Just In
- 8 hrs ago
మహీంద్రా కార్స్‌పై అదిరిపోయే ఆఫర్స్ ; ఏ కార్‌పై ఎంతో చూసెయ్యండి
- 19 hrs ago
బిఎండబ్ల్యు ఎమ్340ఐ ఎక్స్‌డ్రైవ్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఫీచర్స్ & పర్ఫామెన్స్
- 21 hrs ago
డ్యుకాటి మోన్స్టర్ ఉత్పత్తి ప్రారంభం; త్వరలో భారత మార్కెట్లో విడుదల!
- 22 hrs ago
భారత్‌లో టి-రోక్ కారుని రీలాంచ్ చేయనున్న ఫోక్స్‌వ్యాగన్; ఈసారి ధర ఎక్కువే..
Don't Miss
- News
బీజేపీలోకి మెగాస్టార్ మిథున్ చక్రవర్తి -ప్రధాని మోదీ తొలి సభలోనే సంచలనం -బెంగాల్ సీఎం అభ్యర్థి?
- Movies
బీజేపీలో చేరిన డిస్కో డ్యాన్సర్.. ప్రధాని మోదీతో మిథున్ చక్రవర్తి కలిసి..
- Sports
ఐపీఎల్ 2021 షెడ్యూల్ వచ్చేసింది.. వేదికల్లో హైదరాబాద్‌కు దక్కని చోటు !
- Finance
ట్విట్టర్ సీఈవో 15 ఏళ్ల క్రితం తొలి ట్వీట్‌కు రూ.కోట్లు
- Lifestyle
ఈ వారం మీ జాతకం ఎలా ఉందో ఇప్పుడే చూసెయ్యండి... మీ లైఫ్ కు సరికొత్త బాటలు వేసుకోండి...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
కారు ఎక్కువ కాలం ఉపయోగించాలనుకుంటున్నారా.. అయితే ఈ టిప్స్ తప్పక పాటించాలి
సాధారణంగా కారు యొక్క సగటు జీవితం 12 నుంచి 15 సంవత్సరాల వరకు ఉంటుంది . ఇది కూడా కారు నడిపే విధానాన్ని బట్టి దీని జీవిత కలం ఉంటుంది. కొన్ని కార్లు 12 నుంచి 15 సంవత్సరాలు మాత్రమే కాకుండా ఇంకా ఎక్కువ కాలం చాలా అనుకూలంగా ఉంటాయి. కొన్ని కార్లు నియమిత సమయంలోనే పనికి రాకుండా పోతాయి. కార్లను సకాలంలో మంచి నిర్వహణ చేయకపోతే అవి పనిచేయకపోవడం ప్రారంభిస్తాయి.

తరువాత కాలంలో వాటిని బాగు చేయించుకోవాలంటే ఇంకా ఎక్కువ ఖర్చు అవుతుంది. కావున వాడే వాహనాలను సరైన సమయంలో రిపేర్ చేయడం మంచిది. అప్పుడే కార్లు ఎక్కువ కాలం వాహనదారునికి మన్నికగా ఉంటాయి. కార్లను ఏవిధంగా నిర్వహిస్తే ఎక్కువ కాలం ఉంటాయో ఇక్కడ తెలుసుకుందాం..

1. నిర్వహణను విస్మరించడం :
కారు త్వరగా క్షీణించటానికి మొదటి కారణం సరైన నిర్వహణ లేకవడం. చాలా మంది కారు డ్రైవర్లు నిర్వహణను వాయిదా వేసే అలవాటు ఉంది. సమయానికి సర్వీస్ చేయకపోతే వాహనంలోని ఇంజిన్, బ్రేక్‌లు మరియు బ్యాటరీలు క్షీణించే అవకాశం ఉంటుంది. కావున సరైన సమయంలో వాటిని సర్వీస్ చేయడం చాలా ముఖ్యం.

