ్డుపై ప్రయాణించే కొన్ని రకాల వాహనాల కోసం కొనుగోలు చేసే ఓ బీమా (ఇన్సూరెన్స్). ప్రమాదాల వలన జరిగే భౌతిక నష్టం/శారీరకంగా గాయపడటం మొదలైన వాటి నుంచి వాహన యజమానలు, ధర్డ్ పార్టీలకు ఇది ఆర్థిక రక్షణ కల్పిస్తంది.

సింపుల్‌గా చెప్పాలంటే, యాక్సిడెంట్‌లో మీ కారు దెబ్బతిన్నా లేదా మీరు గాయపడినా లేదా మీరు చేసిన యాక్సిడెంట్ వలన అవతలి వారి వాహనం దెబ్బతిన్నా లేక వారు గాయపడినా మీ జేబులో నుంచి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేకుండా, అందుకు అయ్యే ఖర్చు మొత్తాన్ని బీమా కంపెనీయే భరిస్తుందన్నమాట.

ప్రతి ప్రాంతంలో చట్టపరమైన నియంత్రణల ప్రకారం వాహన బీమా విషయంలో నిర్ధిష్ట నిబంధనలు వేర్వేరుగా ఉంటాయి. వాహన బీమా అనేది కేవలం ప్రమాద సమయాల్లోనే కాకుండా, వాహనం దొంగిలించబడినా లేదా ప్రకృతి భీభత్సాల వలన వాహనం డ్యామేజ్ అయినా సరే కవరేజ్ లభిస్తుంది. మరిన్ని వివరాలను క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలిద్దాం రండి.

మీకు మోటార్ ఇన్సూరెన్స్ ఎందుకు అవసరం?

మీకు మోటార్ ఇన్సూరెన్స్ ఎందుకు అవసరం?

బహుశా మీరు కలిగి ఖరీదైన వస్తువుల్లో మీ వాహనం కూడా ఒకటి కావచ్చు. వాహన బీమా ఈ ఆస్తిని కాపాడుతూ, యాక్సిడెంట్స్, డ్యామేజ్ లేదా దొంగతనాల నుంచి మీ వాహనానికి ఆర్థిక రక్షణ అందిస్తుంది. అంతేకాకుండా ఇందుకు మరొక కారణం ఏంటంటే, మీరు వాహనం నడుపుతున్నప్పుడు క్రింది వారి సేఫ్టీకి కూడా మీరే బాధ్యులు అవుతారు:

* మీతోటి ప్రయాణికులు

* మీ సహచర డ్రైవర్లు

* ఇతర ప్రజల ఆస్తి

* పాదచారులు

* మీరు

కొనసాగింపు......

మీకు మోటార్ ఇన్సూరెన్స్ ఎందుకు అవసరం?

మీకు మోటార్ ఇన్సూరెన్స్ ఎందుకు అవసరం?

ఊహించని ప్రమాదం, దొంగతనాల వల్ల మీ వాహనానికి కలిగే డ్యామేజ్‌కు అయ్యే ఖర్చును లేదా మీకు శారీరకంగా సంభవించే గాయల చికిత్సకు అయ్యే ఖర్చులను కవర్ చేసేందుకు బీమా ఉపయోగపడుతుంది. భారతదేశంలో పైన తెలిపినవే కాకుండా, మీరు వాహనం నడిపేటప్పుడు కనీసం థర్డ్ పార్టీ మోటార్ ఇన్సూరెన్స్‌నైనా సరే కలిగి ఉండటం తప్పనిసరి.

మోటార్ ఇన్సూరెన్ పాలసీల వ్యవధి ఎంత?

మోటార్ ఇన్సూరెన్ పాలసీల వ్యవధి ఎంత?

మోటార్ ఇన్సూరెన్స్‌కు నిర్ధిష్ట వ్యవధి అంటూ ఏమీ ఉండదు. మీ వాహనాన్ని అన్ని వేళలా బీమా కల్పించబడి ఉండాలి. వాస్తవానికి బీమా కంపెనీలు ఒక్క ఏడాది కాలవ్యవధికి మాత్రమే వాహన యజమానితో బీమా ఒప్పందాన్ని కుదుర్చుకుంటాయి. ఆ తర్వాత ప్రతి ఏటా ఈ పాలసీని రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది.

మోటార్ ఇన్సూరెన్స్ పాలసీల్లో ఎన్ని రకాలున్నాయి?

మోటార్ ఇన్సూరెన్స్ పాలసీల్లో ఎన్ని రకాలున్నాయి?

