సెకండ్ హ్యాండ్ కారును విక్రయించడం ఎలా? చిట్కాలు

Written By:

కొత్త కారును కొనుగోలు చేయటం సులువే, కానీ అదే కారును కొద్ది రోజులు ఉపయోగించిన తర్వాత మంచి మొత్తానికి విక్రయించడం మాత్రం చాలా కష్టమైన పని. కారు సెకండ్ హ్యాండ్ అయిన తర్వాత, దాని మార్కెట్ విలువ చాలా వరకూ తగ్గి పోతుంది.

సెకండ్ హ్యాండ్ కార్లను నేరుగా విక్రయించలేని కస్టమర్లను, నగరాల్లో ఉండే సెకండ్ హ్యాండ్ కార్ షోరూమ్/డీలర్ల మాయలో పడి మోసపోతుంటారు. వాస్తవానికి, మంచి కండిషన్‌లో ఉండే సెకండ్ హ్యాండ్ కారును మీరు అనుకున్న మొత్తానికే విక్రయించవచ్చు.

అదెలాగో ఈ కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి..!

1. వాష్ అండ్ క్లీన్

1. వాష్ అండ్ క్లీన్

సెకండ్ హ్యాండ్ కారును విక్రయించడానికి ముందుగా, సదరు కారుని నీట్‌గా వాష్ చేసి, అవసరమైతే పాలిష్ చేయించి తళతళా మెరిసేలా ఉంచుకోవాలి. కారులోని ఇంటీరియర్లను కూడా వాక్యూమ్ క్లీనర్ సాయంతో నీట్‌గా క్లీన్ చేయించాలి. కారు ఎంత అందంగా కనిపిస్తే, కస్టమర్ అంత ఎక్కువ డబ్బును చెల్లించడానికి ఇష్టపడుతాడు.

2. మంచి ఫొటోలు తీయండి

2. మంచి ఫొటోలు తీయండి

ఒకవేళ మీరు ఇంటర్నెట్ ద్వారా కారును విక్రయించాలనకుంటే, ఆ కారుకు సంబంధించి మంచి ఫొటోలను తీయండి. కారులోని ప్రతి డీటేల్‌ను ఫొటో తీసి, ఇంటర్నెట్ సైట్లలో అప్‌లోడ్ చేయండి. ఫొటోలలో కారు ఎంత అందంగా, స్పష్టంగా కనిపిస్తే అంత మంచి స్పందన లభిస్తుంది.

3. రీడింగ్‌ని ట్యాంపర్ చేయకండి

3. రీడింగ్‌ని ట్యాంపర్ చేయకండి

ఉత్తమ ధర కోసం మీ వాహన రీడింగ్‌ని ట్యాంపర్ చేసే ప్రయత్నం చేయకండి. ఇంటర్నెట్‌లో కారు ఫొటోలను అప్‌లోడ్ చేసేటప్పుడు కారు అప్పటి వరకూ ఎన్ని కిలోమీటర్లు తిరిగిందో చూపించే రీడింగ్ ఫొటోని కూడా అప్‌లోడ్ చేయండి. ఇది కస్టమర్లకు మంచి ఇంప్రెషన్‌ను కలగజేస్తుంది. అలాగే, ఆ కారుకు మీరే మొదటి యజమానా లేక అంతకు ముందు ఎంత మంది యజమానులు మారారనే విషయాన్ని కూడా పేర్కొనండి.

4. మీ కారు ధరను లెక్కించుకోండి

4. మీ కారు ధరను లెక్కించుకోండి

ఇతరులకు మీ పాత కారును ఇంత ధరకు విక్రయించాలని చెప్పడానికి ముందుగా, అసలు మీ కారు ఎంత విలువ చేస్తుందనే విషయాన్ని తెలుసుకోండి. ఇంటర్నెట్‌లో యూజ్డ్ కార్ ఎవాల్యుషన్ అని టైప్ చేస్తే, బోలెడ్ క్యాలుక్యులేటర్లు వస్తాయి. అందులో వివరాలను సక్రమంగా ఫిల్ చేస్తే, మీ కారు యావరేజ్ ధర తెలుస్తుంది. దానిని బట్టి మీరు నిర్ణయించుకున్న ధరను మరోసారి సరి చూసుకోండి.

5. ఆఫర్లకు మోసపోకండి

5. ఆఫర్లకు మోసపోకండి

సెకండ్ హ్యాండ్ కార్లను కొనుగోలు చేసే బ్రోకర్లు చెప్పే మాటలకు బురిడీ కాకండి. సాధారణంగా, బ్రోకర్లు మార్కెట్ విలువ కన్నా ఐదు పది వేలు తగ్గించి చెబుతారు. కాబట్టి, ఇంటర్నెట్‌లో మీ కార్ విలువను తెలుసుకునే ప్రయత్నం చేయండి. నకిలీ ఆఫర్లను చూసి మోసపోకండి.

