మీకు తెలుసా.. కార్ స్టీరింగ్‌లో సమస్యను గుర్తించే సులభమైన టిప్స్.. ఇవే

సాధారణంగా వాహనాలు డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాహనదారులు మాత్రం ఏమరుపాటుగా ఉన్నా రోడ్డుపై ఉన్న ఇతరులకు మరియు వాహనంలో ఉన్నవారికి ప్రమాదం సంభవించే అవకాశం ఉంటుంది. కావున రోడ్డుపై ప్రయాణించే వాహనదారులు ఇతర వాహనదారులను కూడా తప్పకుండా గమనిస్తూ ప్రయాణించాలి.

మీకు తెలుసా.. కార్ స్టీరింగ్‌లో సమస్యను గుర్తించే సులభమైన టిప్స్.. ఇవే

డ్రైవింగ్ చేసేటప్పుడు మీరు చేసే ఏ చిన్న పొరపాటైనా అది చాలా పెద్ద ప్రమాదానికి దారి తీస్తుంది. కావున అప్రమత్తంగా ఉండాలి. అయితే వాహనదారులు ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ వాహనంలో ఏర్పడే చిన్న లోపమో లేదా చిన్న సమస్య ఊహించని పెద్ద ప్రమాదానికి దారి తీస్తుంది.

మీకు తెలుసా.. కార్ స్టీరింగ్‌లో సమస్యను గుర్తించే సులభమైన టిప్స్.. ఇవే

కార్లలో ఉన్న అత్యంత ప్రధానమైన భాగాల్లో స్టీరింగ్ వీల్ ఒకటి. కావున వాహదారుడు ఎప్పటికప్పుడు వాహనంలోని స్టీరింగ్ పరిస్థితిని గమనిస్తూ ఉండాలి. కొన్ని సార్లు కారులోని స్టీరింగ్ వీల్ అకస్మాత్తుగా జామ్ అవుతుంది. ఆ పరిస్థితి వాహనాన్ని నడిపే వ్యక్తిని భయబ్రాంతులకు గురిచేస్తుంది. ఆ సమయంలో ఊహించని ప్రమాదం జరుగుతుంది.

కారులోని స్టీరింగ్ వీల్ లో ఏదైనా చిన్న సమస్య ఎదురైనా దానిని ఎప్పటికప్పుడు పరిష్కరించుకోవాలి. డ్రైవింగ్ చేసినారు ముందుగా దీనిని గుర్తించే విధంగా ఉండాలి. స్టీరింగ్ వీల్ లోని లోపాన్ని గుర్తించడానికి కొన్ని టిప్స్ ఉన్నాయి. స్టీరింగ్ వీల్ లోని లోపాన్ని గుర్తించే ఈ విధానాలను గురించి పూర్తి సమాచారం ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

మీకు తెలుసా.. కార్ స్టీరింగ్‌లో సమస్యను గుర్తించే సులభమైన టిప్స్.. ఇవే

స్టిఫ్ స్టీరింగ్ వీల్:

వాహనదారుడు వాహనాన్ని డ్రైవింగ్ చేసేటప్పుడు స్టీరింగ్ వీల్ గట్టిగా ఉండి, తిప్పడానికి మామూలుగా కంటే కూడా ఎక్కువ గట్టిగా ఉంటే, అత్యవసర సమయంలో ఇది ప్రమాదంలో పడేసే అవకాశం ఉంటుంది. స్టీరింగ్ వీల్ సాధారణంగా ఉపయోగించే ర్యాక్ మరియు పినియన్ సిస్టమ్‌ కలిగి ఉంటుంది. ఇవన్నీ కూడా డ్రైవర్ స్టీరింగ్ వీల్‌ను తిప్పడం సులభం చేస్తుంది.

అయితే ఇందులోని పవర్ స్టీరింగ్ విఫలమైతే స్టీరింగ్ వీల్ గట్టిగా ఉంటుంది, అదేసమయంలో తిరగటం కూడా చాలా కష్టంగా ఉంటుంది. కారులో స్టీరింగ్ వీల్ గట్టిగా అనిపిస్తే తప్పకుండా సర్వీస్ సెంటర్ కి తీసుకెళ్లి సరి చేసుకోవాలి. లేకుంటే జరిగే ప్రమాదం ఊహాతీతంగా ఉంటుంది.

మీకు తెలుసా.. కార్ స్టీరింగ్‌లో సమస్యను గుర్తించే సులభమైన టిప్స్.. ఇవే

లూజ్ స్టీరింగ్ వీల్:

స్టీరింగ్ వీల్ సాధారణంగా ఉండటంకంటే కూడా చాలా వదులుగా ఉంటే కూడా సమస్యే. స్టీరింగ్ వీల్ లోని భాగాలు అరిగిపోవడం వల్ల స్టీరింగ్ వీల్ వదులుగా తయారవుతుంది. అయితే దీనిని ముందుగా గుర్తించి సరి చేసుకోకపోతే వాహనాన్ని సరైన సమయంలో తిప్పడం కష్టమవుతుంది. కావున ప్రమాదం జరుగుతుంది.

