సమ్మర్ రోడ్ ట్రిప్‌లో ఖచ్చితంగా పాటించాల్సిన చిట్కాలు

By Anil Kumar

ప్రతి ఏడాదిలో మార్చి, ఏప్రిల్ మరియు మే నెలలో సమ్మర్ ట్రిప్‌లు ప్లాన్ చేస్తుంటారు. భగభగమండే ఎండలు, ఉక్కపోతతో కూడిన వాతారణం మరియు వేడి గాలులు ఎక్కువగా ఉన్నప్పటికీ ఈ మూడు మాసాల్లో సెలవు రోజులు ఉండటంతో సమ్మర్‌లోనే లాంగ్ డ్రైవ్ మరియు రోడ్ ట్రిప్ వెళ్లాలనుకుంటారు.

సరదా మరియు సందడితో పాటు విపరీతమైన ఎండలు మీ ప్రయాణానికి పలు అంశాల పరంగా ఆటంకం కలిగించవచ్చు. కాబట్టి, సురక్షితమైన సమ్మర్ రోడ్ ట్రిప్‌లో ఖచ్చితంగా పాటించాల్సిన కొన్ని టిప్స్ మరియు ట్రిక్స్ ఇవాళ్టి కథనంలో చూద్దాం రండి...

సమ్మర్ రోడ్ ట్రిప్‌లో ఖచ్చితంగా పాటించాల్సిన చిట్కాలు

9. మెళుకువతో ఉండండి

వేసవి కాలంలో డ్రైవింగ్ చేస్తున్నపుడు ఖచ్చితంగా మెళుకువలో ఉండాల్సిందే. కొన్ని అధ్యయనాల ప్రకారం, పరిసర ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా ఉంటే డ్రైవర్ చురుకుదనాన్ని కోల్పోయి నిద్రమబ్బులోకి వెళ్లడానికి కారణమవుతుంది.

సమ్మర్ రోడ్ ట్రిప్‌లో ఖచ్చితంగా పాటించాల్సిన చిట్కాలు

కారులో 21 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నపుడు డ్రైవర్ స్పందనతో పోల్చుకుంటే 27 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద 22 శాతం వరకు నెమ్మదిగా ప్రవర్తిస్తాడని తేలింది. కాబట్టి, కారులో డ్రైవర్‌తో సహా అందరూ చురుకుగా మరియు చల్లటి వాతావరణంతో ఉండాలంటే 22 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను మెయింటెన్ చేసుకోండి.

సమ్మర్ రోడ్ ట్రిప్‌లో ఖచ్చితంగా పాటించాల్సిన చిట్కాలు

8. ఏ/సి ఆన్‌లో ఉంచడమే మంచిది

ఎత్తైన మరియు ప్రదేశాలు, కొండలు మరియు పర్వత శ్రేణుల్లోని ఘాట్ సెక్షన్‌లలో ప్రయాణిస్తున్నపుడు బాహ్య వాతావరణం భారీగా తగ్గిపోతుంది. దీంతో ముందు మరియు వెనుక వైపునున్న అద్దాల మీద కంటికి కనిపించని నీటిబిందువులు ఏర్పడతాయి. దీంతో రోడ్డును స్పష్టంగా చూడలేకపోతాము.

సమ్మర్ రోడ్ ట్రిప్‌లో ఖచ్చితంగా పాటించాల్సిన చిట్కాలు

7. క్యాబిన్‌లో గాలిని శుభ్రంగా ఉంచుకోండి

గాలిలో ఉన్న మలినాలను మరియు దుమ్ముధూలి కణాలను కారులో ఉన్న ఏలి 88 శాతం వరకు శుభ్రపరిచి క్యాబిన్‌లోకి అందిస్తుంది. తలనొప్పి మరియు తల తిరగడాన్ని నివారించడానికి పరిశుభ్రమైన గాలి అవసరం కాబట్టి, కారులో ప్రయాణిస్తున్నంతసేపు ఏసి ఆన్‌లోనే ఉంచుకోండి.

సమ్మర్ రోడ్ ట్రిప్‌లో ఖచ్చితంగా పాటించాల్సిన చిట్కాలు

6. చిన్న విరామం తీసుకోండి

సుదూర గమ్యాలను చేరుకోవడానికి విరామం లేకుండా ప్రయాణించడానికి చాలా మంది ఆసక్తి చూపుతారు. కానీ, విరామం లేకుండా డ్రైవ్ చేయడం వలన డ్రైవర్ అలసటకు గురవుతారు. ఈ కారణంగా జరిగే ప్రమాదాల సంఖ్య అధికంగానే ఉంది. కారులో 22 డిగ్రీల ఉష్ణోగ్రతను ఉండేలా ఏసి ఆన్ చేసుకుని ప్రతి రెండు గంటలకు ఓ ఐదు లేదా పది నిమిషాల పాటు విరామం తీసుకోండి.

