మోటార్ వాహన చట్టాలు - జరిమానాలు: మొదటి భాగం

* లైసెన్సు లేకుండా వాహనం నడపుతూ, ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడినట్లయితే, మోటార్ వాహన చట్టం (మో.వా.చ.)లోని సెక్షన్ 181 ప్రకారం.. ద్విచక్ర, నాలుగు చక్ర వాహనాలకు రూ.300 పెనాల్టీని, ఆరు చక్రాల వాహనాలు రూ.500 పెనాల్టీని చెల్లించాల్సి ఉంటుంది.
* రిజిస్ట్రేషన్ లేకుండా వాహనం నడపటం - (మో.వా.చ. సెక్షన్ 192 (1)) - ద్విచక్ర, త్రిచక్ర, నాలుగు చక్ర వాహనాలకు రూ.1,000 పెనాల్టీ. ఆరు చక్రాల వాహనాలు రూ.2,000 పెనాల్టీ.
* అనుమతి లేకుండా వాహనం నడపటం - (మో.వా.చ. సెక్షన్ 192 (A)) - కోర్టుకు లేదా ఆర్టీఏకు తీసుకువెళ్లబడుతుంది.
* బీమా (ఇన్సూరెన్స్) లేకుండా వాహనం నడపటం - (మో.వా.చ. సెక్షన్ 196) - ద్విచక్ర, త్రిచక్ర, నాలుగు చక్ర వాహనాలకు రూ.300 పెనాల్టీ. ఆరు చక్రాల వాహనాలు రూ.600 పెనాల్టీ.
* నిర్ధేశిత వయస్సు కన్నా తక్కువ వయస్సు కలిగిన వాహనం నడిపినట్లయితే - (మో.వా.చ. సెక్షన్ 181) - ద్విచక్ర, త్రిచక్ర, నాలుగు చక్ర వాహనాలకు రూ.3000 పెనాల్టీ. ఆరు చక్రాల వాహనాలు రూ.500 పెనాల్టీ.
Content Source: Hyderabad Traffic Police (HTP)


Click it and Unblock the Notifications








