వేసవిలో కారు టైర్లు పేలుతున్నాయా.??.. వెంటనే ఇవి సరిచూసుకోండి.!!
దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత(Tyre Bursts Due to Summer Heat) ఎక్కువగా ఉంది. మునుపెన్నడూ లేని విధంగా ఈ సారి భానుడి ప్రతాపం ప్రజలను భయాందోళనకు గురిచేస్తుంది. దీంతో ప్రజలు బయటకు రాలేకపోతున్నారు. అయితే ఈ వేడికి రోడ్డుపై వెళ్లే వాహనాల్లో తరచూ సమస్యలు ఏర్పడుతుంటాయి. ముఖ్యంగా టైర్లు పేలిపోతుంటాయి.
స్కూళ్లకు(Summer Tips For Car Tyres) వేసవి సెలవులు మొదలై చాలా రోజులవుతుంది. ఈ క్రమంలో పిల్లల కోసం ఫ్యామిలీ అంతా కలిసి సమ్మర్ ట్రిప్ ప్లాన్ చేస్తుంటారు. అయితే వేసవి వేడి మునుపెన్నడూ లేనంతగా ఉండటంతో ట్రిప్పులకు వెళ్లే వాళ్లు.. తమ వాహనాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మీ జర్నీని ఆనందంగా ఆస్వాదించలేరు.

అధిక వేడి కారణంగా రోడ్డుపై ప్రయాణించే వాహనాలలో ఇంజిన్, టైర్లు పేలిపోవడం లాంచి సమస్యలు తలెత్తుంటాయి. ముఖ్యంగా వేడి తట్టుకోలేక టైర్లు పేలిపోయి ప్రమాదానికి గురయ్యే అవకాశాలు ఉంటాయి. దీని ద్వారా మీరు సమస్యల్లో చిక్కుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి సమస్య తలెత్తకుండా ఉండాలంటే మీరు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి.
వేసవి కాలంలో రోడ్డుపై వాహనాలు వెళ్లేటప్పుడు టైర్లు అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోవలసి ఉంటుంది. ఈ వేడి నేరుగా టైర్ లోపల గాలిలోకి బదిలీ అవుతుంది. దీని కారణంగా, టైర్ లోపల గాలి వ్యాపించడంతో పాటు ఒత్తిడి పెరుగుతుంది. ఈ సమస్య కారణంగా పంక్చర్ లేదా టైర్ పగిలిపోవడం వంటి సమస్యలు కలుగుతాయి.

అయితే నైట్రోజన్ గ్యాస్ అధిక వేడిని తట్టుకునే కెపాసిటీని కలిగి ఉంటుంది. కాబట్టి ఇందుకోసం మీరు కారు టైర్లలో ఎల్లప్పుడూ నైట్రోజన్ గ్యాస్ నింపేలా చూసుకోండి. తద్వారా టైర్ పేలిపోవడం లాంటి సమస్యల నుంచి బయటపడవచ్చు. ఇంకా ఇంజన్ వేడెక్కడం, వాహనం చెడిపోవడం, రోడ్డు మధ్యలో ఆగిపోవడం వంటి సమస్యలను చాలా మంది ఎదుర్కొంటుంటారు. దీనికి ప్రధాన కారణం వేడి.
ఇంజిన్ వేడెక్కుతున్నప్పుడు, బయటి గాలి వేడిని చల్లబరచాలి. కానీ బయటి నుంచి వచ్చే వేడి గాలి కారణంగా ఇంజిన్ వేడెక్కడం జరుగుతుంది. దీన్ని నివారించడానికి మీరు కారులో ప్రయాణించేటప్పుడు అధిక వేగంతో డ్రైవింగ్ చేయకుండా ఉండటం ఉత్తమం. ఇలాంటి సందర్భాల్లో ఇంజిన్ నుంచి తక్కువ వేడి విడుదల అవుతుంది కాబట్టి.. బయటి వేడి ప్రభావం చూపించదు. దీంతో ఇంజిన్ వేడెక్కి రోడ్డు మధ్యలో నిలిచిపోకుండా ఉంటుంది.

వీటితో పాటు రేడియేటర్ కూడా ఇంజిన్ వేడెక్కడానికి కారణం కావచ్చు. కాబట్టి మీరు మీ ప్రయాణాన్ని ప్రారంభించే ముందు రేడియేటర్‌లోని కూలింగ్ స్థాయిని తనిఖీ చేసుకోవాలి. రేడియేటర్‌లో రంధ్రాలు లేవని సరిచూసుకోవాలి. పాన్‌పై బెల్ట్ సరిగ్గా పనిచేస్తుందో లేదో కూడా తనిఖీ చేసుకోవాలి.
రేడియేటర్లలో సాధారణ నీరు పోస్తే, అది 100 డిగ్రీల వద్ద ఆవిరైపోతుంది. కాబట్టి మీరు రేడియేటర్‌ను ఇథిలీన్ గ్లైకాల్‌తో నింపితే అది 130° వరకు కూడా ఆవిరైపోకుండా నిరోధిస్తుంది. ఫలితంగా, ఇంజిన్‌ను చల్లబరుస్తుంది. దీంతో ఇంజిన్ వేడెక్కడం, రోడ్డు మధ్యలో నిలిచిపోవడం వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.
అదే సమయంలో, వేసవి కాలంలో, మీరు కారులో ప్రయాణిస్తున్నప్పుడు, మీరు తప్పనిసరిగా AC ఉపయోగించాలి. ఏసీ లేకుండా కారులో ప్రయాణించడం సమస్యలను కొనితెచ్చుకున్నట్లే. అదే సమయంలో ఏసీని పొదుపుగా వాడుకోవాలి. ఏసీ గాలి బయటకు వెళ్లకుండా కారు విండోస్ మూసి ఉంచాలి.
ఒకవేళ కారులో వెంటిలేటర్ సీటు లేకుంటే, సీటుపై కుషన్ లేదా నాచు వంటి వాటిప కూర్చోవడం వల్ల మీ శరీరంలోని వేడి కొంతవరకు తగ్గుతుంది. ఇలాంటివి చేయడం వల్ల వేసవి తాపాన్ని కొంత వరకు తగ్గించవచ్చు. ముఖ్యంగా వేసవిలో మీరు మీ పిల్లలతో డ్రైవింగ్ చేసేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. పైన పేర్కొన్న జాగ్రత్తలను పాటించడం ద్వారా సమ్మర్ ట్రిప్‌ను ఆనందంగా ఆస్వాందిచవచ్చు.


Click it and Unblock the Notifications








