మండే వేసవిలో మీ కారును సేఫ్‌గా ఉంచుకోవాలంటే.. ఈ టిప్స్ తప్పనిసరి
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఈ మండుటెండలో బయటకు వెళ్లాలంటే హడలెత్తి పోతున్నారు. అందుకే వేసవి తాపం ప్రభావం మనపై పడకుండా ఉండేందుకు సన్‌స్క్రీన్ లోషన్లు, జ్యూస్‌లు, చల్లటి నీళ్లు.. ఇలా రకరకాల ఆరోగ్యకరమైన అలవాట్లతో మనల్ని మనం కాపాడుకుంటున్నాం. అయితే ఇక్కడ మన ఆరోగ్యం ఎంత ముఖ్యమో.. వాహనాల సంరక్షణ కూడా అంతే ముఖ్యం.
సమ్మర్ సీజన్‌లో వాహనాలపై అధిక వేడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ కాలంలో వాహనాల మరమ్మతులు కూడా ఎక్కువగా అవుతుంటాయి. అందుకే వేసవిలో(Summer Car Care Tips) మీ బైక్, కారు లేదా ఇతర వాహనాల గురించి చాలా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. అందుకు సంబంధించి కొన్ని చిట్కాలు పాటించాలి. అవేంటో ఇక్కడ చూద్దాం.

పార్కింగ్: మీ వాహనాలను ఎండలో పార్కింగ్ చేయకుండా ఉండేలా చూసుకోండి. ఎందుకంటే వేడి తాపం కారణంగా మీ కారు ఇంటీరియర్‌లో అనేక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా కారు లోపల వేడి కూడా పెరుగుతూనే ఉంటుంది. ఇది పరిమితికి మించి పెరిగినట్లయితే అది ప్రయాణికులపై కూడా ప్రభావం చూపిస్తుంది.
కార్ వ్యాక్సింగ్: కారు విండ్‌షీల్డ్ గ్లాస్ ద్వారా వేడి ప్రవేశించి మీ డ్యాష్‌బోర్డ్‌లోని ప్లాస్టిక్‌ను తాకినప్పుడు, ఆ వేడి ఎక్కువసేపు ఒకే చోట ఉంటే, మీ కారు డ్యాష్‌బోర్డ్ ప్లాస్టిక్‌ను దెబ్బతీసే అవకాశం ఎక్కువదా ఉంటుంది. మీ కారు ఎప్పుడూ కొత్తగా ఉండేలా చూసుకోవడానికి.. సంవత్సరానికి రెండుసార్లు కార్ వ్యాక్సింగ్ చేయడం చాలా అవసరం.

మీ కారును ఇలా వ్యాక్సింగ్ చేయడం ద్వారా, నేరుగా సూర్యకాంతి ప్రభావం పడకుండా ఉంటంది. ఇంకా మీరు దీర్ఘకాలిక పరిష్కారం కోసం చూస్తున్నట్లయితే, మీ కారుకు సిరామిక్ కోటింగ్ ఇవ్వడం బెటర్. ఈ సిరామిక్ కోటింగ్ ఇవ్వడం వల్ల కారు ఎక్స్‌టీరియర్ అందంగా, మెరుస్తూ ఉంటుంది. దీంతో పాటు అదే సమయంలో బయట నుంచి వాతావరణ ప్రభావం పడకుండా ఉంటుంది.
విండ్‌షీల్డ్ ప్రొటెక్టర్: కారు విండ్‌షీల్డ్‌లో గ్లాస్ ఉంటుంది, ఇది ఎక్కువ సూర్యరశ్మిని కారులోకి ప్రవేశించేలా చేస్తుంది. దీని ద్వారా పెద్ద నష్టం వాటిల్లుతుంది. కాబట్టి మీరు కారును పార్క్ చేసినప్పుడు లేదా సైడ్‌కు నిలిపినప్పుడు.. సూర్యకిరణాలు పడకుండా విండ్‌షీల్డ్ ప్రొటెక్టర్‌ను ఉంచండి.

వేసవిలో అధిక వేడి కారణంగా కారులోని ఇంధనాలు కూడా త్వరగా అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి తరచుగా తనిఖీ చేయడం ఉత్తమం. ప్రధానంగా కూలింగ్ పాయింట్, మోటార్ ఆయిల్ మరియు గేర్ ఫ్లూయిడ్‌ను తనిఖీ చేసుకోవాలి. లేదంటే సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
వేసవిలో సూర్యరశ్మి నేరుగా కారు లోపలికి ప్రవేశించినట్లయితే కారు లోపల అమర్చిన లెదర్ సీట్లు కూడా దెబ్బతింటాయి. ప్రధానంగా లెదర్ స్లిప్స్ పొడిగా లేదా గట్టిగా మారుతుంటాయి. కాబట్టి మీరు కారు లోపల సీటు రంగును ఎంచుకున్నప్పుడు, లేత రంగును ఎంచుకోవాలి. మీరు ముదురు రంగును ఎంచుకుంటే, ఇలాంటి పరిస్థితుల్లో వేడి తాపం ఎక్కువగా తెలుస్తుంది.
అంతే కాదు, కారు సీట్లను ఎప్పటికప్పుడు డ్రై వాష్ చేసుకోవాలి. ప్రధానంగా వేసవిలో కారు లోపల వేడిగా ఉంటుంది కాబట్టి మీరు దానిని శుభ్రం చేయడం ద్వారా సుదీర్ఘ పర్ఫామెన్స్‌ను పొందవచ్చు. చాలా మంది ఈ వేసవిలో కాకుండా వర్షాకాలంలో తమ వాహనాలను శుభ్రం చేస్తుంటారు. వేసవిలో కారు లోపలి భాగాన్ని శుభ్రం చేయడం అవసరమని గుర్తుంచుకోవాలి.
ప్రతి రాష్ట్రంలో కారు కిటికీలపై సన్‌స్క్రీన్ స్టిక్కర్‌ల వినియోగానికి సంబంధించి వేర్వేరు చట్టాలను కలిగి ఉంటుంది. కాబట్టి మీరు మీ రాష్ట్రంలోని చట్టపరమైన నిబంధనలకు అనుగుణంగా సరైన సన్‌స్క్రీన్ స్టిక్కర్‌ను ఏర్పాటు చేసుకోవాలి. ఏదేమైనా మీరు కారును పార్క్ చేస్తున్నప్పుడు విండో గ్లాస్ ప్రొటెక్టర్ సాధనాలను ఉపయోగించడం ఉత్తమం.
మిగతా సీజన్లతో పోలిస్తే వేసవిలో కార్లు రిపేర్‌కు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. ఈ కాలంలో మీ కారు సంరక్షణ సరిగ్గా ఉండేలా చూసుకోవడం మీ బాధ్యత. కాబట్టి పైన పేర్కొన్న చిట్కాలను అనుసరిస్తూ.. మీ వాహనాన్ని సరిగ్గా మెయింటైన్ చేయండి. ఇది భవిష్యత్తులో మీకు చాలా డబ్బును ఆదా చేస్తుంది.


Click it and Unblock the Notifications








