బ్రేకులు ఫెయిల్ అవుతున్నాయని తెలిపే సంకేతాలు

కొన్ని సార్లు ప్రయాణంలో ఉన్నపుడు బ్రేకులు ఫెయిల్ అవుతుంటాయి. అయితే బ్రేకులు ఫెయిల్ అవడాన్ని మనం ముందే గమనించవచ్చు. బ్రేకులు ఫెయిల్ అవుతున్నాయని తెలిపే ఐదు సంకేతాలు

కారు లేదా బైకులో మెరుపు వేగంతో ప్రయాణించడం పెద్ద కష్టమేమి కాదు. అయితే ఆ వేగాన్ని అదుపు చేయాలంటే బ్రేకులు తప్పనిసరిగా ఉండాలి. బ్రేకులు సరిగా పనిచేయలేదని తెలిస్తే, ఆ వాహనాన్ని వాడకపోవం ఎంతో మంచిది.

కొన్ని సార్లు ప్రయాణంలో ఉన్నపుడు బ్రేకులు ఫెయిల్ అవుతుంటాయి. అయితే బ్రేకులు ఫెయిల్ అవడాన్ని మనం ముందే గమనించవచ్చు. బ్రేకులు ఫెయిల్ అవుతున్నాయని తెలిపే ఐదు సంకేతాలను ఇవాళ్టి స్టోరీలో చూద్దాం రండి....

బ్రేకులు ఫెయిల్ అవుతున్నాయని తెలిపే సంకేతాలు

రాసుకుంటున్న శబ్దం రావడం...

రాసుకుంటున్న శబ్దం లేదా గీసుకుంటున్న శబ్దం వస్తున్నట్లయితే బ్రేకులు ఫెయిల్ అవుతున్నాయనడానికి సంకేతం. నిజానికి, చాలా కంపెనీలు భద్రత కోసం కార్లలో ఈ శబ్దం వచ్చే విధంగా ప్రత్యేక మెకానిజాన్ని ఏర్పాటు చేస్తాయి. బ్రేకులను చివరి వరకు ప్రెస్ చేసినప్పటికీ వెహికల్ ఆగలేదంటే కదలికలో ఉన్న రెండు పార్ట్స్ ఒకదానినొకటి రాసుకుని ఇలాంటి శబ్ధాన్నిస్థాయి. అంటే బ్రేకులను రిపేరి చేయించాలని ఈ శబ్దం చెపుతుంది.

Recommended Video

Jeep Compass Launched In India | In Telugu - DriveSpark తెలుగు
బ్రేకులు ఫెయిల్ అవుతున్నాయని తెలిపే సంకేతాలు

గరగరమనే శబ్దం రావడం...

బ్రేకులను అప్లే చేసినపుడు చక్రాల వద్ద ఉన్న బ్రేక్ షూ డ్రమ్‌ను గట్టిగా పట్టి ఉంచుతుంది. ఈ రెండింటి మధ్య బ్రేక్ లైనింగ్ ఉంటుంది. ఎక్కువ కాలం పాటు బ్రేక్ లైనింగ్‌లు మార్చకపోతే అరిగిపోయి బ్రేక్ షూ డ్రమ్‌తో రాపిడికి గురవుతుంది. అప్పుడు గరగరమనే శబ్దం వస్తుంది. ఇలాంటి సందర్భాల్లో బ్రేక్ షూ అరిగిపోతే బ్రేకులు ఫెయిల్ అవడం ఖాయం. కాబట్టి బ్రేకులు వేసినపుడు ఇలాంటి శబ్దం వస్తే దగ్గర్లోని మెకానిక్‌తో వెంటనే చెక్ చేయించండి.

బ్రేకులు ఫెయిల్ అవుతున్నాయని తెలిపే సంకేతాలు

బ్రేకులు వేసినపుడు అదుర్లు మరియు కుదుపులు రావడం

ఇందులో రెండు రకాల వైబ్రేషన్స్ ఉంటాయి. అవి,

1. బ్రేక్ అప్లే చేసినపుడు బ్రేక్ పెడల్ వైబ్రేట్ అవడం, అంటే బ్రేకులు సమస్యాత్మకంగా ఉన్నట్లుగా గుర్తించండి.

2. బ్రేకులు వేసినపుడు వెహికల్ మొత్తం వైబ్రేషన్స్ రావడం, అంటే బ్రేకులో పెద్ద సమస్య ఉన్నట్లు భావిచండి.

