రైట్ పిఎస్ఐ - లో ఎయిర్ ప్రెజర్‌ను ఇండికేట్ చేసే 'టైర్ క్యాప్'

By Ravi

వాహన టైరు ఎక్కువ కాలం మన్నికగా ఉండాలంటే, వాటిల్లో ఎల్లప్పుడూ సరైన మోతాదులో గాలి పీడనం (ఎయిర్ ప్రెజర్) ఉండేలా చూసుకోవాలి. ఇది టైరు జీవితకాలాన్ని పెంపొందించడంలో చక్కగా ఉపయోగపడుతుంది. అయితే, ప్రతిసారి ఖచ్చితంగా టైరులోని గాలి ప్రెజర్‌ను తెలుసుకోవటం సాధ్యం కాకపోవచ్చు.

టైరులో గాలి ప్రెజర్‌ను తెలుసుకునేందుకు దానిని కొలిచే యంత్రాన్ని ఉపయోగించాలి. ఇది కొంచెం ఖర్చుతోను, శ్రమతోను కూడుకున్న పని. ఖరీదైన కార్లలో అయితే, టైర్ ప్రెజర్ మోనిటరింగ్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి టైర్లలో గాలి తగ్గిన వెంటనే, సెన్సార్లు అప్రమత్తమై డ్రైవర్‌కు సంకేతాలు పంపిస్తాయి. సాధారణ కార్లలో ఈ వెసలుబాటు ఉండదు.

కానీ ఈ 'రైట్ పిఎస్ఐ' (RightPSI) అనే టైర్ క్యాప్స్ సాయంతో టైర్లలో గాలి పీడనం తక్కువగా ఉందో లేదోనని ఇట్టే తెలుసుకోవచ్చు. ఈ టైర్ క్యాప్స్‌ను కారులోని నాలుగు చక్రాలకు ఉండే ఇత్తడి ట్యూబ్ వాల్వ్‌కు బిగించుకోవాలి. దీని సాయంతో టైర్ ప్రెజర్‌ను తెలుసుకోవటం చాలా సులువు అదెలాగంటే... ఈ రైట్ పిఎస్ఐ క్యాప్‌కు పైభాగంలో టైరులోని గాలి ప్రెజర్‌ను తెలిపే ఇండికేటర్స్ ఉంటాయి. ఇవి స్ప్రింగ్ లోడెడ్ మెకానిజం ద్వారా పనిచేస్తాయి. ఇందులో మూడు రంగుల ఇండికేటర్స్ ఉంటాయి. అవి - నలుపు, పసుపు, ఎరుపు.

ఈ క్యాప్‌లో ఎరుపు రంగు ఇండికేటర్ కనిపిస్తే టైరులో గాలి పీడనం తక్కువగా ఉందని అర్థం. అలాగే, ఈ క్యాప్‌లో పసుపు రంగు ఇండికేటర్ కనిపిస్తే టైరులో గాలి పీడనం తక్కువగా ఉందని అర్థం. అదే నలుపు రంగు ఇండికేటర్ కనిపిస్తే టైరులో గాలి సరైన మోతాదులో ఉందని అర్థం.

RightPSI

అయితే ఇందులో పెద్ద డ్రాబ్యాక్ ఉంది. అదేంటంటే.. ఈ రైట్ పిఎస్ఐ టైర్ క్యాప్‌లను నిర్ధిష్ట వాహనానికి ఉపయోగించే టైర్లు మరియు వాటి పిఎస్ఐ స్థాయిలకు అనుగుణంగా తయారు చేయబడి ఉంటాయి. అంటే, మనం కొనే రైట్ పిఎస్ఐ క్యాప్ అన్ని వాహనాలకు సరిపోతుందని చెప్పలేం. వాహనాన్ని బట్టి ఇవి మారుతూ ఉంటాయి. అలాగే టైర్లను మార్చినప్పుడు (మోడిఫై చేసినప్పుడు) కూడా ఈ క్యాప్‌లను సదరు కొత్త టైర్ల పిఎస్ఐ స్థాయిలకి అనుగుణంగా మార్చుకోవాల్సి ఉంటుంది.

కాగా.. ఈ రైట్ పిఎస్ఐ క్యాప్‌లను దొంగిలించడానికి వీలు లేకుండా ఉండే విధంగా కంపెనీ ఓ కొత్త లాకింగ్ మెకానిజంను కూడా తయారు చేస్తోంది. ఒక్కసారి వీటిని టైర్లకు ఫిక్స్ చేస్తే, వీటిని ఓ ప్రత్యేకమైన పరికరం సాయంతోనే ఊడదీసే వీలుండేలా ఈ లాకింగ్ సిస్టమ్ ఉండనుంది. ప్రస్తుతం ఈ రైట్ పిఎస్ఐ క్యాప్‌లను ఉత్పత్తి చేసేందుకు కంపెనీ పెట్టుబడిదారుల కోసం ఎదురుచూస్తోంది. ఈలోపుగా రైట్ పిఎస్ఐ ఎలా పనిచేస్తుందో ఈ వీడియోలో వీక్షిద్దాం రండి.
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/08clRXupLBU?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>

More from DriveSpark

Article Published On: Monday, March 3, 2014, 15:39 [IST]
English summary
RightPSI is a tyre cap. The inventors turned a humble cap into a tyre pressure indicator by the simple use of a spring loaded mechanism. Ingenious. The coloured ring inside the sealed housing moves up and down depending on the pressure. &#13;
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+