ప్రస్తుతం మార్కెట్లో రెండు రకాల ఇన్సూరెన్స్ పాలసీలున్నాయి. అందులో ఒకటి మోటార్ పాలసీ ఏ, మరొకటి మోటార్ పాలసీ బి. 'మోటార్ పాలసీ ఏ'ని థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అని కూడా అంటారు. 'మోటార్ పాలసీ బి'ని కాంపర్‌హెన్సివ్ ఇన్సూరెన్స్ పాలసీ అంటారు. చట్టప్రకారం అయితే, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్‌ను కలిగి ఉంటే సరిపోతుంది. అయితే, దాని కన్నా కాంపర్‌హెన్సివ్ ఇన్సూరెన్స్ పాలసీని ఎంచుకోవటం ఎంతో ఉత్తమంగా ఉంటుంది.

ప్రీమియం మొత్తాన్ని ప్రభావితం చేసే అంశాలు ఏవి?

ప్రీమియం మొత్తాన్ని ప్రభావితం చేసే అంశాలు ఏవి?

* మీ వాహన బీమా కోసం చెల్లించే ప్రీమియం క్రింది అంశాలపై ఆధారపడి ఉంటుంది:

* వాహన ఇంజన్ క్యూబిక్ కెపాసిటీ (సీసీ)

* వాహనం యొక్క వయస్సు (తయారీ తేది నుంచి)

* భౌగోలిక ప్రాంతం

* మోడల్ రకం

* ఐడివి (ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వ్యాల్యూ)

థర్డ్ పార్టీ మోటార్ ఇన్సూరెన్స్ రిస్క్ పాలసీ అంటే ఏమిటి?

థర్డ్ పార్టీ మోటార్ ఇన్సూరెన్స్ రిస్క్ పాలసీ అంటే ఏమిటి?

థర్డ్ పార్టీ లయబిలిటీ ఇన్సూరెన్స్ అనేది ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్‌‌లో లేని మూడవ వ్యక్తికి జరిగే నష్టాలను కవర్ చేస్తుంది. క్రింది సందర్భాల్లో ఇది నష్టాలను కవర్ చేస్తుంది:

* బీమా చేయబడిన మీ వాహనం వలన అవతలి వ్యక్తికి సంభవించే శాస్వత వైకల్యం/మరణం.

* బీమా చేయబడిన మీ వాహనం వలన అవతలి వ్యక్తి ఆస్తికి (వాహనం మినహా) కలిగే నష్టం/డ్యామేజ్ .

మరణం లేదా గాయాల విషయంలో అపరిమిత మొత్తానికి కవరేజ్ ఉంటుంది. అయితే, థర్డ్ పార్టీ ప్రాపర్టీకి డ్యామేజ్ వాటిళ్లితే, ప్రైవేట్ కార్ల విషయంలో కవరేజ్ రూ.7.5 లక్షల వరకు అదే ద్విచక్ర వాహనం అయితే రూ.1 లక్ష వరకు కవరేజ్ కల్పించబడుతుంది.

మరి కాంపర్‌హెన్సివ్ మోటార్ ఇన్సూరెన్స్ పాలసీ అంటే ఏమిటి?

మరి కాంపర్‌హెన్సివ్ మోటార్ ఇన్సూరెన్స్ పాలసీ అంటే ఏమిటి?

సాధారణ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కన్నా ఎన్నో రెట్లు మెరుగైనది ఈ కాంపర్‌హెన్సివ్ మోటార్ ఇన్సూరెన్స్ పాలసీ. ఇది థర్డ్ పార్టీ పాలసీలో ఉన్న అన్ని కవరేజ్‌లతో పాటుగా, అగ్నిప్రమాదం, యాక్సిడెంట్, దొంగతనం, వరదలు, భూకంపం, అల్లర్లు మొదలైన వాటి వలన వాహనానికి సంభవించే నష్టాన్ని కూడా కవర్ చేస్తుంది. అంతేకాకుండా, మ్యూజిక్ సిస్టమ్, ఎయిర్ కండిషనర్ వంటి వాహన విడిభాగాలకు కూడా కవరేజ్ పొందవచ్చు. అయితే, అదనపు కవరేజ్ కోసం మీరు అదనపు మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది.

నో క్లెయిమ్ బోనస్ (ఎన్‌సిబి), బెనిఫిట్స్ అంటే అర్థం ఏమిటి?

నో క్లెయిమ్ బోనస్ (ఎన్‌సిబి), బెనిఫిట్స్ అంటే అర్థం ఏమిటి?

