పెట్రోల్ కార్ వర్సెస్ డీజిల్ కార్: ఏది బెస్ట్, ఎందుకు?

పెట్రోల్ నిల్వలు పూర్తిగా ఆగిపోయే వరకూ పెట్రోల్ కార్ల హవా సాగుతూనే ఉంటుంది. పెట్రోల్ కార్లతో పోల్చుకుంటే డీజిల్ కార్లు ఎక్కువ మైలేజీనిస్తున్నప్పటికీ, కొనుగోలుదారులు మాత్రం పెట్రోల్ కార్లపైనే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. భారత్‌లో 2013 ఆటోమొబైల్ ట్రెండ్‌ను గమనిస్తే, పెట్రోల్ కార్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి.

డీజిల్ కార్ల అమ్మకాలు తగ్గటానికి ప్రధాన కారణం ఏంటంటే, గడచిన కొద్ది నెలలుగా గమనిస్తే దీని ధర ప్రతినెలా పెరుగుతూ వస్తోంది. ఈ పెంపు మరికొద్ది రోజుల వరకు కొనసాగే ఆస్కారం ఉంది. అంటే కొద్ది రోజుల తర్వాత డీజిల్, పెట్రోల్ ఇంధనాల మధ్య వత్యాసం గణనీయంగా తగ్గిపోతుంది. అప్పుడు డీజిల్ కార్ల రన్నింగ్ కాస్ట్ కూడా పెరిగే ఆస్కారం ఉంటుంది.


ఇలాంటి పరిస్థితుల్లో కొనుగోలుదారులు పెట్రోల్ కార్ల కన్నా ఎక్కువ ధర కలిగిన డీజిల్ కార్లను ఎందుకు కొనుగోలు చేయాలి? ఇలా ఆలోచించే ప్రతి కస్టమర్ కూడా డీజిల్ కారు కొనాలనుకున్న తన కోరికను పక్కనపెట్టి పెట్రోల్ కారును కొనుగోలు చేస్తున్నారు.

ప్రస్తుతం మన మార్కెట్లో లభిస్తున్న అత్యంత చవకైన పెట్రోల్ కారు టాటా నానో (ప్రారంభ ధర రూ.1.5 లక్షలు)గా ఉంది. దీని తర్వాత మారుతి ఆల్టో, హ్యుందాయ్ శాంత్రో, మారుతి వ్యాగన్ఆర్ వంటి కార్లు అందుబాటులో ఉన్నాయి (అన్ని ధరలు రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల రేంజ్‌లో). అలాగే, అత్యంత చవకైన డీజిల్ కారు టాటా ఇండికా ఈవి2 (ప్రారంభ ధర రూ.4.01 లక్షలు)గా ఉంది. దీని తర్వాత చవక డీజిల్ కార్లంటే టాటా విస్టా టిడిఐ, చెవర్లే బీట్ డీజిల్, ఫోర్డ్ ఫిగో డీజిల్ (అన్ని ధరలు రూ.4.5 లక్షలకు ఎగువన)గా చెప్పుకోవచ్చు.


సగటున నెలకు 600-800 కిలోమీటర్ల దూరం ప్రయాణించే వారికి పెట్రోల్ కారు అలాగే, సగటున నెలకు 1500-2000 కిలోమీటర్ల దూరం ప్రయాణించే వారికి డీజిల్ కారు లాభదాయకంగా ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, October 9, 2013, 8:13 [IST]
English summary
There is always the question of what is the best choice when it comes down to a petrol car and a diesel car? In the current scenario we would definitely lean towards a petrol car. We look at how the demand for petrol passenger cars are steadily increasing.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+