స్కూటర్లు ఉన్నవారు ప్రతీ ఒక్కరూ ఇవి తెలుసుకోవాలి.. లేకుంటే మీ జేబులకు చిల్లు పడటం ఖాయం!
మార్కెట్‌లో ఈ మధ్య మోటార్‌సైకిళ్ల కంటే ఎక్కువగా స్కూటర్లు కనిపిస్తున్నాయి. లేడీస్, యువతి యువకులు వీటిని నడిపేందుకు సులువుగా ఉంటాయి. అందువల్ల ఎక్కువగా వీటిని కొనేందుకు జనాలు ఆసక్తి కనబరుస్తారు. ఇతర గేర్ల టూవీలర్స్‌తో పోల్చితే వీటిని రద్దీగా ఉండే సిటీ రోడ్లపై సులువుగా డ్రైవ్ చేయవచ్చు. ఇండోనేషియా, థాయ్‌లాండ్, ఫిలిప్పీన్స్ వంటి ఆగ్నేయాసియా దేశాల్లో మోటార్‌సైకిల్స్ కంటే ఎక్కువగా స్కూటర్లను జనాలు వినియోగిస్తూ ఉంటారు. మన దగ్గర కూడా ప్రతీ ఇద్దరి ద్విచక్ర వాహనదారుల్లో ఒకరు స్కూటర్‌ని కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో పెట్రోల్ స్కూటర్లతో పాటు ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాలు జోరందుకున్నాయి.
మొత్తం అమ్మకాల్లో హోండా కంపెనీ యాక్టివా, టీవీఎస్, సుజుకి వంటి ఇతర కంపెనీల స్కూటర్లు పెద్ద సంఖ్యలో విక్రయిస్తున్నారు. ప్రతీ నెల దేశంలో 1.5 లక్షల నుంచి 2 లక్షల స్కూటర్లు సేల్ అవుతున్నాయి. బైక్‌లతో పోల్చితే వీటని నడపడం చాలా సులువు. కానీ స్కూటర్లు బైక్‌ల వలె వేగంగా ప్రయాణించలేవు. ఇది ఒక్కటే వీటిలో ఉండే మైనస్.

మోటార్‌సైకిల్స్‌తో పోల్చితే వీటి మెయింటెనెన్స్ చాలా తక్కువ. కొన్ని సందర్భాల్లో ఇవి కూడా మీ జేబులకు చిల్లులు పెట్టే అవకాశం ఉంటుంది. అందువల్ల సరైన ప్రణాళికతో స్కూటర్లను మెయింటైన్ చేయాలి. లేదంటే దీర్ఘకాలంలో మీకు అవి కొత్త సమస్యలను తెచ్చి పెడతాయి. ఎలక్ట్రిక్ స్కూటర్లతో పోల్చితే పెట్రోల్ స్కూటర్లను రెగ్యూలర్‌గా సర్వీసింగ్ చేయించాలి. లేనియెడల ఆ స్కూటర్ పనితీరు తగ్గుతుంది. స్కూటర్ల ఎలా మెయింటైనెన్స్‌కి సంబంధించిన పాటించాల్సిన వివరాలు మీకోసం..
సర్వీసింగ్: స్కూటర్‌ని ఎప్పటికప్పుడు సర్వీసింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. వెహికిల్ కొనేముందు మ్యాన్యువల్ ఈ విషయాన్ని కంపెనీ స్పష్టంగా తెలియజేస్తుంది. ఫ్రీ సర్వీస్‌లు ముగిసిన తర్వాత చాలామంది దీనిని మర్చిపోతారు. అయితే మీ స్కూటర్ ఎక్కువ కాలం నిలవాలంటే కంపెనీ సిఫారసు చేసిన విధంగా క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేయాలి. కీలకమైన సర్వీసింగ్ చేయించడం మానేస్తే మీకు కొత్త చిక్కులు తప్పువు.

ఇంజిన్ ఆయిల్ చెకింగ్: పెట్రోల్ స్కూటర్లు సజావుగా పనిచేయాలంటే ఇంజిన్ ఆయిల్ చాలా కీలకం. కావున క్రమం తప్పకుండా ఇంజిన్ ఆయిల్‌ని మార్చుతూ ఉండాలి. ఈ చర్య కూడా సర్వీసింగ్‌లో భాగంగానే ఉంటుంది. ఇంజిన్ ఆయిల్ క్వాలిటీగా ఉండేలా చూసుకోవాలి. అవసరం అయితే మీరు ఇంజిన్ ఆయిల్ మెకానిక్ ఇవ్వండి. అప్పుడప్పుడు ఈ ఆయిల్ లెవల్స్‌ని చెక్ చేస్తూ ఉండాలి. ఆయిల్ తగ్గినట్లు గుర్తిస్తే అవసరమైతే మీరే ఫిల్ చేయవచ్చు.
ప్రతి స్కూటర్‌లో వినియోగించే ఆయిల్ మోడల్ లేదా ప్రతీ కంపెనీ ఢిఫరెంట్ గ్రేడింగ్‌ని కలిగి ఉంటుంది. కావున కంపెనీ సిఫార్సు చేసిన ఇంజిన్ ఆయిల్‌ని మాత్రమే ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇది బైక్ నడిచేందుకు కీలకం కాబట్టి ఈ విషయంలో నిర్లక్ష్యంగా ఉండవద్దు. కావున కేవలం షోరూమ్‌ల్లో లేదా తెలిసిన మెకానిక్ వద్ద మాత్రమే సర్వీసింగ్‌ని చేయించుకోండి.

ఎయిర్ ఫిల్టర్ మార్చండి: స్కూటర్ ఇంజిన్ లోపల ఆయిల్ నాణ్యత ఎంత ముఖ్యమో గాలి కూడా అంతే ముఖ్యమని కస్టమర్లు గుర్తించాలి. గాలిలో ఉండే దుమ్ము, ధూళి కణాలు ఇంజిన్‌కి తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. ఆధునిక స్కూటర్లలో ఎయిర్ ఫిల్టర్లను సులభంగా రీప్లేస్ చేయవచ్చు. కానీ పాత వాటిలో ఇది కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. కావున సాధ్యామైనంత వరకు ఎయిర్‌ఫిల్టర్స్‌ని మారుస్తూ ఉండాలి.
ఇంజిన్‌ని కాసేపు హీట్ చేయండి: మంచి పికప్ కోసం 2-5 నిమిషాల వరకు ఇంజిన్ స్టార్ట్ చేసి ఉంచండి. అలా చేయడం ద్వారా ఇంజిన్ వేడెక్కి ఇంజిన్ ఆయిల్ స్కూటర్‌లోని అన్ని భాగాలకు వెళుతుంది. ముఖ్యంగా చలికాలంలో ఈ పద్ధతిని ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఇలా చేయడం అందరూ అలవాటు చేసుకోవాలి. అయితే ఇప్పుడు వస్తున్న స్కూటర్లలో ఆటో ఇంజిన్ హీట్ ఆప్షన్ ఉంది.


Click it and Unblock the Notifications








