వర్షాకాలంలో కారు డ్రైవింగ్.. ఈ తప్పులు చేయడం చాలా ప్రమాదం.. యముడు మీ అడ్రస్ వెతుక్కుని మరీ వస్తాడు!
గత కొన్ని నెలలుగా భారీగా కురుస్తున్న వర్షాలతో దేశంలోని కొన్ని రాష్ట్రాల ప్రజలు తీవ్ర ఇబ్బందులుకు గురవుతున్నారు. ఇప్పటికే చాలా ప్రాంతాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో కొన్ని లోతట్టు ప్రాంతాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. ఈ వర్షాకాలంలో వరదలకు వాహనాలు ఎక్కువగా కొట్టుకుపోతున్నాయి. వర్షాల వల్ల వాహనాలు దెబ్బతిని వాహనదారుల ఖర్చులు కూడా పెరిగిపోతున్నాయి. ఇంకా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ముందు జాగ్రత్త చర్యలకు వాహనదారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా వర్షాకాలంలో కార్లు దెబ్బతినకుండా ఉండేందుకు లేదా ప్రమాదాల బారిన పడకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఈ కథనంలో తెలుసుకుందాం..
టైర్లు: కారు టైర్లు నేరుగా రోడ్డుకు తాకుతాయి కాబట్టి వర్షాకాలంలో టైర్లపై అదనపు శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. వర్షంలో తగినంత గ్రిప్ అందించడం కొరకు టైర్ల థ్రెడ్ డెప్త్ కనీసం 1.6 మిమీ ఉండాలి. ఎక్కువ కాలం వాడిన పాత టైర్లు తడి రోడ్లపై తగినంత ట్రాక్షన్‌ని అందించవు. ఇది ఇది ప్రమాదాలకు దారితీస్తుంది. కావున టైర్లను తరచుగా చెక్ చేసుకోవాలి.

వైపర్స్ అండ్ వాషర్స్: వర్షాకాలంలో కారు లోపలి నుంచి రోడ్డును స్పష్టంగా చూడటం కష్టం. ఇలాంటి అసౌకర్యాన్ని నివారించడానికి వైపర్ బ్లేడ్లు అలాగే వాషర్లు మంచి కండీషన్‌లో ఉంచేలా చేయడం చాలా ముఖ్యం. మీ ప్రయాణాన్ని ఆరంభించే ముందు దుమ్ము, ధూళి కణాలను నివారించడానికి విండ్ స్క్రీన్‌ని వాషర్ ఫ్యూయిడ్ క్లీన్ చేయండి. అలాగే ఫ్యూయిడ్ తర్వాతి అవసరాల కోసం ఫుల్‌గా ఉండేలా చూసుకోండి.
ఎలక్ట్రికల్ సిస్టమ్: వర్షపు నీరు మీ కారు విద్యుత్ వ్యవస్థను దెబ్బతీస్తుంది. ముఖ్యంగా బ్యాటరీ మంచి కండీషన్‌లో ఉందో లేదో క్రమం తప్పకుండా చెక్ చేసుకోవాలి. ఎప్పుడైనా కారు లైట్లు పనిచేయకపోయే ప్రమాదం ఉంటుది. వీటితో పాటు బయటి అద్దాల్లో వాటర్ ఫిల్మ్ (Rainproof) ఉండేలా చూసుకోవాలి. ఇది మీకు నీటిని నిలువకుండా చేస్తుంది. తద్వారా మిర్రల్‌లో సులభంగా వెనక వాహనాలను చూడగలగుతారు.

బ్రేక్స్: తడి రోడ్లపై టైర్ల మాదిరిగానే, కారు బ్రేక్ సిస్టమ్ కూడా ముఖ్యమైనది. అందువల్ల, బ్రేక్ ప్యాడ్స్, డిస్క్‌లను క్రమానుగతంగా చెక్ చేయండి. బ్రేక్ సిస్టమ్ నుంచి ఏదైనా శబ్దం లేదా బ్రేక్ ఫెయిల్యూర్ గమనించినట్లయితే వెంటనే సమీపంలోని మెకానిక్‌ని సంప్రదించండి. వర్షాకాలంలో కారుని ఒకే చోట నిలుపడం వల్ల బ్రేకింగ్ భాగాలు కాస్త నెమ్మదించే అవకాశం ఉంటుంది. కావున ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి.
వెలుతురు వచ్చే క్యాబిన్ ఉండేలా చూసుకోండి: వర్షాకాలంలో ఎక్కువ సమయం విండోస్ తెరిచి డ్రైవ్ చేయలేం కాబట్టి విండో అద్దాలు సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా అనేది నిర్ధారించుకోండి. అలాగే మీరు వర్షం కురుస్తున్నంత సేపు మీరు కారు లోపలే కూర్చోవాల్సి ఉంటుంది కాబట్టి కారులోని ఏసీ ఫ్యాన్, ఇతర ఏసీ సిస్టమ్ పనిచేస్తుందా లేదా అనేది తెలుసుకోండి.
ఎమర్జెన్సీ ఎక్విప్‌మెంట్: మీరు మీ కారును ఎంత జాగ్రత్తగా చూసుకున్నా కొన్ని సందర్భాల్లో అది మీకు ఇబ్బందులకు గురిచేయవచ్చు. అందువల్ల వర్షాకాలంలో మీ కారులో ఎల్లప్పుడూ టార్చ్, ఫస్ట్ ఎయిడ్‌కిట్ అవసరమైతే తాడుని ఉంచుకునేలా చూసుకోండి. ఇవి మిమ్మల్నీ ఆపత్కాళంలో ప్రమాదం నుంచి బయటపడేందుకు సహాయ పడతాయి లేదా ఉపశమనం ఇస్తాయి.
డ్రైవ్స్‌పార్క్ కాన్సెప్ట్: వర్షాకాలంలో కారు నడపడం మనం అనుకున్నంత సులభం కాదు. ఏ సమయంలో ఎలాంటి ప్రమాదాలు పొంచి వస్తాయో ఊహించలేం. కాబట్టి పైన చెప్పిన బేసిక్ టిప్స్ పాటిస్తే వర్షాకాలంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ ప్రయాణం సాఫీగా సాగుతుంది. అందువల్ల, కారులో అత్యవసర పరికరాలను సైతం క్యారీ చేయడం తప్పనిసరి.


Click it and Unblock the Notifications








