ఇవి కచ్చితంగా పాటిస్తే.. వర్షాకాలంలో కారులో ఎలాంటి చీడపురుగులైన బయటకే..
వర్షాకాలంలో కారు యజమానులు తరుచుగా పలు సమస్యలు ఎదుర్కొంటుంటారు. ముఖ్యంగా ఈ సీజన్‌లో చీడపురుగులు కారు లోపలికి చేరి కారును అపరిశుభ్రంగా మార్చడంతో పాటు, ఇవి ఇంజిన్ ఫంక్షన్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి. అలాగే చీమలు, బొద్దింకలు, ఎలుకలు మొదలగు వాటి ద్వారా ఇంటీరియర్ డిజైన్ సైతం చెడిపోతుంది. అందుకే చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వలన లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన కారును వర్షాకాలంలో చీడ పురుగులు, బొద్దింకలు వంటి వాటి నుంచి కాపాడుకోవచ్చు. కారును ఈ సీజన్‌లో కాపాడుకోడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎంటో ఒకసారి చూద్దాం
కారులో ఆహార పదార్థాలు ఉంచవద్దు: చీడ పురుగులు కారు లోపలికి వెళ్లడానికి ప్రధాన కారణం ఆహార పదార్థాలు ఉంచడం. కారులో ఇవి ఉన్నట్లయితే పురుగులు వాటికి ఆకర్షితమై లోపలికి వచ్చే అవకాశం ఉంది. ఎప్పటికప్పుడు కారులో తినగా మిగిలిన ఆహార పదార్థాలు తీసివేయడం ద్వారా పురుగులు కారు లోపల ఉండటానికి అవకాశం ఉండదు.

ఎంట్రీ పాయింట్ల సీల్: కారులో ఉన్న చిన్న రంధ్రాల ద్వారా కీటకాలు తరుచుగా లోపలికి వస్తుంటాయి. కాబట్టి కారులో ఏవైనా పగుళ్లు లేదా రంధ్రాలు ఉన్నాయా, ఇంకా ప్రత్యేకించి తలుపులు, కిటికీల చుట్టూ గ్యాప్‌లు ఉన్నాయా అని చెక్ చేసి కీటకాలు లోపలికి రావడానికి కారణమయ్యే గ్యాప్‌లను మూసివేయాలి.
సహజ రసాయనాలు: పిప్పరమెంటు లేదా యూకలిప్టస్ వంటి నూనెలను కారు లోపల స్ప్రే చేయడం ద్వారా చీడ పురుగులు బయటకు వెళ్ళిపోయే అవకాశం ఉంది. అలాగే, ఇతర పురుగులు సైతం కారు లోపలికి రాకుండా ఉంటాయి. ఇంకా ఇలా స్ప్రే చేయడం ద్వారా లోపల మంచి సువాసన కూడా వస్తుంది. అయితే ఈ విధానం కోసం కఠినమైన రసాయనాలను ఉపయోగించకూడదు.
పార్కింగ్ ఏరియా: మీ కారుని పార్క్ చేసే చోట అపరిశుభ్ర వాతావరణం ఉండటం ద్వారా కూడా అక్కడ ఉన్న పురుగులు వంటివి కారు లోపలికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కారును చెత్త డబ్బాల దగ్గర పార్కింగ్ చేయడం వంటివి చేయవద్దు. వీలైతే, గ్యారేజీలో లేదా శుభ్రమైన ప్రదేశంలో పార్క్ చేయాలి.
రెగ్యులర్ క్లీనింగ్: కారును ఎప్పటికప్పుడు రెగ్యులర్ క్లీనింగ్ కచ్చితంగా చేయాలి. కారులో పేరుకుపోయిన చెత్తను తీసి వేయడం ద్వారా పురుగులు కారు లోపల ఉండటానికి అవకాశం ఉండదు. దీంతో కారును అందంగా, శుభ్రంగా ఉంచడంతో పాటు డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, జలుబు, ఫ్లూ మొదలైన ఇన్ఫెక్షన్ల భారీ నుంచి కూడా బయటపడవచ్చు.
ముఖ్యంగా కారును వర్షాకాలంలో రోడ్లపై పార్క్ చేసినప్పుడు వరద నీటితో పాటే పురుగులు, చెత్త వంటివి కూడా కారు లోపలికి చేరడానికి ఆస్కారం ఉంటుంది. వరద నీరు పారని చోట కారును నిలిపి ఉంచడం వలన ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. కారును రెండు లేదా మూడు రోజులకు ఒకసారి అయిన కొద్ది దూరం డ్రైవింగ్ చేయాలి. లేదంటే వర్షపు నీటి వలన ఇంజిన్ తొందరగా చెడిపోయే అవకాశం ఉంది.
కారును క్రమం తప్పకుండా స్టార్ట్ చేయడం వల్ల కారు బ్యాటరీ యాక్టివ్‌గా ఉంటుంది. కారు లోపలికి ఎక్కువ వెలుతురు వచ్చేలా చూడాలి. ఇలా చేయడం వలన ఎలుకలు, బొద్దింకలు వంటివి వెలుతురును తట్టుకోలేక బయటకు వెళ్లిపోతాయి. కారు పార్కింగ్‌ను రెగ్యులర్‌గా ఒక్క చోట కాకుండా క్రమం తప్పకుండా మార్చడం చాలా ముఖ్యం.
డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీ తోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