బ్రేకులు ఫెయిల్ అవుతున్నాయని తెలిపే సంకేతాలు

బ్రేక్ పెడల్ మీద మరియు కారు మొత్తం వైబ్రేషన్స్ వస్తున్నాయంటే బ్రేకుల్లో అరుగుదల ఎక్కువగా ఉండటం మరియు బ్రేకులను మార్చి చాలా కాలం అయి ఉంటుంది. పరిమిత వేగం తర్వాత ఇలా వైబ్రేషన్స్ వస్తున్నట్లయితే వెంటనే మెకానిక్ దగ్గరకు తీసుకెళ్లండి.

బ్రేకులు ఫెయిల్ అవుతున్నాయని తెలిపే సంకేతాలు

బ్రేక్ పెడల్ లోతుగా ప్రెస్ చేస్తున్నారా....?

వెహికల్ వేగాన్ని పూర్తిగా తగ్గించడానికి బ్రేక్ పెడల్స్‌ను లోతుగా ప్రెస్ చేస్తున్నారా....? అయితే, ఆ బ్రేకులు ఖచ్చితంగా ఫెయిల్ అవుతాయి. బ్రేక్ ఫ్లూయిడ్ తక్కువగా ఇలా జరుగుతుంది. నిజానికి బ్రేక్ ఆయిల్ ఆవిరయ్యే అవకాశాలు చాలా తక్కువ. కాబట్టి బ్రేక్ ఆయిల్ లీక్ అవుతుందేమోనని చెక్ చేసుకోండి. ఒకవేళ లీక్ అవుతున్నట్లయితే వెంటనే మెకానిక్‌ను సంప్రదించి రిపేరి చేయించండి. బ్రేక్ ఫ్లూయిడ్ లేని వెహికల్స్ నడపడం ప్రాణాలతో చెలగాటమాడటంతో సమానం.

బ్రేకులు ఫెయిల్ అవుతున్నాయని తెలిపే సంకేతాలు

కారు డ్యాష్ బోర్డులో బ్రేక్ వార్నింగ్ లైట్ ఉంటుందా? అవును, ఈ మధ్య కాలంలో వస్తున్న కార్లలో బ్రేక్ వార్నింగ్ లైటు ఉంటుంది. కారులో ఉన్న భద్రత ఫీచర్ల ఆధారంగా వీటిని కార్ల కంపెనీలు అందిస్తాయి. ఒక వైపు యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్, మరో వైపు బ్రేక్ సిస్టమ్ వార్నింగ్ లైట్లు ఉంటాయి.

బ్రేకులు ఫెయిల్ అవుతున్నాయని తెలిపే సంకేతాలు

వెహికల్ మూవింగ్‌లో ఉన్నపుడు బ్రేక్ అప్లే చేస్తే ఏబిఎస్ సిస్టమ్ ఆక్టివేట్ అయినపుడు ఏబిఎస్ లైట్ వెలుగుతుంది. బ్రేకింగ్ మరియు ఏబిఎస్ వ్యవస్థల పనితీరులో లోపం ఉంటే బ్రేక్ వార్నింగ్ లైట్లు వెలుగుతాయి.

బ్రేకులు ఫెయిల్ అవుతున్నాయని తెలిపే సంకేతాలు

వెహికల్‌లో ఇతర భాగాలలో చిన్న అడ్జెస్ట్‌మెంట్ చేసుకునే విధంగా బ్రేకులకు అడ్జెస్ట్‌ చేసుకుని వెల్లేందుకు అస్సలు ట్రై చేయకండి... ఎందుకంటే అధిక వేగంలో ఉన్నపుడు అడ్జెస్ట్‌మెంట్స్ ఏవీ పనికిరావు. కాబట్టి పైన తెలిపిన సంకేతాలను వెహికల్ డ్రైవ్ చేస్తున్నపుడు గమనిస్తూ ఉండండి.

బ్రేకులు ఫెయిల్ అవుతున్నాయని తెలిపే సంకేతాలు

కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి.. "వేగం కన్నా ప్రాణం మిన్న". కాబట్టి, ఎక్కడికైనా బయలుదేరే ముందు కాస్తంత ముందుగానే బయలుదేరి నెమ్మదిగా రైడ్ చేసి సురక్షితంగా గమ్యం చేరుకోండి.

Most Read Articles

English summary
Read In Telugu: Signs Of Brakes Trying Fail
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X