రియర్ వీల్ డ్రైవ్ vs ఫ్రంట్ వీల్ డ్రైవ్: లాభాలు, నష్టాలు
భారతదేశంలో అనేక మంది కొనుగోలుదారులు, వాహనాలను కొనుగోలు చేసేటప్పుడు వాటి వీల్ డ్రైవ్‌లను పెద్దగా పరిగణలోకి తీసుకోరు. ఒకవేళ పరిగణలోకి తీసుకున్నప్పటికీ, వారు ఎక్కువగా ఆల్-వీల్ డ్రైవ్ (4x4 లేదా ఫోర్-వీల్ డ్రైవ్) సిస్టమ్‌లకే ప్రాధాన్యత ఇస్తారు. అయితే, వాహనాల్లో కేవలం ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్ మాత్రమే కాకుండా, ఫ్రంట్ వీల్ డ్రైవ్ (ఎఫ్‌డబ్ల్యూడి), రియర్ వీల్ డ్రైవ్ (ఆర్‌డబ్ల్యూడి) అనే డ్రైవ్ సిస్టమ్‌లు కూడా ఉన్నాయి.
మరి మీ కారులో ఏ రకమైన డ్రైవ్ సిస్టమ్ ఉంది. అసలు ఈ డ్రైవ్ సిస్టమ్ ఏంటి? వీటి వలన కలిగే లాభాలేంటి? నష్టాలేంటి? తదితర అంశాలను ఈ కథనంలో తెలుసుకుందాం రండి. సాధారణంగా డ్రైవ్ సిస్టమ్స్ మూడు రకాలు. అవి.
1. ఫ్రంట్ వీల్ డ్రైవ్ (ఎఫ్‌డబ్ల్యూడి)
2. రియర్ వీల్ డ్రైవ్ (ఆర్‌డబ్ల్యూడి)
3. ఆల్ వీల్ డ్రైవ్ (ఏడబ్ల్యూడి)
మరిన్ని వివరాలను క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

సాధారణంగా రియర్ వీల్ డ్రైవ్ కారు కన్నా ఫ్రంట్ వీల్ డ్రైవ్ కారును నడపటం సరదాగా ఉంటుంది ఎందుకు? రియల్ వీల్ డ్రైవ్ కలిగిన కార్లు ఎక్కువ ధరను కలిగి ఉంటాయెందుకు? తయారీదారులు ఎక్కువగా ఫ్రంట్ వీల్ డ్రైవ్ కార్లనే తయారు చేస్తారు ఎందుకు ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలుసుకుందాం రండి.

ఫ్రంట్ వీల్ డ్రైవ్ సిస్టమ్
ఫ్రంట్ వీల్ డ్రైవ్ సిస్టమ్‌లో ఇంజన్ నుంచి విడుదలయ్యే శక్తి ముందు చక్రాలకు పంపిణీ అవుతుంది, వెనుక చక్రాలు డమ్మీగా తిరుగుతూ ఉంటాయి. ఈ సిస్టమ్‌లో అన్ని పనులు (స్టీరింగ్, హ్యాండ్లింగ్, ఇంజన్ పవర్) ముందు చక్రాలే చేస్తాయి. వెనుక చక్రాలు బ్యాలెన్సింగ్‌కు సహకరిస్తాయి. ఫ్రంట్ వీల్ డ్రైవ్ కార్లలో ఇంజన్ కారుకు ముందు వైపు ఉంటుంది.

ఫ్రంట్ వీల్ డ్రైవ్ - లాభాలు
ఇంజన్, డ్రైవ్‌ట్రైన్ రెండూ ముందు వైపే ఉంటాయి కాబట్టి, ఇవి తక్కువ స్థలాన్ని ఆక్రమిస్తాయి. అంతేకాకుండా, ఈ రెండింటిని అనుసంధానం చేసేందుకు తయారీదారులకు తక్కువ విడిభాగాలు సరిపోతాయి, ఫలితంగా కారు బరువు తగ్గి మైలేజ్ పెరుగుతుంది. మొత్తమ్మీద చూసుకుంటే, ఫ్రంట్ వీల్ డ్రైవ్ కార్ల ఉత్పత్తి వ్యయం తక్కువగా ఉంటుంది, అందుకే అధిక భాగం కార్లు ఎఫ్‌డబ్ల్యూడిని కలిగి ఉంటాయి.

