మీ కారును ప్యారలల్ పార్క్ చేయటం ఎలా? - పార్కింగ్ చిట్కాలు

By Ravi

కారు నడపటంలో ఎంత నైపుణ్యం ఉన్నప్పటికీ, కొన్ని సందర్భాల్లో కారును పార్కింగ్ చేయటంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి ఇరుకుగా ఉండే ప్రాంతాల్లో పార్క్ చేయాల్సి వచ్చినప్పుడు లేదా ప్యారలల్ పార్కింగ్ చేయాల్సి వచ్చినప్పుడు కొత్త వారికి కాస్తంత ఇబ్బంది గానే ఉంటుంది. సాధారణ పార్కింగ్‌కు ప్యారలల్ పార్కింగ్‌కు చాలా వ్యత్యాసం ఉంటుంది.

ప్యారలల్ పార్కింగ్ చేయటానికి సరైన క్యాలుక్యులేషన్ మరియు అవగాహన ఎంతో అవసరం. అనేకసార్లు ప్రయత్నిస్తే తప్ప సులువుగా ప్యారలల్ పార్కింగ్ చేయటం సాధ్యం కాదు. రోడ్డుకు పక్కగా ముందు కారుకు మరియు వెనుక కారుకు మధ్యలో కారును పార్క్ చేయటాన్ని ప్యారలల్ పార్కింగ్ అంటారు. మరి ఈ ప్యారలల్ పార్కింగ్‌ను ఎలా చేయాలో ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

ప్యారలల్ పార్క్ చేయటం ఎలా?

కారును ఎలా ప్యారలల్ పార్క్ చేయాలో తర్వాతి స్లైడ్‌లలో చూడండి.

1. స్థలాని గుర్తించడం

1. స్థలాని గుర్తించడం

అభివృద్ధి చెందిన దేశాల్లో అయితే, ప్యారలల్ పార్కింగ్ కోసం నిర్థిష్టమైన స్థలం కేటాయించబడి ఉంటుంది. కానీ, మన రోడ్లపై ఇష్టం వచ్చినట్లుగా వాహనాలను గజిబిజిగా పార్క్ చేస్తుంటారు. కాబట్టి, ప్యారలల్ పార్కింగ్ కోసం సరైన స్థలాన్ని వెతుక్కోవాలి. పార్క్ చేసిన కార్లకు పక్కగా మీ కారును డ్రైవ్ చేసుకుంటూ వెళ్లి, ఖాలీ స్థలానికి ఎదురుగా మీ వాహనాన్ని నిలిపి, ఆ స్థలంలో మీ కారు సరిపోతుందో లేదో అంచనా వేసుకోవాలి.

 2. పార్క్ చేసిన కార్లకు పక్కనే డ్రైవ్ చేయాలి

2. పార్క్ చేసిన కార్లకు పక్కనే డ్రైవ్ చేయాలి

ప్యారలల్ పార్కింగ్ స్థలాన్ని వెతుక్కున్న తర్వాత, అప్పటికే ఆ లైన్‌లో పార్క్ చేసిన ఉన్న కార్లకు సమాంతరంగా, మీ కారుకు మరియు పక్కన కార్లకు దాదాపు మోచేయి పట్టేంత దూరం ఉండేలా చూసుకుంటూ, ఇండికేటర్ ఆన్ చేసుకొని డ్రైవ్ చేయాలి. మీ కారును మీరు గుర్తించిన ఖాలీ ప్రదేశానికి ముందున్న కారు వరకూ పక్కనే డ్రైవ్ చేసుకుంటూ వెళ్లాలి, మీ కారు వెనుక చక్రాలు, మీ ముందు పార్క్ చేసి ఉన్న కారు వెనుక భాగం వరకూ ఉండేలా క్యాలుక్యులేట్ చేసుకోవాలి.

3. రివర్స్ చేయటం

3. రివర్స్ చేయటం

ప్యారలల్ పార్కింగ్‌లో అత్యంత కీలకమైన ఘట్టం, పార్కింగ్ ప్రదేశంలోకి మీ కారును తీసుకువెళ్లటం. ఇందులో క్యాలుక్యులేషన్ మిస్ అయితే, మీ కారు ముందున్న వాహనాన్నో లేక వెనకున్న వాహనాన్నో ఢీకొట్టడం ఖాయం. రివర్స్ గేర్ వేసిన తర్వాత స్టీరింగ్ వీల్‌ని పూర్తిగా ఎడమ వైపుకు (అదే రోడ్డుకు ఎడమ ప్రక్కన ప్యారలల్ పార్క్ చేసేటట్లయితే, స్టీరింగ్‌ను పూర్తిగా కుడి వైపుకు) టర్న్ చేయాలి. ఇలా రివర్స్ చేసేటప్పుడు కారు దాదాపు 45 డిగ్రీల కోణంలో వెనక్కి తిరిగుతుంది.

4. స్టీరింగ్ స్ట్రెయిట్

4. స్టీరింగ్ స్ట్రెయిట్

కారును 45 డిగ్రీల కోణంలో రివర్స్ చేసినప్పుడు దాదాపు సగభాగం కారు పార్కింగ్ ప్రదేశంలోకి చేరుతుంది, ఈ సమయంలో మీరు స్టీరింగ్‌ని స్ట్రెయిట్ చేసి, పేవ్‌మెంట్‌కి దాదాపు కొన్ని అడుగులు దూరం ఉండే వరకూ డ్రైవ్ చేసి, తిరిగి స్టీరింగ్ పూర్తిగా కుడివైపుకు టర్న్ చేయాలి. ఇలా రివర్స్ చేసేటప్పుడు కూడా కారు దాదాపు 45 డిగ్రీల కోణంలో వెనక్కి తిరిగుతుంది.

5. కారును స్ట్రెయిట్ చేయటం

5. కారును స్ట్రెయిట్ చేయటం

ఇలా స్టీరింగ్‌ను కుడి, ఎడమ వైపులకు రెండు సార్లు తిప్పుతూ డ్రైవ్ చేయటం ద్వారా కారు పార్కింగ్ ప్రదేశంలోకి వచ్చి చేరుతుంది. అలా చేసిన స్టీరింగ్‌ను స్ట్రెయిట్ చేసి, కారును నేరుగా పార్క్ చేయాలి. ఇలా చేసేటప్పుడు మీ కారుకు ముందు, వెనుక ఉన్న కార్లు ఫ్రీగా మూవ్ అయ్యేంతటి స్పేస్ ఉండేలా చూసుకోవాలి.

వీడియో

యారలల్ పార్కింగ్‌కు సంబంధించి సిఎన్ఈటి ఓ వీడియోని తయారు చేసింది. ఇందులో సులువుగా మరియు సరిగ్గా ఎలా ప్యారలల్ పార్కింగ్ చేయాలో వివరించారు. మరి ఆ వీడియోని చూసి, మనం కూడా ప్యారలల్ పార్కింగ్ నేర్చుకుద్దాం రండి..!

More from DriveSpark

Article Published On: Monday, January 12, 2015, 10:06 [IST]
English summary
We bring you a crash course in parallel parking that will help you deal with parking your car in this manner. So read on and build up that all-important confidence.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+