విమానం కిటికీలు గుండ్రంగానే ఎందుకు ఉంటాయో తెలుసా.. దాని వెనుక అసలు కారణమిదే.!!
ఫ్లైట్ జర్నీ చేసేటప్పుడు మీరెప్పుడైనా గమనించారా.. విమానంలో విండోస్(కిటికీలు) గుండ్రంగా ఉంటాయి. కానీ బస్సులు, రైళ్లలో, ఇతర వాహనాల్లో అలా గుండ్రంగా ఉండవు. ఫ్లైట్‌లో విండోస్ గుండ్రంగా ఎందుకు ఉంటాయని.. వేరే ఆకారంలో ఎందుకు ఉండవని మీరెప్పుడైనా ఆలోచించారా.. అందుకు కారణాలివే..
చాలా మందికి ఫ్లైట్ జర్నీ చేయాలని డ్రీమ్ ఉంటుంది. ఎందుకంటే ఆకాశంలో విహరిస్తూ వెళ్లాలని ఎవరికైనా ఉంటుంది. అయితే ఇదంతా ఒకప్పుడు. ఒకప్పుడు విమానయానం ధనవంతులకు మాత్రమే అందుబాటులో ఉండేది. కానీ ఇప్పుడు అందరికీ సర్వసాధారణమైపోయింది. పెరుగుతున్న డొమెస్టిక్ విమానాలు, ఫ్లైట్ టికెట్లపై డిస్కౌంట్లతో చాలా మంది ఫ్లైట్ జర్నీ చేయగలుగుతున్నారు.

అయితే బస్సు, ట్రైన్ మాదిరిగానే విమానం ఎక్కే చాలా మంది ఫ్లైట్ విండో(Flight Window Seat) వద్దే సీటు రావాలని కోరుకుంటారు. కిటికీ పక్కన కూర్చుని మేఘాలను చూస్తూ జర్నీ చేయడం అదో అందమైన అనుభూతి. కానీ అప్పుడప్పుడూ విమానాల్లో ముఖ్యంగా టేకాఫ్, ల్యాండింగ్ సమయాల్లో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతుంటాయి.
ఈ ప్రమాదాల నివారణ కోసమే విమానం కిటికీలు కేవలం గుండ్రని ఆకారంలో ఉంటాయట( (Why Airplane Windows Are Round)). ఇలా ఉండటం వెనుక భద్రతకు సంబంధించిన అనేక కారణాలే ఉన్నాయట. ఫ్లైట్ విండో సీట్ గుండ్రంగా ఉండటానికి ప్రమాదాలు జరగకుండా ఉండటానికి సంబంధమేమిటి అనుకుంటున్నారా.. అందుకు కొన్ని కారణాలే ఉన్నాయి.

ఏ విమాన కిటికీలను చూసినా చతురస్త్రం, దీర్ఘ చతురస్రం ఆకారంలో కాకుండా కాస్త గుండ్రంగానే అంటే వొవెల్(కోడిగుడ్డు) ఆకారంలో ఉంటాయని గమనించే ఉంటారు. అసలు విమానాల కిటికీలు ఎందుకు కోడిగుడ్డు ఆకారంలా వివరంగా చెప్పాలంటే కాస్త గుండ్రంగా ఎందుకు ఉండటం వెనుక పెద్ద మతలబే ఉంది.
గతంలో ఈ విషయం పెద్ద చర్చనీయాంశంగానే మారింది. 1950 ల కాలంలో అప్పుడు జెట్ లైనర్ విమానాలు.. మిగతా విమానాలతో పోలిస్తే వేగంగా దూసుకెళ్లగల లక్షణాలు కలిగి ఉండటంతో బాగా ప్రసిద్ధి చెందాయి. అంతేకాకుండా ఎంత ఒత్తిడినైనా తట్టుకునేలా ఉండేవి. కానీ ఈ జెట్ లైనర్ విమానం కిటికీలు మాత్రం చతురస్రాకారంలో ఉండేవట.

అయితే చాలా ఏళ్ల క్రితం కొన్ని ప్రతికూల పరిస్థితుల ప్రభావం కారణంగా ఇలాంటి జెట్ లైనర్ విమానం ఒకటి కూలిపోవడంతో పదుల సంఖ్యలో మరణించారు. ఈ ఘటనపై అధికారులు విచారణ జరపగా.. ఈ ప్రమాదానికి విమాన కిటికీలే కారణంగా నిర్ధారించారు. దీంతో ఆ సంఘటన తర్వాత కిటికీల డిజైన్‌ను వేరే ఆకారంలో మార్చారు.
సాంకేతికత పెరుగుతున్న కొద్దీ విమానం ఎగిరే ఎత్తు కూడా పెరుగుతూ వస్తోంది. దీంతో కిటికీల డిజైన్‌ను కూడా పూర్తిగా గుండ్రంగా మార్చేశారు. అయితే ఆకాశంలో విమానం వేగంగా ప్రయాణిస్తున్న సమయంలో విండో గాలి ఒత్తిడిని తట్టుకోలేక వాటిపై త్వరగా పగుళ్లు వస్తున్నాయి. అయితే గుండ్రంగా ఉండే విండోలు గాలి ఒత్తిడిని ఈజీగా తట్టుకుంటాయి. దీంతో దానిపై పగుళ్లు ఏర్పడే అవకాశం లేదు.

ఆకాశంలో విమానం ఎగురుతున్నప్పుడు.. విమానం లోపల గాలి పీడనం(Pressure) రెండు వైపులా ఉంటుంది. అందుకే గుండ్రని(కోడిగుడ్డు) ఆకారంలో విమానం కిటికీలు ఉంటాయి. దీంతో అప్పటి నుంచి రౌండ్ ఆకారంలో ఫ్లైట్ విండోస్‌ను అమరుస్తూ వస్తున్నారు. దీని ద్వారా ఒత్తిడి అనేది విండోలపై ఒకచోట మాత్రమే కేంద్రీకృతం కాకుండా కిటీకీ చుట్టూ తిరిగి బయటకు వెళ్లిపోతుందట.
ఈ క్రమంలో తక్కువ ప్రెజర్ మాత్రమే విండోపై పడటం వల్ల విమానాలు కూడా జర్నీ సమయంలో సురక్షితంగా ఉంటూ ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానానికి చేరుస్తాయి. అందుకే బస్సు, ట్రైన్, కారు మాదిరిగా కాకుండా ఆకాశంలో ఎగిరే విమానాల కిటికీలు ఇలా గుండ్రని ఆకారంలో విమానయాన సంస్థలు రూపొందిస్తున్నాయి.


Click it and Unblock the Notifications