ఫ్రంట్ వీల్ డ్రైవ్ - లాభాలు
ఫ్రంట్ వీల్ డ్రైవ్ కారులో అన్ని కాంపోనెంట్లు ముందే ఉంటాయి కాబట్టి మరింత ప్యాసింజర్ స్పేస్, లగేజ్ స్పేస్ లభిస్తాయి. వీటిల్లో ఇంజన్, డ్రైవ్‌ట్రైన్ రెండూ ముందువైపు ఉండటం వలన తడి రోడ్లపై చక్రాలకు ఈ ముందున్న బరువు ఖరీదైన ఎలక్ట్రానిక్ ట్రాక్షన్ కంట్రోల్ ఫీచర్ కన్నా మంచి ట్రాక్షన్‌ను అందిస్తుంది.

ఫ్రంట్ వీల్ డ్రైవ్ - లాభాలు
ఫ్రంట్ వీల్ డ్రైవ్ కార్లు ఎక్కువగా ఓవర్‌స్టీర్ లేదా స్కిడ్డింగ్‌కు గురికావు. ఇంకో మాటలో చెప్పాలంటే, అనుభవం లేని డ్రైవర్లకి కూడా ఎఫ్‌డబ్ల్యూడి కార్లను కంట్రోల్ చేయటం సులువుగా ఉంటుంది.

ఫ్రంట్ వీల్ డ్రైవ్ - నష్టాలు
* ఫ్రంట్ వీల్ డ్రైవ్ కార్లు ఓవర్‌స్టీర్‌కు గురి కానప్పటికీ, అండర్‌స్టీర్‌కు గురవుతాయి. ఇందుకు ప్రధాన కారణంగా ముందు వైపు హెవీగా ఉండటమే.
* ముందు టైర్లపై ఎక్కువ భారం పడుతుంది కాబట్టి ఇవి త్వరగా పాడైపోతాయి.

ఫ్రంట్ వీల్ డ్రైవ్ - నష్టాలు
ఎఫ్‌డబ్ల్యూడి కార్లలో భారమైన ఫ్రంట్ తడి రోడ్లపై మంచి ట్రాక్షన్‌ను అందించినప్పటికీ, ఇతర వాతావరణాల్లో మాత్రం ఎఫ్‌డబ్ల్యూడి కార్ కన్నా ఆర్‌డబ్ల్యూడి కార్ మెరుగ్గా పనిచేస్తుంది. ఇందుకు ప్రధాన కారణంగా బరువును సమానంగా పంపిణీ చేయకపోవటమే. ఎఫ్‌డబ్ల్యూడి కారులో ముందు వైపు కన్నా వెనుక వైపు భారం తక్కువగా ఉంటుంది, అంటే రోడ్డుపై ఈ టైర్ల గ్రిప్ అంత సమర్థవంతంగా ఉండని అర్థం.

ఫ్రంట్ వీల్ డ్రైవ్ - నష్టాలు
స్టీరింగ్ పవర్, ఇంజన్ పవర్‌ల భారం రెండూ ముందు చక్రాలపైనే పడుతుంది కాబట్టి, కొన్ని సందర్భాల్లో కారు పక్కకు లాగే ఆస్కారం ఉంటుంది. ముందువైపు ఇంజన్ నుంచి ఉత్పత్తి అయ్యే శక్తి (ప్రత్యేకించి పవర్‌ఫుల్ కార్లలో) కొన్నిసార్లు కారును కుడి వైపుకు కానీ లేదా ఎడమ వైపుకు కానీ లాగుతుంది. దీనిని టార్క్ స్టీరింగ్ అని అంటారు.

రియర్ వీల్ డ్రైవ్ సిస్టమ్
రియర్ వీల్ డ్రైవ్ సిస్టమ్‌లో ఇంజన్ నుంచి విడుదలయ్యే శక్తి వెనుక చక్రాలకు పంపిణీ అవుతుంది, ముందు చక్రాలు డమ్మీగా తిరుగుతూ ఉంటాయి. అయితే, ఇలాంటి కార్లలో ఇంజన్ ముందు వైపు కానీ లేదా వెనుక వైపు కానీ ఉండొచ్చు, కానీ డ్రైవ్‌ట్రైన్ మాత్రం వెనుక వైపే ఉంటుంది. దాదాపు అన్ని పెర్ఫామెన్స్ కార్లు (ఫెరారీ, లాంబోర్గినీ మొదలైనవి) ఆర్‌డబ్ల్యూడి సిస్టమ్‌ను కలిగి ఉంటాయి. ఇందులో ముందు చక్రాలు స్టీర్ చేయటానికి, వెనుక చక్రాలు కారును ముందుకు నడపటానికి సహకరిస్తాయి.

రియర్ వీల్ డ్రైవ్ - లాభాలు
ఇంజన్ ముందు వైపు ఉండి, డ్రైవ్‌ట్రైన్ వెనుక వైపు ఉంటే బరువు సమానంగా పంపిణీ అవుతుంది. ఫలితంగా మలుపులు, అధిక వేగాల వద్ద వాహనంపై మంచి కంట్రోల్ ఉంటుంది.