నో క్లెయిమ్ బోనస్ (ఎన్‌సిబి) అనేది మీ వాహనం యొక్క స్వంత డ్యామేజ్ (ఓడి) భాగం యొక్క ప్రీమియంపై ఇచ్చే డిస్కౌంట్. మీరు పాలసీని రెన్యువల్ చేసేటప్పుడు, అంతకు ముందు సంవత్సరంలో ఎలాంటి క్లెయిమ్ చేసి ఉండనట్లయితే, దీనిని చెల్లించడం జరుగుతుంది. ఎన్‌సిబిని ఓడి ప్రీమియంపై గరిష్టంగా 50 శాతం వరకు కూడబెట్టుకోవచ్చు.

ఎన్‌సిబి బెనిఫిట్స్ క్రింది విధంగా ఉంటాయి:

ఎన్‌సిబి బెనిఫిట్స్ క్రింది విధంగా ఉంటాయి:

* ఇన్సూరెన్స్ చేయబడిన మునపటి పూర్తి సంవత్సరంలో ఎలాంటి క్లెయిమ్ లేదా పెండింగ్ లేకపోతే - 20%

* ఇన్సూరెన్స్ చేయబడిన మునపటి 2 సంవత్సరాలలో ఎలాంటి క్లెయిమ్ లేదా పెండింగ్ లేకపోతే - 25%

* ఇన్సూరెన్స్ చేయబడిన మునపటి 3సంవత్సరాలలో ఎలాంటి క్లెయిమ్ లేదా పెండింగ్ లేకపోతే - 35%

* ఇన్సూరెన్స్ చేయబడిన మునపటి 4 సంవత్సరాలలో ఎలాంటి క్లెయిమ్ లేదా పెండింగ్ లేకపోతే - 45%

* ఇన్సూరెన్స్ చేయబడిన మునపటి 5 సంవత్సరాలలో ఎలాంటి క్లెయిమ్ లేదా పెండింగ్ లేకపోతే - 50%

ఆటో రిపేర్ ఇన్సూరెన్స్ మరియు ఆటో ఇన్సూరెన్స్‌ల మధ్య వ్యత్యాసం ఏమిటి?

ఆటో రిపేర్ ఇన్సూరెన్స్ మరియు ఆటో ఇన్సూరెన్స్‌ల మధ్య వ్యత్యాసం ఏమిటి?

ఆటో ఇన్సూరెన్స్ పాలసీ మీ కారు బ్రేక్‌‌డౌన్ అయినప్పుడు, దెబ్బతిన్నప్పుడు (వేర్ అండ్ టేర్) మరమ్మత్తులకు అయ్యే ఖర్చును కవర్ చేస్తుంది. అయితే, పాలసీలో ఇవి రెండు కలిసి ఉండాలన్న నిబంధనేమీ లేదు. కొన్ని కంపెనీలు కేవలం బ్రేక్‌డౌన్ కవరేజీని మాత్రమే ఆఫర్ చేస్తే, మరికొన్ని కంపెనీలు వేర్ అండ్ టేర్ కవరేజీని మాత్రమే ఆఫర్ చేస్తాయి.

కొనసాగింపు.....

ఆటో రిపేర్ ఇన్సూరెన్స్ మరియు ఆటో ఇన్సూరెన్స్‌ల మధ్య వ్యత్యాసం ఏమిటి?

ఆటో రిపేర్ ఇన్సూరెన్స్ మరియు ఆటో ఇన్సూరెన్స్‌ల మధ్య వ్యత్యాసం ఏమిటి?

బ్రేక్‌డౌన్ పాలసీని ఎంచుకుంటే, కారులో విరిగిపోయిన భాగాల మరమ్మత్తుకు అయ్యే ఖర్చుకు మాత్రమే కవరేజ్ ఉంటుంది. వేర్ అండే టేర్ పాలసీ ఎంచుకుంటే, చిరిగిపోయిన, విరిగిపోయిన భాగాలకు మాత్రమే కవరేజ్ ఉంటుంది. ఆటో ఇన్సూరెన్స్ మాదిరిగానే ఆటో రిపేర్ ఇన్సూరెన్స్ కూడా వాహన యజమానికి, ఇన్సూరెన్స్ కంపెనీలకు మధ్య కుదిరే ఓ ఒప్పందం. ఈ ఒప్పందంలో, ఒక నిర్ధిష్ట కాల సమయంలో వాహన మరమ్మత్తులకు అయ్యే ఖర్చును బీమా కంపెనీ భరిస్తుంది.

ఇన్సూరెన్స్‌ను క్లెయిమ్ చేసేటప్పుడు పాటించాల్సిన విధానం ఏమిటి?

ఇన్సూరెన్స్‌ను క్లెయిమ్ చేసేటప్పుడు పాటించాల్సిన విధానం ఏమిటి?

