వేసవిలో తరచూ ఎలక్ట్రిక్ వాహనాలు తగలబడుతుంటాయి.. పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి

వేసవి మొదలైంది. మే నెలకు ముందు మార్చిలోనే సూరీడు సుర్రుమంటుండు. 9గంటలు కాక ముందే ఎండ మండిపోతుంది. 9దాటితే బయటకు వెళ్లాలంటే కష్టం అవుతుంది. నిజానికి భారత్ ఉష్ణమండల దేశం కావడంతో వేడి అనేక అసౌకర్యాలను తెస్తుంది. వేసవిలో అధిక చెమట నుండి నీటి కొరత వరకు ప్రతిదీ ఏర్పడుతుంది.

అలాగే వ్యక్తిగత సమస్యల నుంచి సామాజిక సమస్యలు వస్తుంటాయి. మనుషులతో పాటు వేసవిలో జంతువులు చివరకు వాహనాలు కూడా ప్రభావితం అవుతాయి. ముఖ్యంగా వేసవి ఎండ ఎలక్ట్రిక్ వాహనాలకు సవాలుతో కూడుకుంది. కొన్నాళ్లుగా వేసవి కాలం వచ్చిన వెంటనే అక్కడక్కడ ఎలక్ట్రిక్ వాహనాలు మంటల్లో చిక్కుకున్న సంఘటనలను మనం చూసే ఉన్నాం.

How To Keep Your Electric Scooter Safe From Risk

ఇటువంటి అగ్ని ప్రమాదాల కారణంగా ఎలక్ట్రిక్ వాహనాలను కొనేందుకు చాలా మంది వెనుకడుగు వేస్తున్నారు. దీంతో వాటి అమ్మకాలు ప్రభావితం అవుతున్నాయి. ఈ కారణంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీలు గత కొన్ని సంవత్సరాలుగా వివిధ అధ్యయనాలు, పరీక్షల ద్వారా అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోగల ఎలక్ట్రిక్ వాహనాలను ఎలా నిర్మించాలనే దాని మీద అన్వేషణ కొనసాగిస్తున్నాయి.

అందుకే ఇటీవలి కాలంలో ఎలక్ట్రిక్ వాహనాలు రోడ్డు మీద మంటల్లో చిక్కుకునే సంఘటనల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. అయితే, ఇప్పుడు వేసవి కాలం కాబట్టి ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించేటప్పుడు మనం ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలి... దాని గురించే మనం ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

EV Station

ఎలక్ట్రిక్ వాహనాలకు ఛార్జింగ్ చేసేటప్పుడు జాగ్రత్త తీసుకోవాలి. ఉదాహరణకు మీరు మీ మొబైల్ ఫోన్‌ను తప్పుగా ఛార్జ్ చేస్తే లేదా మరొకరి ఛార్జర్ ను ఉపయోగించి ఛార్జింగ్ పెడితే కొన్ని సార్లు ఫోన్ మామూలు కంటే వేడెక్కుతున్నట్లు గమనించవచ్చు. అదేవిధంగా, ఎలక్ట్రిక్ వాహనాలకు వాటితో పాటు వచ్చిన ఛార్జర్ తో మాత్రమే ఛార్జింగ్ పెట్టాలి.

మీ ఎలక్ట్రిక్ వాహనంతో వచ్చిన ఛార్జర్ తప్ప వేరే ఛార్జర్ ఎల్లప్పుడూ ఉపయోగించకూడదు. ఛార్జర్ అడాప్టర్ లేదా కేబుల్ దెబ్బతిన్నట్లయితే, దానిని సంబంధిత డీలర్‌షిప్ షోరూమ్‌కు తీసుకెళ్లి సేమ్ అలాంటిదే మరొకటి కొనుగోలు చేయాలి. మొబైల్ ఫోన్ కి చేసినట్లుగా విడిగా ఛార్జర్, వేరే కేబుల్ కొని దానిని వాడకండి.. ఇబ్బందుల్లో పడతారు.

Take a Poll

అదేవిధంగా, ఛార్జర్‌ను ఎక్కువసేపు ఆన్, ఆఫ్ చేసే అలవాటును వదులుకోండి. ఇది మీ ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీని దెబ్బతీస్తుంది. దాని లైఫ్ టైం తగ్గిస్తుంది. వాస్తవానికి ఎక్కువ సేపు ఛార్జింగ్ పెట్టడం వల్ల వాహనం లోపల ఉన్న బ్యాటరీ అక్కడికక్కడే పేలిపోతుంది. మొబైల్ ఫోన్ల మాదిరిగానే, మనలో కొంతమందికి రాత్రిపూట ఎలక్ట్రిక్ వాహనాలను ఛార్జ్ చేసే అలవాటు ఉంటుంది.

మొబైల్ ఫోన్‌ల మాదిరిగానే ఇది ఎలక్ట్రిక్ వాహనాలను సైతం దెబ్బతీస్తుంది. కాబట్టి వాటిని రాత్రంతా ఛార్జింగ్‌లో పెట్టకుండా ఉండండి. సాధ్యమైనప్పుడల్లా వాహనాన్నిఖాలీ ప్రదేశంలో.. బాగా వెంటిలేషన్ ఉన్న ప్రాంతంలో పార్క్ చేసి ఛార్జ్ చేయండి. ఇరుకుగా ఉండే ప్రదేశాల్లో లేదా మండే వస్తువుల దగ్గర ఛార్జింగ్ చేయడాన్ని నివారించండి.

