దారిలో మీ ఎలక్ట్రిక్ స్కూటర్ ఛార్జింగ్ అయిపోయిందా.. భయపడకండి.. మేము చెప్పినట్లు చేస్తే రయ్ రయ్ మంటూ వెళ్లవచ్చు
సాధారణంగా బైక్ లేదా స్కూటర్‌లో పెట్రోలు అయిపోతే దగ్గరలో పెట్రోల్ బంక్ ఉంటే అక్కడికి తీసుకువెళ్లడం లేదా బాటిల్‌లో పెట్రోల్ తీసుకెళ్లి నింపడం చేస్తుంటారు. కానీ ఎలక్ట్రిక్ స్కూటర్లకు మార్గమధ్యలో ఛార్జింగ్ అయిపోతే ఏం చేయాలి.? ఆ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో ఆ చిట్కాలు ఇక్కడ మీకోసం..
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు భారీగా క్రేజ్ ఉన్నా.. చాలా మంది కొనుగోలు చేయడానికి వెనుకాడతారు. ఎందుకంటే ముఖ్యంగా మార్గమధ్యలో ఛార్జింగ్ అయిపోతే దగ్గర్లో ఛార్జింగ్ స్టేషన్ లేకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ సమయంలో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఛార్జింగ్ పాయింట్‌కి తీసుకెళ్లినా అది ఛార్జ్ కావడానికి చాలా సమయం పడుతుంది. అప్పటివరకూ ఎదురుచూడాల్సి వస్తుంది.

ఎలక్ట్రిక్ స్కూటర్లకు ప్రస్తుతం దేశంలో అన్ని చోట్లా ఛార్జింగ్ స్టేషన్లు లేవు. పట్టణాల్లో ఛార్జింగ్ స్టేషన్లు ఉన్నాయి. అక్కడ మీ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఛార్జ్ చేసుకోవచ్చు. లేదా ఇంట్లో ఛార్జింగ్ చేసుకునే సౌకర్యం ఉంది. మీరు మీ వాహనాన్ని ఛార్జింగ్ స్టేషన్‌కు తీసుకెళ్లి ఛార్జ్ చేయవచ్చు. మార్గమధ్యలో అకస్మాత్తుగా ఛార్జింగ్ అయిపోతే ఆందోళన చెందకుండా ఈ చిట్కాలు పాటించండి.
బ్యాటరీ మార్పిడి : ఇప్పుడు చాలా ఎలక్ట్రిక్ కంపెనీలు బ్యాటరీ మార్పిడి సాంకేతికతతో ఎలక్ట్రిక్ స్కూటర్లను ప్రవేశపెట్టాయి. ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. రెండు బ్యాటరీలను వెంటపెట్టుకోవడం ద్వారా స్కూటర్‌లో బ్యాటరీ అయిపోతే ఛార్జింగ్ స్టేషన్‌లకు వెళ్లి మరో బ్యాటరీని మార్చుకుని ప్రయాణం కొనసాగించవచ్చు.

కాబట్టి మీ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో రీప్లేస్ చేయగల బ్యాటరీ ఉంటే, మీరు ఇంటికి వెళ్లాల్సిన అవసరం లేదు. మీరు నేరుగా మీ సమీపంలోని బ్యాటరీ మార్పిడి స్టేషన్‌కి వెళ్లి, నిమిషాల్లో ఛార్జ్ అయ్యే బ్యాటరీని మార్చుకోవచ్చు. ఇది చాలా ఉపయోగకరమైన చిట్కా.
మీ ఎలక్ట్రిక్ స్కూటర్ అనుకోని పరిస్థితుల్లో ఛార్జ్ అయిపోతే, మీరు దానిని మీకు దగ్గరలో తెలిసిన వారి ఇళ్లకు తీసుకుని వెళ్లండి. అక్కడ ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఈ రెండు ఎంపికలు అందుబాటులో లేకుంటే, స్థానికులను అభ్యర్థించి.. అక్కడ మీ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు ఛార్జింగ్ చేసుకోండి.
రోడ్ సైడ్ అసిస్ట్: మీ స్కూటర్ ఛార్జ్ అయిపోయిన మరియు మీరు ఇంటికి చేరుకోలేని పరిస్థితిలో మీ చివరి మరియు ఉత్తమ ఎంపిక రోడ్ సైడ్ అసిస్ట్. ఆన్‌లైన్ రోడ్ సైడ్ అసిస్ట్ సదుపాయాన్ని అందించే అనేక వెబ్‌సైట్‌లు ఉన్నాయి. మీరు మీ లొకేషన్‌ను షేర్ చేసి మీ వాహనాన్ని సులభంగా మీ ఇంటికి తీసుకెళ్లవచ్చు.
దేశంలో ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు నెమ్మదిగా పెరుగుతోంది. అయితే ఈవీ యజమానులు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాహనాలను వినియోగించుకునేందుకు ఛార్జింగ్ స్టేషన్ సౌకర్యాలు కల్పించేందుకు ఇంకా చాలా సంవత్సరాలు పడుతుంది. అప్పటి వరకు ఎలక్ట్రిక్ స్కూటర్ యజమానులకు పైన పేర్కొన్న చిట్కాలు పాటించడం చాలా ఉత్తమం.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్ కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