ఇన్సూరెన్స్‌ను క్లెయిమ్ చేయటానికి ఇన్సూరెన్స్ పాలసీ ప్రూఫ్‌తో పాటుగా వాహన రిజిస్ట్రేషన్ బుక్ ఒరిజినల్ మరియు కాపీ, యాక్సిడెంట్ సమయంలో వాహనం నడిపుతున్న వ్యక్తి ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ మరియు కాపీ, ఒకవేళ యాక్సిడెండ్ థర్డ్ పార్టీ ఇంజూరీ లేదా డ్యామేజ్‌తో కూడుకున్నట్లయితే ఎఫ్ఐఆర్ కాపీ, వర్క్‌షాప్ నుంచి మరమ్మత్తుల కోసం అయ్యే ఒరిజినల్ ఎస్టిమేషన్ కాపీలు అవసరమవుతాయి.

కొనసాగింపు....

ఇన్సూరెన్స్‌ను క్లెయిమ్ చేసేటప్పుడు పాటించాల్సిన విధానం ఏమిటి?

ఇన్సూరెన్స్‌ను క్లెయిమ్ చేసేటప్పుడు పాటించాల్సిన విధానం ఏమిటి?

ఈ కాపీలను ఇన్సూరెన్స్ కంపెనీకి సమర్పించిన తర్వాత, బీమా కంపెనీ ఓ సర్వేయర్‌ను నియమిస్తుంది. సదరు సర్వేయర్ కారు డ్యామేజ్‌ను పరీక్షించి, మరమ్మత్తులకు అయ్యే అంచనా ఖర్చును తనిఖీ చేస్తాడు. ఇలా ఇన్‌స్పెక్షన్ పూర్తయిన తర్వాత మాత్రమే కారుకు మరమ్మత్తులు చేయాలి. అనంతరం మరమ్మత్తు చేసిన కారుకు సంబంధించి, అందులో రీప్లేస్ చేసిన భాగాలకు సంబంధించి వర్క్‌షాప్ నుంచి పొంది ఒరిజినల్ రిసీప్టుతో కూడిన తుది బిల్లును తిరిగి బీమా కంపెనీకి సమర్పించాల్సి ఉంటుంది.

ఇన్సూరెన్స్‌ను క్లెయిమ్ చేసేటప్పుడు పాటించాల్సిన విధానం ఏమిటి?

ఇన్సూరెన్స్‌ను క్లెయిమ్ చేసేటప్పుడు పాటించాల్సిన విధానం ఏమిటి?

కారు రిపేరు పూర్తయిన తర్వాత ఫైనల్ ఎస్టిమేట్ ప్రకారం మీరు నగదు చెల్లించి, ఫైనల్ ఎస్టిమేట్‌ను మరియు స్టాంప్డ్ రిసీప్టులను క్లెయిమ్ సెటిల్‌మెంట్ కోసం ఇన్సూరెన్స్ కంపెనీకి సమర్పించాలి. ఆ తర్వాత మరోసారి సర్వేయర్ వచ్చి మీ కారును తనిఖీ చేసిన తర్వాత మాత్రమే వాహనాన్ని డెలివరీ తీసుకోవాల్సి ఉంటుంది.

ఇన్సూరెన్స్‌ను క్లెయిమ్ చేసేటప్పుడు పాటించాల్సిన విధానం ఏమిటి?

ఇన్సూరెన్స్‌ను క్లెయిమ్ చేసేటప్పుడు పాటించాల్సిన విధానం ఏమిటి?

ఒకవేళ మీ కారు దొంగిలించబడినట్లయితే, ముందుగా మీకు సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన తర్వాత, మీ బీమా కంపెనీకి కూడా విషయాన్ని తెలియజేయాలి. అంతేకాకుండా, మీ కారును తొలత ఎక్కడ రిజిస్టర్ అయిందో, అక్కడ సంబంధిత అధికారుల వద్ద కూడా మీరు ఓ కేసును రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. దొంగతనం విషయంలో మీరు ఆర్టీవో కార్యాలయం నుంచి ఓ నకలు ఆర్‌సీ పుస్తకాన్ని పొందాల్సి ఉంటుంది. దొంగిలించబడిన కారు విషయంలో ఆర్టీవో, పోలీసు అధికారులకు కొంత సమయం పడుతుంది కాబట్టి, ఇన్సూరెన్స్ క్లెయిమ్ కూడా ఆలస్యమవుతుంది.

Article Published On: Monday, September 23, 2013, 13:20 [IST]
English summary
Motor insurance is one of the most sought after insurance schemes. We answer some of the most asked questions with regards to Motor Insurance.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+