EV Charging

ఎక్కువ దూరం ప్రయాణించిన తర్వాత బ్యాటరీని ఛార్జ్ చేయడానికి ముందు కొన్ని నిమిషాలు వాహనం చల్లబరచడం అలవాటు చేసుకోండి. దయచేసి ఈ జాగ్రత్తలను మాత్రం తూచ తప్పకుండా పాటించండి. ఈ సూచనలను సరిగ్గా పాటించినప్పటికి కూడా ఛార్జింగ్ చేస్తున్నప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్ మంటల్లో చిక్కుకుంటే వాహనాన్ని వెంటనే ఖాళీ ప్రదేశానికి తరలించండి.

అలాగే బ్యాటరీకి ఏదైనా నష్టం జరిగిందా అని ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండండి. ఎలక్ట్రిక్ వాహనాన్ని ఎలా ఛార్జ్ చేయాలో.. దానిని ఎలా కరెక్టుగా మెయింటైన్ చేయాలో మీరు దానిని తయారు చేసిన కంపెనీ వెహికల్ తో పాటు అందించిన పుస్తకాన్ని చదివి అర్థం చేసుకోవచ్చు. ఎంత ఛార్జ్ చేస్తే బాగుంటుంది? మీ వాహనం బ్యాటరీ కెపాసిటీ వంటి వివరాలను అందులో అందిస్తారు.

EV Burn

పార్కింగ్ ఆలోచన: సాధ్యమైనప్పుడల్లా మీ ఎలక్ట్రిక్ వాహనాన్ని డైరెక్ట్ ఎండలో పార్క్ చేయకూడదు. ఒక ఎలక్ట్రిక్ వెహికల్ ఒకే చోట ఎక్కువసేపు పార్క్ చేయబోతున్నట్లయితే, దానిని కొన్ని భవనాలు లేదా చెట్ల కింద పార్క్ చేయాలి. వీలైతే రోజులో అత్యంత వేడిగా ఉండే సమయంలో ఛార్జింగ్ పెట్టకుండా ఉంటే బెటర్.

రెస్టారెంట్లు, ఆఫీసులు, ఇళ్ల దగ్గర గ్రౌండ్ ఫ్లోర్‌లో పార్కింగ్ చేసేటప్పుడు ఆ ప్రాంతంలోని ఉష్ణోగ్రతను చెక్ చేసిన తర్వాతే ఛార్జింగ్ పెట్టాలా వద్దా అని నిర్ణయించుకోవాలి. అటువంటి ప్రాంతాల్లో విద్యుత్తు చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి దయచేసి జాగ్రత్త సుమ.

ఎలక్ట్రిక్ వాహనాలు పర్యావరణానికి అనుకూలంగా కాలుష్య రహితంగా ఉంటాయి. కాబట్టి భారత ప్రభుత్వంతో సహా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించడానికి ముందుకు వస్తున్నాయి. కానీ దీనివల్ల ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలకు డిమాండ్ పెరుగుతుంది. వాటిని ఉత్పత్తి చేసే కంపెనీల సంఖ్య పెరుగుతుంది.

EV Fire

అనేక ఈవీ కంపెనీలు బ్యాటరీలు, ఈజీగా వేడెక్కని టెక్నాలజీని అభివృద్ధి చేసే ప్రయత్నాలలో పాల్గొంటున్నాయి. కానీ ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల్లో విస్తృతంగా ఉపయోగించే బ్యాటరీలు లిథియం-అయాన్ బ్యాటరీలు. పేరులో "అయాన్" అనే పదాన్ని చూసినప్పుడు ఇనుము గురించి ఆలోచించకండి.

ఎందుకంటే లిథియం-ఐరన్ అనే ప్రత్యేక బ్యాటరీ ఉంది. లిథియం-అయాన్ బ్యాటరీలు నికెల్, కోబాల్ట్, మాంగనీస్ వంటి మూలకాలతో తయారు చేస్తారు. ఇది ఎక్కువ పవర్ స్టోరేజీ చేసుకోగలదు. అంతే కాకుండా తేలికగా ఉంటుంది. అయితే, లిథియం-అయాన్ బ్యాటరీలు లిథియం-ఐరన్ బ్యాటరీల కంటే సురక్షితమైనవి ఏ మాత్రం కావు.

అయితే, లిథియం-ఐరన్ బ్యాటరీలను టెస్లా వంటి చాలా పెద్ద విద్యుత్ కంపెనీలు మాత్రమే ఉపయోగిస్తాయి. ఎందుకంటే వాటి ఉత్పత్తికి చాలా ఖర్చు అవుతుంది. అమెరికా, కెనడా వంటి రిచ్ కంట్రీస్ లో కూడా, ఖరీదైన లిథియం-ఐరన్ బ్యాటరీలను కొన్నిసార్లు సరిగ్గా ఉపయోగించరు. ఎందుకంటే, ఈ బ్యాటరీలు అధిక ఉష్ణోగ్రతల్లో కూడా మెరుగ్గా పని చేస్తాయి. కానీ చాలా చల్లని ప్రాంతాల్లో మాత్రం బాగా పనిచేయవు.

లిథియం-ఇనుప బ్యాటరీలు మన దేశానికి అనుకూలంగా ఉంటాయి. కానీ వాటిని తీసుకునేంత ఆర్థికంగా మనం ఇంకా అభివృద్ధి చెందలేదు. వేసవిలో ఎలక్ట్రిక్ వాహనాలే కాకుండా సాధారణంగా వాహనాలను ఎప్పటికప్పుడు నిశితంగా గమనిస్తూ ఉండాలి. వేసవిలో కార్లలో ఎలాంటి సమస్యలు వస్తాయో తెలియదు కాబట్టి క్రమం తప్పకుండా వాహనాన్ని సంబంధిత మెకానిక్ తో చెక్ చేయించుకోవడం మంచిది.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Wednesday, March 19, 2025, 10:13 [IST]
English summary
Precautions to prevent electric vehicle fires in summer heat
Read more on: #auto news #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+