ఇది నిజమా.. బైక్‌తో పోలిస్తే స్కూటర్‌ తక్కువ మైలేజ్‌ ఇస్తుందా.??.. కారణాలేంటంటే.!!

బైక్‌ లేదా స్కూటర్‌, ఇలా కొత్త వాహనం కొనుగోలు చేసేటప్పుడు ఎక్కువ మైలేజ్‌ ఇచ్చే వాహనాలకు ప్రాధాన్యత ఇస్తారు. అయితే బైక్‌ కంటే స్కూటర్‌ తక్కువ మైలేజ్‌ ఇస్తుందని మీరు ఎప్పుడైనా గమనించారా.??.. ఒకే ఇంజిన్‌ కెపాసిటీ ఉన్న స్కూటర్‌, బైక్‌లను పోల్చి చూస్తే ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.

సాధారణంగా బైక్‌తో పోలిస్తే స్కూటర్‌(Scooter Mileage) ఎక్కువ మైలేజ్‌ ఇస్తుందని చాలా మంది అనుకుంటారు. కానీ అది తప్పు. ఒకే కెపాసిటీ ఇంజిన్‌(Engine Capacity) ఉన్న బైక్ మరియు స్కూటర్‌ని మీరు ఎలా వాడినా బైక్‌తో పోలిస్తే స్కూటర్‌ తక్కువ మైలేజ్‌ ఇస్తుంది. దీని వెనుక కొన్ని మెకానికల్‌ రీజన్స్‌ ఉన్నాయి. అవేంటంటే..

Bike-Vs-Scooter-Mileage

ఒక వాహనం లీటరు పెట్రోల్‌కు ఎంత దూరం ప్రయాణించగలదనేది మైలేజ్ సూచిస్తుంది. మన జర్నీలో ఎంత పెట్రోల్ ఖాళీ అవుతుందనేది బైక్‌ లేదా స్కూటర్‌ ఇంజిన్ కెపాసిటీ ద్వారా తెలుస్తుంది. కాగా ఇంజిన్ పనితీరుకు సంబంధించి RPM అనేది చాలా ముఖ్యమైనది. ఆటోమేకర్లు ఒక లీటర్ పెట్రోల్‌కు అంత RPM వచ్చే విధంగా ఇంజిన్‌ను డిజైన్ చేస్తారు.

ఉదాహరణకు, మీరు బైక్‌ లేదా స్కూటర్‌ను 2000 rpm వద్ద ఒక గంట నిరంతరాయంగా నడిపితే, ఒక గంటలో ఒక లీటర్ పెట్రోల్ ఖర్చవుతుందని అనుకుందాం. ఈ ఒక్క గంటలో మీరు ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించారో లెక్కిస్తే అదే మీ వాహనం మైలేజ్‌. ఇలా చూస్తే తక్కువ rpm వద్ద ఎక్కువ దూరం ప్రయాణిస్తే ఎక్కువ మైలేజ్‌ వస్తుందని అర్థం.

Bike-Vs-Scooter-Mileage

అయితే స్కూటర్ మరియు బైక్ మధ్య(Bike Mileage) మైలేజ్‌లో తేడా రావడానికి కారణాలు ఉన్నాయి. ఇందుకోసం ముందుగా మీరు గేర్ ఫీచర్స్ గురించి తెలుసుకోవాలి. బైక్‌లు ఎక్కువగా మాన్యువల్ గేర్‌తో అమర్చబడి ఉండగా.. స్కూటర్లలో CVT గేర్‌బాక్స్‌ను అమర్చుతారు. ఈ రెండింటిలో మైలేజ్‌లో తేడా రావడానికి ఇదే ప్రధాన కారణం.

ఈ గేర్ బాక్స్.. ఇంజిన్‌లో ఉత్పన్నమయ్యే టార్క్‌ను వాహనం యొక్క చక్రాలకు ప్రసారం చేసే ఒక ముఖ్యమైన సాధనంగా పనిచేస్తుంది. మాన్యువల్ గేర్ బాక్స్ విషయంలో, అధిక గేర్‌లో ప్రయాణించేటప్పుడు, ఇంజిన్ నుంచి ఎక్కువ టార్క్ వీల్స్‌కు అందుబాటులో ఉంటుంది. దీని ద్వారా బైక్‌ ఎక్కువ దూరం ప్రయాణించడానికి దోహదపడుతుంది. ఇక్కడ డ్రైవర్‌కు ఈ మాన్యువల్ గేర్‌ను నియంత్రించే అవకాశముంటుంది కాబట్టి మైలేజ్ అతని డ్రైవింగ్ సామర్థ్యం ఆధారంగా ఉంటుంది.

Bike-Vs-Scooter-Mileage

ఈ విధంగా మాన్యువల్ గేర్ వాహనం డ్రైవర్ తక్కువ ఆర్‌పీఎమ్‌లో ఎక్కువసేపు టాప్ గేర్‌లో ప్రయాణిస్తే మంచి మైలేజ్ లభిస్తుంది. కానీ స్కూటర్లలోని CVT గేర్‌బాక్స్‌ల విషయానికొస్తే, అవి ఆటోమేటిక్‌గా RPMని బట్టి గేర్‌లను మార్చడానికి మరియు ట్రాక్షన్ సామర్థ్యాన్ని మార్చేలా రూపొందిస్తారు. మీరు తక్కువ rpm వద్ద ఉన్నప్పుడు ఇది డౌన్‌షిఫ్ట్‌కి కారణమవుతుంది. అధిక rpm వద్ద ఉన్నప్పుడు మాత్రమే దాని గేర్ ఎక్కువగా ఉంటుందని భావించాలి.

ఫలితంగా స్కూటర్‌ రైడర్ల(Bike Mileage Vs Scooter Mileage)కు గేర్‌పై నియంత్రణ ఉండదు. ఇలా బైక్, స్కూటర్‌లను పోల్చి, మైలేజ్‌ని పరిగణనలోకి తీసుకుంటే.. బైక్ ఎక్కువ మైలేజీని, స్కూటర్ తక్కువ మైలేజ్‌ను ఇస్తుంది. ఏదేమైనా చివరగా.. బైక్ కంటే స్కూటర్ తక్కువ మైలేజీని ఇచ్చినప్పటికీ, అంతిమ మైలేజ్ మాత్రం.. రైడర్ వాహనాన్ని ఎలా నడుపుతున్నారనే దానిపైనే ఆధారపడి పనిచేస్తుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, March 26, 2024, 16:44 [IST]
English summary
Scooter gives less mileage than motorcycle even though at same engine capacity here are the reasons
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+