6. ఇంట్రెస్టెడ్ బయ్యర్స్

6. ఇంట్రెస్టెడ్ బయ్యర్స్

కారుకు సంబంధించిన ప్రకటనను ఇంటర్నెట్‌లో పెట్టిన తర్వాత మీకు వరుసగా ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి, వాటిలో నిజమైన, ఆసక్తి కలిగిన కస్టమర్లను ఎంచుకొని, వారి వివరాలను సేకరించండి. మీ పాత కారుకు సంబంధించిన అన్ని విషయాలను సదరు కస్టమర్లతో షేర్ చేసుకోండి.

7. ధర విషయంలో తగ్గకండి

7. ధర విషయంలో తగ్గకండి

ఎంతో కొంత వస్తే సరిపోతుందిలే అని, మీరు నిర్ణయించిన ధర కన్నా తక్కువ ధరకు మాత్రం మీ పాత కారును విక్రయించకండి. ఒకవేళ మీ కారును లక్ష రూపాయలకు విక్రయించాలని నిర్ణయించుకుంటే, ఆ ధరకు మీరు ఏ మాత్రం తగ్గకండి. కస్టమర్లు ఎవరూ రావట్లేదని 80 వేలకే విక్రయించేయకండి. బేరమాడే కస్టమర్లు ఉంటారు, కానీ నిజమైన కస్టమర్లు దొరికితే మీ పంట పండినట్లే.

8. సరైన వివరాలు తెలియజేయండి

8. సరైన వివరాలు తెలియజేయండి

కారు కొనడానికి ఆసక్తి చూపే కస్టమర్లకు నిజమైన, స్పష్టమైన వివరాలను తెలియజేయండి. ఒరిజినల్ డాక్యుమెంట్ కాపీలను చూపించండి. ఒకవేళ అతను కారును టెస్ట్ డ్రైవ్ చేస్తానంటే, టెస్ట్ డ్రైవ్‌ని ఆఫర్ చేయండి (కారులో మీరు కూడా అతనితో పాటుగా టెస్ట్ డ్రైవ్‌కి వెళ్లండి). కారులోని ఫీచర్ల గురించి సదరు కస్టమర్‌కు వివరించండి.

9. బయ్యర్ గురించి తెలుసుకోండి

9. బయ్యర్ గురించి తెలుసుకోండి

కారును కొనటానికి వచ్చిన బయ్యర్, మీ కారు విషయంలో చాలా ఆసక్తి చూపిస్తున్నట్లుగా అనిపిస్తే, వెంటనే డీల్‌ని పక్కా చేయకండి. ముందుగా ఆ కస్టమర్‌కు సంబంధించి కాస్తంత బ్యాగ్రౌండ్ వెరిఫికేషన్ చేయండి. అతను ఎక్కడ పనిచేస్తాడు, ఎక్కడ నివసిస్తాడు, అతనికి వేరే కార్లేమైనా ఉన్నాయా వంటి సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి.

10. పేపర్ వర్క్ చేయండి

10. పేపర్ వర్క్ చేయండి

బయ్యర్ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత, పేపర్ వర్క్ చేపట్టండి. బయ్యర్ నుంచి నగదు రాగానే, కారుకు సంబంధించిన ఒరిజినల్ పత్రాలతో పాటుగా సదరు కారు యాజమాన్య మార్పుకు సంబంధించిన ఫారమ్‌పై కూడా మీరు సైన్ చేసి, ఒరిజినల్ డాక్యుమెంట్లతో పాటుగా బయ్యర్‌కి అందజేయండి. వీలైతే బయ్యర్ ఐడి ప్రూఫ్ ఒకదానిని మీ వద్ద ఉంచుకోండి.

11. గుర్తుంచుకోవాల్సిన విషయాలు

11. గుర్తుంచుకోవాల్సిన విషయాలు

రాత్రివేళల్లో డీల్స్ చేయకండి, ఎందుకంటే ఆ సమయంలో బయ్యర్స్ కారు స్థితిగతులను సరిగ్గా తెలుసుకోలేరు. కారును విక్రయించగానే మీ పని అయిపోనట్లు కాదు, కారును కొనుగోలు చేసిన బయ్యర్‌కి ఫోన్ చేసి యాజమాన్య మార్పు గురించి ఫోన్ చేసి, తెలుసుకోండి లేకపోతే కారుకు ఏదైనా ప్రమాదానికి గురైతే మీరు రిస్కులో పడే ఆస్కారం ఉంటుంది.

English summary
One of the most difficult stages of owning an automobile is when it is time to part with it. It could either be because you want another car or may even be because you are moving away to a place where you won't be able to take the car.
Story first published: Friday, March 27, 2015, 17:27 [IST]
Please Wait while comments are loading...

Latest Photos