మీకు తెలుసా.. కార్ స్టీరింగ్‌లో సమస్యను గుర్తించే సులభమైన టిప్స్.. ఇవే

స్టీరింగ్ తిరిగేటప్పుడు శబ్దం రావడం:

స్టీరింగ్ వీల్ తిరిగేటప్పుడు అందులోనుంచి శబ్దం వచ్చినట్లు అనిపిస్తే, అది స్టీరింగ్ వీల్ సమస్యకు సంకేతం. కారు ఆన్ చేసినప్పుడు కూడా స్టీరింగ్ కింద నుండి కొట్టిన ధ్వని వస్తే, స్టీరింగ్‌లో కొంత సమస్య ఉందని వాహనదారుడు గుర్తించాలి. అంతే కాకుండా బ్రేకులు వేసేటప్పుడు కూడా స్టీరింగ్ నుండి ధ్వని రావచ్చు. ఇలాంటి సంకేతాలను గమనించి వాహనదారుడు అప్రమత్తంగా ఉండాలి. వెంటనే దానిని సరిచేసుకోవాలి.

మీకు తెలుసా.. కార్ స్టీరింగ్‌లో సమస్యను గుర్తించే సులభమైన టిప్స్.. ఇవే

స్టీరింగ్ వీల్‌లో బలమైన వైబ్రేషన్స్:

కారులోని ఇంజిన్ స్టార్ట్ చేసినప్పుడు లేదా డ్రైవింగ్ చేసేటప్పుడు స్టీరింగ్‌లో బలమైన వైబ్రేషన్స్ ఉంటే, అది స్టీరింగ్‌ వీల్ లో సమస్య ఉందని సంకేతం. స్టీరింగ్ వీల్‌లో బలమైన వైబ్రేషన్స్ వచ్చేటప్పుడు డ్రైవింగ్ చేయడం చాలా ప్రమాదకరం. ఇలాంటి సంకేతాలు వెలువడే సమయంలో అనుకోకుండా స్టీరింగ్ వీల్ జామ్ అయ్యే అవకాశం ఉంటుంది. కావున వాహనదారులు దీనిని గుర్తించిన వెంటనే రిపేర్ చేసుకోవాలి.

మీకు తెలుసా.. కార్ స్టీరింగ్‌లో సమస్యను గుర్తించే సులభమైన టిప్స్.. ఇవే

ఫ్లూయిడ్ లీక్:

వాహనదారుడు క్రమం తప్పకుండా కారు యొక్క స్టీరింగ్ ద్రవాన్ని తనిఖీ చేసుకోవాలి. కొన్నిసార్లు స్టీరింగ్ ద్రవం లీక్ అయ్యే కారణంగా జామ్ అవుతుంది. మీరు స్టీరింగ్‌ను తిప్పడానికి ఎక్కువ బలాన్ని ఉపయోగించాల్సి వచ్చినప్పుడు లేదా కదిలే వాహనంలో స్టీరింగ్ అకస్మాత్తుగా దృఢంగా మారినప్పుడు ఇది గుర్తించబడుతుంది. ఇది స్టీరింగ్ ఫ్లూయిడ్ స్థాయి తక్కువగా ఉందని సూచిస్తుంది. స్టీరింగ్ ఫ్లూయిడ్ ఎరుపు రంగులో ఉంటే అది పాతదైతే అది బ్లాక్ కలర్ లో ఉంటుంది. దీనిని కూడా తప్పకుండా గమనించాలి.

మీకు తెలుసా.. కార్ స్టీరింగ్‌లో సమస్యను గుర్తించే సులభమైన టిప్స్.. ఇవే

చక్రాలను తిప్పడంలో ఇబ్బంది:

కారు యొక్క చక్రాలను సాధారణంగా తిప్పడానికంటే కూడా చాలా కష్టంగా ఉంటే కూడా మీరు టెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ స్థితిలో స్టీరింగ్ వీల్ విఫలం అయ్యిందని భావించాలి. అంతే కాకుండా ఇలాంటి సమయంలో స్టీరింగ్ మాత్రమే కాకుండా కారు యొక్క చక్రాలలో గాలి ఉందా లేదా అని కూడా టెస్ట్ చేసుకోవాలి. గాలి సరిగ్గా ఉందని నిర్దారించ్చుకున్న తరువాత తప్పకుండా స్టీరింగ్ వీల్ సరి చేసుకోవాలి.

Most Read Articles

Read more on: #టిప్స్ #tips
English summary
Signs of steering failure in cars details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X