‘డిజిలాకర్‌'లో డ్రైవింగ్‌ లైసెన్స్‌, RC.. ఈ సింపుల్‌ స్టెప్స్‌ ద్వారా లింక్‌ చేసుకోండి.!!

మీ డ్రైవింగ్ లైసెన్స్‌ను డిజిలాకర్(Digilocker) అనే ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌తో లింక్‌ చేసుకోవచ్చని మీకు తెలుసా.. ఆధార్ కార్డ్ ఉన్నవారు వారి గుర్తింపు పత్రాల సాఫ్ట్ కాపీలను సేవ్‌ చేసుకోవడం లేదా షేర్‌ చేసుకునే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ యాప్‌లో మీ డ్రైవింగ్ లైసెన్స్‌ను కూడా భద్రపరుచుకోవచ్చు. పూర్తి సమాచారం ఈ కథనంలో..

వాహనం నడపాలంటే డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఆర్‌సీ ఇంకా సంబంధిత డాక్యమెంట్లు తప్పనిసరి. లేదంటే ట్రాఫిక్‌ పోలీసుల నుంచి జరిమానా తప్పదు. అందుకే వాహనదారులు, డ్రైవర్లు వీటిని తమ వ్యాలెట్‌లో భద్రపరుచుకుంటారు. కానీ బయటకు వెళ్లినప్పుడు ఒక్కోసారి వ్యాలెట్‌ మర్చిపోతుంటారు. ఈ క్రమంలో పోలీసులకు చిక్కారంటే ఫైన్‌ కట్టాల్సిందే..

Digilocker-Driving-License

అందుకే ఈ సమస్య తలెత్తకుండా మీ స్మార్ట్‌ఫోన్‌లో సంబంధిత డాక్యుమెంట్లను సేవ్‌ చేసుకోవచ్చు. దీని ద్వారా మీరు డ్రైవింగ్‌ లైసెన్స్‌, RC మర్చిపోయినా లేదా పోగొట్టుకున్నా.. డిజిటల్‌గా సేవ్‌ చేసుకుంటే మీకు మున్ముందు ఏ సమస్య ఉండదు. ఆధార్ కార్డ్ ఉన్న పౌరులు మాత్రమే డిజిలాకర్‌ని యాక్సెస్ చేయవచ్చు. అయితే మరి డిజిలాకర్‌ యాప్‌లో వీటిని ఎలా అప్‌లోడ్‌ చేయాలంటే..

డ్రైవింగ్‌ లైసెన్స్‌ను లింక్‌ చేసుకోవడం ఎలా: మొదటగా మీరు DigiLocker వెబ్‌సైట్ లేదా యాప్‌ని సందర్శించాలి. మీరు రిజిస్టర్డ్ సభ్యులు కాకపోతే రిజిస్టర్‌ చేసుకోవడం కోసం "Sign Up" పై క్లిక్‌ చేయాలి. కాగా ఇప్పటికే ఉన్న ఖాతాదారులు తమ ఆధారాలతో యాప్‌లోకి లాగిన్ చేయవచ్చు. లాగిన్‌ అయిన తర్వాత 'Issued Documents' విభాగంలో "Get More Issued Documents" ఎంచుకోవాలి. ఇక్కడ "Pull Documents"పై క్లిక్ చేయాలి.

Digilocker-Driving-License

ఆ తర్వాత "Central Government" విభాగంలో "Ministry of Road Transport and Highways" ను సెలెక్ట్‌ చేసుకోవాలి. ఇందులో "Document type" కింద "Driving Licence"ను సెలెక్ట్‌ చేసుకోవాలి. ఇందులో మీ పేరు, పుట్టిన తేదీ, డ్రైవింగ్ లైసెన్స్ నంబర్ వంటి సంబంధిత వివరాలను నమోదు చేయాలి. ఆ తర్వాత 'Get Document' పై క్లిక్‌ చేయాలి.

అనంతరం డిజిలాకర్‌(Digilocker) యాప్‌ సిస్టమ్ మీ డాక్యుమెంట్‌ను ఆటోమేటిక్‌గా అప్‌లోడ్ చేస్తుంది. అవసరమైన సందర్భాల్లో మీరు దీనిని యాక్సెస్‌ చేసుకోవచ్చు. దీనిని మీరు డౌన్‌లోడ్‌ చేసుకోవాలి అనుకున్నప్పుడు మీ ఆధారాలతో సైన్‌ ఇన్‌ చేసి పైన ఎడమ వైపు 'Issue Documents' సెలెక్ట్ చేయాలి. డాక్యుమెంట్‌ ఓపెన్‌ అయిన తర్వాత డౌన్‌లోడ్‌ కోసం PDF పై క్లిక్‌ చేయాలి.

Digilocker-Driving-License

డ్రైవింగ్‌ లైసెన్స్‌ అప్‌లోడ్‌ చేసుకోవడం ఎలా: కేవలం లింక్‌ చేసుకోవడం మాత్రమే కాకుండా మీరు RC తో పాటు మీ వాహనానికి సంబంధించి డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఇతర సర్టిఫికెట్లను కూడా అప్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఇందుకోసం Digilocker అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి.. వినియోగదారు పేరు మరియు పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత "Uploaded Documents" ఎంచుకోవాలి.

వినియోగదారు పేరు, పాస్‌వర్డ్‌ని క్రియేట్‌ చేయడానికి మొదటగా OTPని నమోదు చేయాలి. ఆ తర్వాత, నాలుగు-అంకెల MPINని ఎంటర్‌ చేయాలి. ఈ నంబర్‌ను మున్ముందు అవసరాల కోసం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు, మీ ఆధార్ కార్డ్‌ని డిజిలాకర్ ఖాతాతో లింక్ చేయాలి. ఆ తర్వాత మీ డ్రైవింగ్ లైసెన్స్, RC స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలి.

Digilocker-Driving-License

అనంతరం "Pull Partner's Document" విభాగానికి వెళ్లి.. మీ ప్రస్తుత డ్రైవింగ్ లైసెన్స్ నంబర్‌తో సహా సంబంధింత వివరాలను నమోదు చేయాలి. లింక్ ముగిసిన తర్వాత, మీ అవసరానికి అనుగుణంగా "Documents" లేదా "My Certificates" సెలెక్ట్ చేసుకోవాలి. "Upload"పై క్లిక్ చేసి, మీరు అప్‌లోడ్ చేయాలనుకుంటున్న పత్రాన్ని ఎంచుకోవాలి. డాక్యుమెంట్ ఫార్మాట్‌ని ఎంచుకుని, దాన్ని సేవ్ చేయాలి.

ఇలా చేయడం ద్వారా మీ వాహనానికి సంబంధించిన డాక్యుమెంట్స్‌ అన్నీ డిజిటల్‌ రూపంలో భద్రంగా ఉంటాయి. ట్రాఫిక్‌ పోలీసులు ఆపిన సందర్భాల్లో సంబంధిత డాక్యుమెంట్లు మీ వద్ద లేకపోయినా డిజిలాకర్‌ యాప్‌ ఓపెన్‌ చేసి మీరు డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఇతర సంబంధింత డాక్యుమెంట్స్‌ను చూపించవచ్చు.

More from DriveSpark

Article Published On: Tuesday, December 12, 2023, 8:15 [IST]
English summary
Steps to link driving license rc and other relevant documents with digilocker
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+