2. ఆయిల్ లైట్ వార్ణింగ్ ను విస్మరించడం:
చాలా సార్లు, కారు యొక్క ఇంజిన్ పనిచేయకపోవడం వల్ల, కార్ ఆయిల్ వార్ణింగ్ సిగ్నెల్ ఇవ్వడం ప్రారంభిస్తుంది. దీనికి ప్రధాన కారణం కారులో ఇంజన్ ఆయిల్ లేకపోవడం. కారు ఆయిల్ సిగ్నల్ ఇస్తే, ప్రారంభించే ముందు కారులోని ఇంజిన్ ఆయిల్ లెవెల్ ఒకసారి చెక్ చేసుకోవాలి. అప్పుడే ఇంజిన్ ఎక్కువకాలం పనిచేస్తుంది.

3. తక్కువ ఇంధనం ఉన్నప్పుడు డ్రైవింగ్ :
ఇటీవల కాలంలో విడుదలైన కార్లలో ఫ్యూయెల్ ఇంజెక్ట్ టెక్నాలజీ ఉంది. ఇంధన ట్యాంకు ఇంధన ఇంజెక్టర్ నుండి ఇంజిన్‌కు ఇంధనాన్ని సరఫరా చేయడానికి తగినంత ఇంధనం అవసరం. ఫ్యూయెల్ ఇంజెక్ట్ చేసిన వాహనాల్లో, ఇంధనం ఉండవలసిన స్థాయికంటే కంటే తక్కువగా ఉంటే కారు నడపకూడదని సలహా ఇస్తారు. ఇంధనం తక్కువగా ఉన్నప్పుడు కారు నడుపుతున్నప్పుడు, ఇంజిన్ దెబ్బతినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కారు నడుపుతున్నప్పుడు, 1/4 ఇంధనాన్ని ట్యాంక్‌లో ఉంచడం మంచిది.
MOST READ:ఘన విజయం సాధించిన ఇండియన్ క్రికెట్ టీమ్‌కి ఆనంద్ మహీంద్రా స్పెషల్ గిఫ్ట్.. ఏంటో తెలుసా..!

4. కారులో సరికాని రీఫ్యూయలింగ్ :
కొన్నిసార్లు నిర్లక్ష్యంగా కారుకి తప్పు ఇంధనాన్ని చొప్పించే అవకాశం ఉంది. రీఫ్యూయలింగ్ లోపం కారణంగా, తప్పు ఇంధనం కారు ట్యాంక్‌లోకి వెళుతుంది. తప్పు ఇంధనంతో కారు నడపడం ఇంజిన్ పైకప్పును దెబ్బతీస్తుంది. ఇది కారు ఇంజిన్‌ను దెబ్బతీస్తుంది. ఈ సమస్యను నివారించడానికి ఇంధనం నింపేటప్పుడు జాగ్రత్త వహించడం మంచిది. కారు ఫ్యూయల్ లిడ్ పై పెట్రోల్ లేదా డీజిల్ స్టిక్కర్‌ను అంటించుకోవడం మంచిది.

5. కారు తుప్పు పట్టకుండా రక్షించండి :
ఏ కంపెనీకి చెందినద కారైనా తుప్పు పడుతుంది. కారుని వినియోగించకుండా అలాగే ఉంచేసినప్పుడు వానకు తడిసి, ఎండకు ఎండి క్రమక్రమంగా తుప్పు పట్టడం ప్రారంభమవుతుంది. వాహనాలకు తుప్పు పట్టకుండా ఉండాలంటే ప్రతిరోజు శుభ్రం చేస్తూ ఉండాలి.
MOST READ:బైడెన్ ఉపయోగించే 'మృగం' లాంటి కారు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు

కారులో దుమ్ము ఉంటే, వెంటనే శుభ్రం చేయండి. కారు పైభాగాన్ని మరియు దిగువ భాగాన్ని నీరు లేదా డ్రై వాష్‌తో పూర్తిగా శుభ్రం చేయడం మంచిది. కారు యొక్క భాగాలు బాగా పనిచేసేలా కందెన వాడటం మంచిది. ఈ విధంగా చేసినప్పుడే కార్లు ఎక్కువ కాలం ఉపయోగించడానికి అనుకూలంగా ఉంటాయి.