'కార్ పూలింగ్'తో ఇంధన ఖర్చు ఆదా!
ఇంధన ధరలు మండిపోతున్న నేటి రోజుల్లో వాహనంలో బయటకు వెళ్లాలంటే కాస్తంత ఖర్చుతో కూడుకున్న పనే మరి. అలాగని ప్రత్యామ్నాయ మార్గాల్లో.. అంటే ఆటోరిక్షాలు, కాల్ టాక్సీలు వంటి వాటిలో ప్రయాణిద్దామనుకుంటే, ఛార్జీల మోత తడిసి మోపెడవుతుంది. ఇక నిరంతరం రద్దీగా ఉండే సిటీ బస్సుల్లో ట్రావెల్ చేయాలంటే ఎక్కడలేని చిరాకు, అసౌకర్యం అనిపిస్తుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో.. తమ స్వంత వాహనాన్నే ఉపయోగిస్తూ, ఇంధన ఖర్చును ఆదా చేసుకోవటాని ఓ చక్కటి మార్గం ఉంది. అదే 'కార్ పూలింగ్'.
కార్ పూలింగ్ అంటే మీ కారులో ప్రయాణాన్ని ఇతరులో పంచుకోవటమే. సింపుల్‌గా చెప్పాలంటే.. మీరు ప్రతిరోజూ ఆఫీసుకు వెళ్లటానికి ఒకే రూట్‌లో ట్రావెల్ చేస్తున్నట్లయతే, అదే రూట్‌లో ట్రావెల్ చేసే మీ స్నేహితులు లేదా మీకు తెలిసిన వ్యక్తులను మీ కారులో పికప్, డ్రాపింగ్ చేయటం ద్వారా వారి నుండి కొంత మొత్తాన్ని కలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా చేయటం వలన ఇంధన ఖర్చును అందరూ సమానంగా పంచుకున్నట్లు అవుతుంది. ఈ పద్ధతిని కార్ పూలింగ్ (కార్ షేరింగ్ కూడా అనొచ్చు) అంటారు.
ముంబై, ఢిల్లీ, బెంగుళూరు వంటి మహా నగరాల్లో ఇప్పటికే 'కార్ పూలింగ్' సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. ఈ సర్వీసులను అందించేందుకు ఇప్పటికే పలు వెబ్‌సైట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. మీ కారులో మీతో పాటు అదే రూట్లో ప్రయాణించే వారికోసం వ్యక్తులను వెతుక్కోవాల్సిన అసరం లేకుండానే, ఈ వెబ్‌సైట్లలో మీ వాహనాన్ని రిజిస్టర్ చేసుకున్నట్లయితే, మీ రూట్లో ప్రయాణించే వ్యక్తులు ఎవరైనా ఉంటే వారు మీతో పాటుగా కారును షేర్ చేసుకొని ప్రయాణించే అవకాశం ఉంది.
హైదరాబాద్‌లో రైడ్‌మేట్స్ (ridemates.org), మిల్‌కేచలో (milkechalo.com) వంటి వెబ్‌సైట్లు కార్ పూలింగ్ సేవలను అందిస్తున్నాయి. కార్ పూలింగ్ వలన ఇంధన ఖర్చును తోటి ప్రయాణికులతో పంచుకొని మీ నెలవారీ ఇంధన బడ్జెట్‌లో కాస్తంత మిగులు పొందటమే కాకుండా, పర్యావరణానికి కూడా మీరు, మీతోటి వారు మేలు చేసిన వారు అవుతారు.

కార్ పూలింగ్

కార్ పూలింగ్

కార్ పూలింగ్

కార్ పూలింగ్

కార్ పూలింగ్

కార్ పూలింగ్

కార్ పూలింగ్



Click it and Unblock the Notifications








