చిన్న చిట్కాలు పాటించండి.. చిరకాలం నవ్వుతూ జీవించండి..!

ద్విచక్ర వాహనం నడుపుతున్నప్పుడు కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలను పాటించడం ద్వారా పెను ప్రమాదాల నుండి తప్పించుకోవచ్చు.

* అకస్మాత్తుగా బ్రేక్ వేయాల్సి వచ్చినప్పుడు కంగారు పడిపోయి బ్రేక్‌లను గట్టిగా ప్రెస్ చేయరాదు. ముఖ్యంగా ముందు (ఫ్రంట్) బ్రేక్‌ను ఎప్పుడు పడితే అప్పుడు అప్లయ్ చేయరాదు. సాధారణంగా బ్రేక్ వేయాల్సి వచ్చినప్పుడు రెండు బ్రేక్‌లను ఏకకాలంలో నెమ్మదిగా అప్లయ్ చేస్తూ వాహన వేగాన్ని నియంత్రించుకోవాలి. ఇలా చేయడం వలన బ్రేక్ వేసినప్పుడు టూవీలర్ జారిపోవటం, చక్రాలు లాక్ అవటం వంటి సమస్యలు సంభవించవు.

* బైక్‌పై వెళ్తున్నప్పుడు వేగంగా వీచే గాలి, గాలిలో సంచరించే చిన్నపాటి కీటకాలు లేదా దుమ్ము ధూళి వంటివి కళ్లలోకి ప్రవేశించి, మీ కంటిచూపు తాత్కాలికంగా పనిచేయకపోయే ఆస్కారం ఉంది. అనేకసార్లు ఇలాంటి చిన్నపాటి అంశాల కారణంగానే పెను ప్రమాదాలు జరుగుతుండటాన్ని మనం ప్రతి రోజూ గమనిస్తూనే ఉంటాం. కాబట్టి, ఎల్లప్పుడూ, విండ్‌షీల్డ్‌తో కూడిన హెల్మెట్‌ను ధరించడం ఉత్తమం.

* ముందువైపు టర్నింగ్ ఉండే రోడ్లలో ఎక్కువ వేగంతో ప్రయాణించకండి. ఒకవేళ మీరు టర్న్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు నెమ్మదిగా, అటువైపుగా వచ్చే వాహనాలను గమనిస్తూ టర్న్ తీసుకోవటం ఉత్తమం. ఇలాంటి అన్ని సందర్భాల్లో కూడా హారన్ ఇవ్వటం మర్చిపోకండి.

* మీ ముందున్న డ్రైవర్‌కు బ్లైండ్ స్పాట్ (వెనుక వచ్చే వాహనం కనిపించని ప్రదేశం)లో ఎప్పుడు కూడా రైడ్ చేయకండి.

* అధిక వేగంతో వెళ్తున్నప్పుడు లేదా టర్నింగ్ తీసుకునే సమయంలో సరైన అవగాన లేకుండా రైడ్ చేసినప్పుడు లేదా రోడ్డుపై వెళ్లే పాదచారులను, జంతువులను తప్పించబోయి ప్రమాదవశాత్తు బైక్ స్కిడ్ (జారిపోయే) ఆస్కారం ఉంది. అలాగే, నునుపుగా ఉన్న రోడ్లు, తడి రోడ్లు, గ్రావెల్ రోడ్లు, ఇసుక రోడ్లు, బురద రోడ్లు, మ్యాన్‌హోల్స్ కూడా బైక్ స్కిడ్ కావడానికి కారణం అవుతాయి. కాబట్టి ఇలాంటి రోడ్లపై ప్రయాణించేటప్పుడు లేదా ఇలాంటి రోడ్లను సమీపిస్తున్నప్పుడు మితిమీరిన వేగాన్ని అదుపు చేసుకొని, నెమ్మదిగా వెళ్తూ, వీలైనంత వరకూ బ్రేక్‌లను అప్లయ్ చేయకండి.

* రోడ్లపై ఇష్టం వచ్చినట్లుగా అడ్డదిడ్డంగా (జిగ్-జాగ్) రైడ్ చేయటం చాలా ప్రమాదకరం.

* మీరు టర్నింగ్ పాయింట్‌కు కాస్తంత ముందు నుండే టర్న్ ఇండికేటర్‌ను వేయటం వలన కూడా ప్రమాదాలను నివారించుకోవచ్చు.

More from DriveSpark

Article Published On: Monday, May 21, 2012, 12:43 [IST]
English summary
Here is the few safety tips for two-wheeler riders. Apply both breaks at the same time smoothly for slowing and stopping your two wheeler. It is the most efficient way to stop the motorcycle.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+