మోటార్ వాహన చట్టాలు - జరిమానాలు: రెండవ భాగం
గడచిన కథనంలో సరైన దృవీకరణ పత్రాలు లేకుండా రోడ్డు ప్రయాణిస్తూ ట్రాఫిక్ పోలీసులకు చిక్కినట్లయితే ఏయే తప్పులకు ఎంత జరిమానా కట్టాలో తెలుగు డ్రైవ్ స్పార్క్ టీమ్ ప్రచురించిన సంగతి తెలిసిందే. కాగా.. ఆ కథనానికి కొనసాగింపుగా 'మోటార్ వాహన చట్టం' (మో.వా.చ) ప్రకారం, ఈ కథనంలో "డ్రైవింగ్"కు సంబంధించిన తప్పులకు ఎంత జరిమానా కట్టాలో తెలుసుకుందాం...!
* 'నో ఎంట్రీ' నిబంధనను ఉల్లంఘించటం - (మో.వా.చ. సెక్షన్ 177) - ద్విచక్ర / త్రిచక్ర వాహనాలకు రూ.50-200 పెనాల్టీ. నాలుగు / ఆరు చక్రాల వాహనాలకు రూ.100-200 పెనాల్టీ.
* 'వన్ వే' నిబంధనను ఉల్లంఘించటం - (మో.వా.చ. సెక్షన్ 177) - ద్విచక్ర / త్రిచక్ర వాహనాలకు రూ.50-200 పెనాల్టీ. నాలుగు / ఆరు చక్రాల వాహనాలకు రూ.100-200 పెనాల్టీ.
* 'యూ టర్న్' నిబంధనను ఉల్లంఘించటం - (మో.వా.చ. సెక్షన్ 177) - ద్విచక్ర / త్రిచక్ర వాహనాలకు రూ.50-200 పెనాల్టీ. నాలుగు / ఆరు చక్రాల వాహనాలకు రూ.100-200 పెనాల్టీ.
* 'నిషిద్ద ప్రాంతం' (ప్రొహిబిటెడ్ ఏరియా) నిబంధనను ఉల్లంఘించటం - (మో.వా.చ. సెక్షన్ 177) - ద్విచక్ర / త్రిచక్ర వాహనాలకు రూ.50-200 పెనాల్టీ. నాలుగు / ఆరు చక్రాల వాహనాలకు రూ.100-200 పెనాల్టీ.
* పోలీసులు అధికారులు 'జారీ చేసిన' నిబంధనను ఉల్లంఘించటం - (మో.వా.చ. సెక్షన్ 177) - ద్విచక్ర / త్రిచక్ర వాహనాలకు రూ.50-200 పెనాల్టీ. నాలుగు / ఆరు చక్రాల వాహనాలకు రూ.100-200 పెనాల్టీ.
* అధిక వేగం, ర్యాష్/నిర్లక్ష్యపు డ్రైవింగ్ - (మో.వా.చ. సెక్షన్ 184 (బి)) - ద్విచక్ర / త్రిచక్ర వాహనాలకు రూ.200 పెనాల్టీ. నాలుగు / ఆరు చక్రాల వాహనాలకు రూ.300 పెనాల్టీ.
* ఇతరుల ప్రాణాలకు హాని కలిగించేలా ప్రమాదభరితంగా వాహనాన్ని డ్రైవ్ చేయటం - (మో.వా.చ. సెక్షన్ 184 (బి)) - ద్విచక్ర / త్రిచక్ర వాహనాలకు రూ.200 పెనాల్టీ. నాలుగు / ఆరు చక్రాల వాహనాలకు రూ.300 పెనాల్టీ.
* ఇతర ప్రజల ప్రాణాలకు హాని కలిగించేలా ప్రమాదభరితంగా వాహనాన్ని డ్రైవ్ చేయటం - (ఐ.పి.సి (ఇండియన్ పీనల్ కోడ్) సెక్షన్ 279) - కోర్టుకు హాజరు కావలసి ఉంటుంది.


Click it and Unblock the Notifications









