ట్రాఫిక్‌లో ఉన్నప్పుడు ఈ పొరపాట్లు చేశారో.. ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
ప్రధాన నగారాల్లో ట్రాఫిక్ అనేది తీవ్రమైన సమస్యగా మారుతోంది. పెరుగుతున్న పట్టణీకరణ, ఉద్యోగాలు, చదువుల కోసం నగరాలకు వలస వెళ్లడం వంటి కారణాల వల్ల రోజురోజుకీ రోడ్లు రద్దీగా మారుతున్నాయి. ఈ క్రమంలో ట్రాఫిక్‌లో ప్రయాణించాలంటే ఎవరికైనా తలనొప్పిగానే ఉంటుంది. కానీ ఈ సమయంలో వాహనదారులకు ఓపిక చాలా అవసరం.
హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబయి, ఢిల్లీ, పూణె వంటి నగరాల్లో ప్రయాణికులను నిత్యం ట్రాఫిక్ సమస్య వేధిస్తూనే ఉంటుంది. గంటల తరబడి ట్రాఫిక్‌లో వెయిట్ చేస్తేనే కానీ గమ్య స్థానాలకు చేరలేకపోతున్నాం. ట్రాఫిక్‌ను తగ్గించేందుకు ఫ్లై ఓవర్లు, మెట్రోలు, అండర్‌పాస్‌లు వచ్చినప్పటికీ.. ఈ సమస్య ఉంటూనే ఉంటుంది.

అయితే ట్రాఫిక్‌లో ఉన్నప్పుడు వాహనదారులు చాలా మందికి ఓపిక ఉండదు. కొందరు గ్రీన్ సిగ్నల్ పడకముందే వాహనాన్ని స్టార్ట్ చేస్తుంటారు. మరికొంరదరు అసహనం వ్యక్తం చేస్తుంటారు. ఈ క్రమంలో ఇలాంటి పరిస్థితుల్లో ఓపిక తెచ్చుకునేందుకు వాహనదారులు కొన్ని విషయాలు తప్పక గుర్తుంచుకోవాలి.
ముందుగా ట్రాఫిక్‌లో ఉన్నప్పుడు కూడా మీ సెల్‌ఫోన్‌ను ఆఫ్ చేయడం లేదా సైలెంట్ మోడ్‌లో ఉంచాలని గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత మీ కారులో మీకు ఇష్టమైన మ్యూజిక్‌ను ప్లే చేసి లో వాల్యూమ్‌లో ఉంచండి. దీని ద్వారా వెనుక వచ్చే వాహనాల, అంబులెన్స్ హారన్ శబ్దాలు మీ బ్రెయిన్‌కు ఒత్తిడి కలిగించకుండా.. మిమ్మల్ని ప్రశాంతంగా ఉంచుతుంది.

కొన్నిసార్లు ఓపిక లేని డ్రైవర్లు చాలా వేగంగా మరియు ప్రమాదకరంగా డ్రైవ్ చేస్తుంటారు. ఇది చాలా ప్రమాదకరం. కాబట్టి మీ దృష్టిని ఎల్లప్పుడూ రహదారిపై ఉంచడానికి ప్రయత్నించండి. ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటూ.. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కూడా మీ లేన్‌లో ఉండటానికి ప్రయత్నించండి. టర్నింగ్ ఇండికేటర్లను ఆన్‌లో ఉంచడం మర్చిపోవద్దు.
సాధ్యమైనంత వరకూ ట్రాఫిక్ జామ్ లేని రోడ్లపై ప్రయాణించేలా ప్లాన్ చేసుకోండి. దీని ద్వారా త్వరగా మీ గమ్యస్థానానికి చేరుకోవచ్చు. ట్రాఫిక్ బ్లాక్ వద్ద ముందు ఉన్న వాహనం నుండి ఎల్లప్పుడూ సురక్షితమైన దూరం ఉండేలా జాగ్రత్త వహించాలి. ఏదైనా వాహనం మీకు సమీపంలో వెనుక ఉండటం చాలా ప్రమాదకరం.

మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీరు ట్రాఫిక్ బ్లాక్‌లో వాహనాన్ని ఓవర్ స్పీడ్‌తో వెళ్లలేరు. కాబట్టి నెమ్మదిగా వెళ్లాలని గుర్తుంచుకోవాలి. మీరు వాహనాన్ని ఎలా కంట్రోల్ చేస్తున్నారో.. అదే మీ మూడ్‌ను తెలియజేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో కూల్‌గా ఉంటూ స్లోగా ప్రయాణించాలి.
ఇంకా కారులో వెళ్తున్నప్పుడు ఎడమ లేదా కుడివైపు తిరిగే ముందు స్టీరింగ్ వీల్‌ను ముందుగా తిప్పడం చాలా ప్రమాదకరమని యజమానులు గమనించాలి. స్టీరింగ్ వీల్ ప్రారంభ స్థానంలో మాత్రమే ఉండాలి. మీ వాహనాన్ని వెనుక నుండి కారు ఢీకొంటే, మీ కారు వ్యతిరేక దిశలో వెళ్లిపోతారు. దీని ద్వారా ప్రాణనష్టం వాటిల్లే అవకాశం ఉంది.

మీరు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు హై బీమ్ లైట్లను సరైన పద్ధతిలో మాత్రమే ఉపయోగించాలి. హై బీమ్‌ని ఉపయోగించడం వల్ల ఎదురుగా వచ్చే డ్రైవర్లకు సమస్యలు తలెత్తుతాయి. ఎందుకంటే అది వారి విజిబిలిటీపై ప్రభావం చూపిస్తుంది. కాబట్టి అవసరమైన పరిస్థితుల్లో హై బీమ్ లైట్లను ఉపయోగించాలి.
డ్రైవింగ్ చేసేటప్పుడు, మీ ముందు ఉన్న వాహనాలపై మీరు శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా పొడవాటి వాహనాలు నడిపే వారికి రోడ్డుపై మంచి వ్యూ లభిస్తుంది. వారు లేన్‌లను మార్చినా లేదా ఆగిపోయినా, వారిని ఫాలో అవ్వండి. దీని ద్వారా రహదారిపై అడ్డంకులను మీరు సులభంగా అధిగమించవచ్చు. ఈ చిట్కాలు పాటించడం ద్వారా మీరు ట్రాఫిక్‌లో సురక్షితమైన డ్రైవింగ్‌ను ఆస్వాదించవచ్చు.


Click it and Unblock the Notifications