రియర్ వీల్ డ్రైవ్ - లాభాలు
ఎఫ్‌డబ్ల్యూడి కారు కన్నా ఆర్‌డబ్ల్యూడి కారు వేగంగా యాక్సిలరేట్ అవుతుంది. ఎందుకంటే, బరువు కారు వెనుక భాగానికి బదిలీ అవుతుంది కాబట్టి (వెనుక టైర్ గ్రిప్ మెరుగ్గా ఉంటుంది) యాక్సిలరేషన్ వేగంగా ఉంటుంది.

రియర్ వీల్ డ్రైవ్ - లాభాలు
ఈ కార్లలో ఇంజన్ కంపార్ట్‌మెంట్‌ను డ్రైవ్‌ట్రైన్‌తో ఒకే చోట అనుసంధానం చేయటం జరగదు కాబట్టి, ఇలా మిగిలిన స్థలాన్ని పెద్ద, శక్తివంతమైన ఇంజన్లను అమర్చేందుకు అవకాశం ఏర్పడుతుంది.

రియర్ వీల్ డ్రైవ్ - నష్టాలు
ఆర్‌డబ్ల్యూడి కార్లలో ముందు ఇంజన్‌ను వెనుక డ్రైవ్‌ట్రైన్‌తో అనుసంధానం చేసేందుకు ఉపయోగించే అధనపు హార్డ్‌వేర్ వలన ఇవి చాలా హెవీగా అనిపిస్తాయి. ఫలితంగా ఉత్పాదక వ్యయం కూడా పెరుగుతుంది. ఎఫ్‌డబ్ల్యూడి కార్లతో పోల్చుకుంటే ఆర్‌డబ్ల్యూడి కార్లు అధిక ధరను కలిగి ఉంటాయి. వీటి మైలేజ్ కూడా తక్కువగా ఉంటుంది.

రియర్ వీల్ డ్రైవ్ - నష్టాలు
ఆర్‌డబ్ల్యూడి కార్లలో ట్రాన్సిమిషన్ టన్నల్ (కారు మధ్యంలో బంప్ మాదిరిగా ఉండే నిర్మాణం) వలన ఇంటీరియర్ స్పేస్ చాలా వరకు తగ్గుతుంది. తడి రోడ్లపై ఆర్‌డబ్ల్యూడి కార్ల ట్రాక్షన్ బలహీనంగా ఉంటుంది.

రియర్ వీల్ డ్రైవ్ - నష్టాలు
రియర్ వీల్ డ్రైవ్ కార్లతో అధిక వేగాల వద్ద మలుపు తిరిగేటప్పుడు ఓవర్‌స్టీర్‌కు గురై కారు వెనుక భాగం జారిపోయే ప్రమాదం ఉంటుంది.

ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్
* ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్‌లో మాత్రం ఇంజన్ నుంచి విడుదలయ్యే శక్తి అన్ని చక్రాలకు సమానంగా పంపిణీ అవుతుంది. ప్రధానంగా అఫ్-రోడ్ ఎస్‌యూవీలలో ఈ సిస్టమ్‌ను గమనిస్తుంటాం. పై రెండు డ్రైవ్ సిస్టమ్‌ల కన్నా ఇది మెరుగైనది. అయితే, సిటీ రైడ్‌కు ఈ డ్రైవ్ సిస్టమ్‌తో పెద్దగా పని ఉండదనే చెప్పొచ్చు.

ఎఫ్‌డబ్ల్యూడి vs ఆర్‌డబ్ల్యూడి.. ఏది బెస్ట్?
* ఫ్రంట్ వీల్ డ్రైవ్ కార్లు తక్కువ ధరను, తక్కువ మెయింటినెన్స్ ఖర్చును కలిగి ఉండి రోజూవారీ ప్రయాణాలకు అనువుగా ఉంటాయి.
* రియర్ వీల్ డ్రైవ్ కార్లు ఎక్కువ ధరను, ఎక్కువ మెయింటినెన్స్ ఖర్చును కలిగి ఉన్నప్పటికీ, మంచి స్పోర్టీ పెర్ఫామెన్స్‌ను ఆఫర్ చేస్తాయి.
* ఇకపోతే ఆల్-వీల్ డ్రైవ్ కార్లు ఆఫ్-రోడింగ్, మోటార్‌స్పోర్ట్, అడ్వెంచరస్ జర్నీలు చేసే వారికి అనువుగా ఉంటాయి.


Click it and Unblock the Notifications








