కొత్త బైకును కొనుగోలు చేసేటప్పుడు పరిగణలోకి తీసుకోవాల్సిన అంశాలు

చాలా మంది పాఠకులు ఏ బైకును ఎంచుకోవాలి అని డ్రైవ్‌స్పార్క్ తెలుగును సంప్రదిస్తున్నారు. కాబట్టి, ఇవాళ్టి కథనంలో బైకును ఎంచుకునే ముందు పరిగణలోకి తీసుకోవాల్సిన అంశాలు గురించి తెలుసుకుందాం రండి...

By Anil Kumar

చాలా మంది పాఠకులు ఏ బైకును ఎంచుకోవాలి అని డ్రైవ్‌స్పార్క్ తెలుగును సంప్రదిస్తున్నారు. కాబట్టి, ఇవాళ్టి కథనంలో బైకును ఎంచుకునే ముందు పరిగణలోకి తీసుకోవాల్సిన అంశాలు గురించి తెలుసుకుందాం రండి...

కొత్తగా బైకు కొంటున్నపుడు ఏయే అంశాలను గమనించాలి

అవసరం

తమ రోజూ వారి జీవనంలో బైకు తప్పనిసరి అనిపించినపుడు, బైకు కొనుగోలు చేయాల్సిన సందర్భం ఖచ్చితంగా వస్తుంది. అయితే ఇక్కడ ఎలాంటి అవసరాలకు బైకును కొనుగోలుచేస్తున్నారనేది ముఖ్యమైన అంశం. ఫుడ్ డెలివరీ, కొరియర్ డెలివరీ, ఇంటి నుండి ఆఫీసుకి, లాంగ్ రైడింగ్ కోసం. ఇలా అవసరాన్ని బట్టి బైకులను సెలక్ట్ చేసుకోవాలి.

కొత్తగా బైకు కొంటున్నపుడు ఏయే అంశాలను గమనించాలి

250సీసీ అంత కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న బైకులు క్రూయిజర్, స్పోర్ట్స్ మరియు కఫే రేసర్ సెగ్మెంట్లో ఉన్నాయి. ఇండియన్ మార్కెట్లో లభించే అత్యంత శక్తివంతమైన బైకుల్లో గరిష్టంగా 2000సీసీ సామర్థ్యం గల నాలుగు సిలిండర్ల ఇంజన్‌లు ఉన్నాయి.

కొత్తగా బైకు కొంటున్నపుడు ఏయే అంశాలను గమనించాలి

డబ్బు ఏ మాత్రం మ్యాటర్ కాదు, విలాసవంతమైన మరియు అత్యంత ఖరీదైన బైకును ఎంచుకోవాలనుకునే రిచ్ కిడ్స్ కోసం లక్షలు ఖరీదు చేసే బైకులు కూడా మార్కెట్లో ఉన్నాయి. బిఎమ్‌డబ్ల్యూ మోటారాడ్ ఇటీవల రూ. 85 లక్షల ధరతో విడుదల చేసిన హెచ్‌పి4 బైక్ ఇందుకు నిదర్శనం.

కొత్తగా బైకు కొంటున్నపుడు ఏయే అంశాలను గమనించాలి

మైలేజ్

భారతీయులు మైలేజ్ ప్రియులు ఇందులో ఎలాంటి సందేహం లేదు. కోట్లు వెచ్చించి కొనుగోలు చేసే కార్లనైనా మైలేజ్ ఎంతని అడుగుతుంటారు. కాబట్టి, ఎంచుకునే బైకు ఎలాంటిదైనా మైలేజ్ అంశం తప్పనిసరి.

కొత్తగా బైకు కొంటున్నపుడు ఏయే అంశాలను గమనించాలి

మార్కెట్లో లీటరుకు 10 నుండి 100 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే బైకులు ఉన్నాయి. బజాజ్ ప్లాటినా, సిటి100 మరియు హీరో ప్యాసన్ ఐస్మార్ట్ వంటి బైకులు అత్యధిక మైలేజ్ ఇచ్చే బైకుల జాబితాలో ఉన్నాయి. కాస్తంత శక్తివంతమైన ఇంజన్ గల బైకులు లీటరుకు 40 నుండి 50 కిమీల మధ్య మైలేజ్ ఇస్తున్నాయి(ఉదాహరణకు: 125సీసీ నుండి 160సీసీ ఇంజన్ కెపాసిటి గల బైకులు).

కొత్తగా బైకు కొంటున్నపుడు ఏయే అంశాలను గమనించాలి

చివరిగా పర్ఫామెన్స్...

మైలేజ్, స్టైల్, ఇంజన్‌తో పాటు పర్ఫామెన్స్ మరో ముఖ్యమైనం అంశం. బైకు పర్ఫామెన్స్ నిజానికి బైకులో ఉన్న ఇంజన్ మీద ఆధారపడి ఉంటుంది. ఇంజన్ సీసీ పెరిగేకొద్దీ పర్ఫామెన్స్ పెరుగుతుంది. 100సీసీ బైకులు సగటున 8బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేస్తే, 200సీసీ బైకులు సగటున 20బిహెచ్‌పి పవర్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి.

కొత్తగా బైకు కొంటున్నపుడు ఏయే అంశాలను గమనించాలి

బైకులు కొనుగోలు చేసేటపుడు పరిగణలోకి తీసుకోవాల్సిన అంశాలు ఇవండీ... కొత్త బైకును కొనుగోలు చేస్తున్నపుడు ఏదైనా అనుమానం లేదా అయోమయం కలిగే డ్రైవ్‌స్పార్క్ తెలుగును సలహా అడగడం మరిచిపోకండి.

Most Read Articles

English summary
Read In Telugu: New Bike Buying Tips: Mileage, Price, Engine, Style And Features
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X