కార్లను రోజుల తరబడి ఒకేచోట పార్క్ చేసి పట్టించుకోవడం లేదా? అలా చేస్తే జరిగే నష్టాలు ఏంటో తెలుసుకోండి!
మనలో చాలా మంది రోజుల తరబడి కార్లను ఒకే చోట నిలిపి ఉంచుతారు. ఇలా చేయడం ద్వారా మీ కారులోని కొన్ని భాగాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. మీ కారును రోజుల తరబడి ఒకేచోట ఉపయోగించకుండా వదిలేస్తే కారులో చాలా భాగాలు దెబ్బతింటాయి. ఇది మీకు అదనపు ఖర్చు అవుతుంది. ఓకేచోట వారాల పాటు పార్క్ చేయడం వల్ల కారులోని ముఖ్యమైన భాగాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. కొన్ని ధీర్ఘకాలంలో బయటపడే అవకాశం ఉంటుంది. ముందుగా మీ కారు చాలా రోజులు ఒకే చోట ఉంటే కారు బ్యాటరీ డిశ్చార్జ్ అవుతుంది. దీనివల్ల మీ కారు ఆఫ్‌లో ఉన్నా కానీ బ్యాటరీ ద్వారా పనిచేసే ఇతర సిస్టమ్స్ పూర్తిగా బ్యాటరీని డౌన్ చేస్తాయి.
తుప్పు పట్టే అవకాశం: ఆ తర్వాత కారును ఒకే చోట ఎక్కువ సేపు పార్క్ చేస్తే టైర్లలోని పీడనం తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఇది గమనించకుండా డ్రైవింగ్ చేయడం వల్ల ప్రమాదాలకు ఆస్కారం ఏర్పడుతుంది. మీ పార్కింగ్ ఏరియాలో ఎక్కువ తేమ ఉంటే బ్రేకులు తుప్పు పట్టే అవకాశం ఉంటుంది. బ్రేక్ ప్యాడ్స్, డిస్క్ లపై తుప్పు ఏర్పడి వాటి పనితీరుని తగ్గిస్తాయి.

ఇంజిన్ చెడిపోయే అవకాశం: కారును ఎక్కువ కాలం ఉపయోగించకపోతే, ట్యాంకులోని ఇంధనం చెడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది ఇంజిన్‌లోని సమస్యలను జఠిలం చేస్తుంది. ఫ్యూయల్ ట్యాంకులో తేమ ఎక్కువైతే అది ఫ్యూయల్ సిస్టమ్‌కి హానికరం. కారులోని ఇంజిన్ ఆయిల్, కూలెంట్, బ్రేక్ ఫ్లూయిడ్ వంటి వివిధ ద్రవాలు కాలక్రమేణా తగ్గిపోతాయి. ఇది కారు పనితీరును తగ్గిస్తుంది. అంతే కాకుండా ఇంజిన్ ద్వారా ప్రభావితమయ్యే ముఖ్యమైన పార్ట్స్‌కి నష్టం కలిగిస్తుంది.
ఏసీపై ప్రభావం: ఒకే చోట ఎక్కువ సేపు ఉంచడం వల్ల రబ్బరు సీల్స్, గ్యాస్‌కిట్లు ఎండిపోతాయి. దీనివల్ల చమురు లేదా ఇతర గ్రీజ్ వంటి ద్రవాలు లీక్ అవుతాయి. ఎగ్జాస్ట్ పైప్‌లో తేమ పేరుకుపోవడం తుప్పు పట్టే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇక ఏసీ సిస్టమ్‌ని ఎక్కువ సేపు వినియోగించకుంటే అది ఫంగల్ పెరుగుదల లేదా తుప్పుకి ఆస్కారం ఏర్పడుతుంది. తద్వారా కారు ఆన్ చేసినప్పుడు ఏసీ పనితీరుని తగ్గిస్తుంది.

ఈ సమస్యలను నివారించడానికి, మీ కారును క్రమానుగతంగా స్టార్ట్ చేయండి. అవసరమైతే కొన్ని నిమిషాల పాటు డ్రైవ్ చేయండి. టైర్‌ప్రెజర్‌ని క్రమం తప్పకుండా చెక్ చేయండి. ఇక అత్యంత ముఖ్యంగా బ్యాటరీని డిస్ కనెక్ట్ చేయండి. దాని ఛార్జ్‌ని మెయింటైన్ చేయడం కొరకు ట్రికల్ ఛార్జర్ ఉపయోగించండి. తేమ చేరకుండా ఉండటానికి, మీ కారును పొడి, నీడ ఉన్న ప్రదేశంలో పార్క్ చేయండి.
కారు ఎక్కువ రోజులు ఎండలో ఉండటం వల్ల డెంటిగ్ ఏర్పడి కలర్ తొలగిపోయే అవకాశం ఉంటుంది. అలానే ఎక్కువ రోజులు ఉండటం వల్ల కారు పూర్తిగా షైనింగ్ లుక్‌ని కోల్పోతుంది. సరైన పార్కింగ్ లేకపోతే వైపర్లు, మిర్రర్స్, సైడ్ మిర్రర్స్ కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఈ జాగ్రత్తలు పాటించడం ద్వారా, మీరు మీ కారును ఎక్కువ సేపు నిలిపి ఉంచితే ఏర్పడే సమస్యలను అధిగమించవచ్చు.

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








