కొత్త కారు కొంటున్నారా? ఒక్క నిమిషం ఆగండి! - ఇవి తెలుసుకోండి..
కొత్త కారు కొనాలని అందరికీ ఉంటుంది, కానీ ఎలాంటి కారు కొనాలి? కొనే ముందు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఏంటి? అనే వివరాలు తెలియకుండా అప్పుడప్పుడు కొంత సతమతమవుతుంటారు. అలాంటి కన్‌ఫ్యూజ్‌లో ఉన్న వారి కోసం ప్రత్యేకంగా ఈ కథనం ఉపయోగపడుతుంది.
కాలం మారుతోంది.. టెక్నాలజీ పెరుగుతోంది, కాలినడకన వెళ్లే మానవుడు అంతరిక్ష యాత్రలు కూడా అవలీలగా ముగించేస్తున్నారు. ఇలాంటి తరుణంలో ప్రతి ఒక్కరూ సొంతగా కారుకొనాలని ఆలోచిస్తుంటారు. అయితే మార్కెట్లో లెక్కకు మించిన కార్లు అందుబాటులో ఉండటంతో ఏ కారు కొనాలి? కొనేముంది ఎలాంటి విషయాలు తెలుసుకోవాలి? విక్రయదారుడు ఏమైనా మోసం చేస్తాడా అని ఎన్నో సందేహాలు ఉంటాయి. అలాంటి వారి కారు కొనడానికి ముందు ఈ కింది విషయాలను తెలుసుకోవాలి.

బడ్జెట్
ఒక వ్యక్తి కారు కొనాలంటే ముందుగా తన వద్ద ఎంత బడ్జెట్ ఉంది, ఆ ధరలు ఏ కారు అందుబాటులో ఉందనేది తప్పకుండా తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ రోజు మార్కెట్లో రూ.5 లక్షలు కార్లు ఉన్నాయి, రూ.5 కోట్ల కార్లు ఉన్నాయి. కాబట్టి మనదగ్గర ఉన్న డబ్బుకు తగిన కారు గురించి ముందుగా ఒకసారి తెలుసుకోవాల్సి ఉంటుంది. కారు కొన్న తరువాత మెయింటెనెన్స్ కూడా తోడవుతుంది. ఇవన్నీ బేరీజు వేసుకోవాలి.
అవసరం
కారు కొనాలనే ముందు ఎందుకు కొనాలనుకుంటున్నారు? అనే ప్రశ్న వేసుకోవాలి. అంటే కొనే కారు రోజు వారీ వినియోగానికి, కమర్షియల్ వినియోగానికా.. లేక కుటుంబ అవసరాల కోసమా? ఇలా ప్రశ్నించుకున్న తరువాత, కారు కొనుగోలు చేయడానికి ముందడుగు వేయాలి. ఎందుకంటే దేశీయ మార్కెట్లో లెక్కకు మించిన కార్లు అందుబాటులో ఉన్నాయి, అందులో మీ అవసరాలకు తగిన కారును సెలెక్ట్ చేసుకోవడం కూడా చాలా ముఖ్యం.

రీసర్చ్
రీసర్చ్ అనగానే గాబరాపడిపోకండి. ప్రస్తుతం మార్కెట్లో ఏ మోడల్స్ ఉన్నాయనే విషయం తెలుసుకోండి. మీ దగ్గరున్న డబ్బుకు తగిన మోడల్ ఎంపిక చేసుకోవడం మాత్రమే కాకుండా.. ఆ కారులో ఎలాంటి లేటెస్ట్ ఫీచర్స్ ఉన్నాయి, అవి ఎంత వరకు మనకు ఉపయోగపడతాయనే విషయాలు క్షుణ్ణంగా తెలుసుకోండి. ఎందుకంటే అనవసరమైన ఫీచర్స్ వల్ల ధర పెరుగుతుంది, కానీ ఉపయోగం ఉండదు. దీని కోసం మీరు కొంత రీసర్చ్ చేసుకోవాలి.
టెస్ట్ డ్రైవ్
కారు కొనే దదాపు టెస్ట్ డ్రైవ్ చేస్తారు. అయితే ఒక కారుని ఒక్క సారి టెస్ట్ డ్రైవ్ చేసి దానిని అర్థం చేసుకోవడం చాలా కష్టం. కాబట్టి మీరు కారు గురించి అవగాహన చేసుకోవడానికి రెండు, మూడు సార్లైనా టెస్ట్ డ్రైవ్ తీసుకోవడానికి ఏ మాత్రం మొహమాటపడాల్సిన అవసరం లేదు. కొన్ని షో-రూమ్స్ మీకు మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ డ్రైవ్స్ అందించడానికి వెనకాడవు. కాబట్టి ఈ అవకాశాన్ని కస్టమర్ ఉపయోగించుకోవచ్చు.

ఎంచుకునే మోడల్
నిజానికి డీలర్ వద్ద మీకు కనిపించే డెమో మోడల్స్ అన్నీ కూడా టాప్ స్పెక్ మోడల్స్, వాటిని టెస్ట్-డ్రైవ్ చేసి అలంటి ఫీచర్స్ అన్నీ కూడా బేస్ మోడల్స్‌లో ఉంటాయనుకుకోవడం పొరపాటే. కాబట్టి మీరు ఏ వేరియంట్ లేదా ఏ స్పెక్ ఎంచుకుంటున్నారు, అందులో ఏ ఫీచర్స్ ఉన్నాయి అనే విషయాలను ముందుగానే తప్పకుండా తెలుసుకోవాలి. డెమో మోడల్స్ అప్పుడప్పుడు అదనపు యాక్ససరీస్ కూడా కలిగి ఉండే అవకాశం ఉంటుంది.
చర్చలు
ఇక్కడ చర్చలు అనగానే బేరసారాల కోసం చేసే ప్రయత్నం అని గుర్తుంచుకోవాలి. కారు కొనే ముందు దానిపై కొంత తగ్గింపు కావాలని ఆశించినప్పుడు డీలర్‌షిప్ వద్ద చర్చలు జరపాల్సి ఉంటుంది. ఈ చర్చల ఫలితంగానే అప్పటికి ఉన్న ఆఫర్స్, రాబోయే రోజుల్లో ఏమైనా ఆఫర్స్ వస్తాయా? అనే చాలా విషయాలు తెలుస్తాయి. ఇది కాకుండా అప్పటికే స్టాక్‌లో ఉన్న మోడల్స్ ఎంచుకోవడం వల్ల మీరు కొంత మేర తగ్గింపును పొందవచ్చు.


Click it and Unblock the Notifications