సమ్మర్ రోడ్ ట్రిప్‌లో ఖచ్చితంగా పాటించాల్సిన చిట్కాలు

5. చిన్నపాటి వ్యాయమాలు

విరామం తీసుకోవడానికి ఆగినపుడు, వెహికల్‌ను సురక్షితమైన ప్రదేశంలో పార్క్ చేసి, కాళ్లు మరియు చేతులకు రక్త ప్రసరణ కలిగేలా కాళ్లు మరియు చేతులు చాచి చిన్న పాటి వ్యాయామం చేయడం ఎంతో ఉత్తమం. ఇలా చేయడంతో యాక్టివ్‌గా ఉంటారు.

సమ్మర్ రోడ్ ట్రిప్‌లో ఖచ్చితంగా పాటించాల్సిన చిట్కాలు

4. మితిమీరిన వేగం వద్దు

లాంగ్ డ్రైవ్ వెళ్లేవారు, వెంటనే గమ్యాన్ని చేరుకోవడానికి అధిక వేగంతో ప్రయాణిస్తారు. ఇండియన్ రోడ్ల మీద అడుగడుగునా అవాంతరాలే ఎదురవుతుంటారు. పరిమిత వేగం కంటే అధిక వేగంతో ప్రయాణిస్తున్నపుడు అనుకోని అవాంతరాలు ఎదురైతే స్పందించే సమయం కూడా ఉండదు. గంటకు 120కిమీలతో కాకుండా 150కిమీల వేగంతో ప్రయాణిస్తే 120కిమీల ప్రయాణంలో 10 నిమిషాలు మాత్రమే మిగులుతాయి. కానీ ప్రాణం పది నిమిషాల కంటే విలువైనదని గుర్తించండి.

సమ్మర్ రోడ్ ట్రిప్‌లో ఖచ్చితంగా పాటించాల్సిన చిట్కాలు

3. రహదారి నియమాలను పాటించండి

ఇండియాలో అన్ని రోడ్ల మీద రోడ్డు భద్రత నియమాలు మరియు నిభందనలు ఖచ్చితంగా పాటించండి. రెండు రాష్ట్రాల సరిహద్దులు దాటుతున్నపుడు, స్పీడ్ లిమిట్ సేఫ్టీ రూల్స్ ఖచ్చితంగా పాటించండి.

సమ్మర్ రోడ్ ట్రిప్‌లో ఖచ్చితంగా పాటించాల్సిన చిట్కాలు

2. డ్రైవింగ్‌లో సెల్ ఫోన్ వద్దు

ప్రయాణంలో ఉన్నపుడు వచ్చిన కాల్ ముఖ్యమైనదైతే, తప్పనిసరిగా మాట్లాడాల్సి వస్తే, సీట్ బెల్ట్ ధరించి రోడ్డు ప్రక్కన కారును నిలిపి మాట్లాడండి. లేదంటే బ్లూటూత్ కనెక్టివి ద్వారా కార్లలో వస్తున్న హ్యాండ్స్ ఫ్రీ కాలింగ్ ఫీచర్ ఉపయోగించండి.

సమ్మర్ రోడ్ ట్రిప్‌లో ఖచ్చితంగా పాటించాల్సిన చిట్కాలు

1. మద్యానికి దూరంగా ఉండండి

జాతీయ రహదారుల మీద రోడ్డు ప్రమాదాలు మరియు మరణాలకు మద్యం సేవించి వాహనం నడపడం ప్రధాన కారణం. మద్యం మత్తులో ఉన్నపుడు అస్సలు వాహనాన్ని నడపకండి. మీ స్నేహితునికి లేదా ఇతరులకు కారు తాళాలు ఇవ్వడం మంచింది.

ఈ స్టోరీలోని సమ్మర్ కార్ సేఫ్టీ టిప్స్ ఫాలో చేసి సురక్షితంగా డ్రైవ్ చేయండి. మీ తోటి స్నేహితులకు కూడా ఈ చిట్కాలను అందించి వేసవి కాలంలో సురక్షితమైన డ్రైవ్ గురించి మోటివేట్ చేయండి.

మీకు తెలిసిన సమ్మర్ కార్ డ్రైవింగ్ టిప్స్ ఉంటే క్రింది కామెంట్ బాక్స్ ద్వారా మాతో పంచుకోండి....

సమ్మర్ రోడ్ ట్రిప్‌లో ఖచ్చితంగా పాటించాల్సిన చిట్కాలు

ఎక్కువ మంది చదువుతున్న స్టోరీలు...

1. కారులో ఏ/సి ఎఫెక్టివ్‌గా పనిచేయాలంటే ?కారులో ఏ/సి ఎఫెక్టివ్‌గా పనిచేయాలంటే ?

2. ఎయిర్‌బ్యాగ్స్: ఎలా పనిచేస్తాయి, ఎన్ని రకాలు, చరిత్ర

3.ఏ/సి వాడకం కారు మైలేజ్ మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది?

4.ఏబిఎస్ అంటే ఏమిటి ? ఎలా పని చేస్తుంది ?

5.ట్రాఫిక్ పోలీసులు ఆపినపుడు ఏం చేయాలి, ఎలా వ్యవహరించాలి ?

Most Read Articles

English summary
Read In Telugu: 9 summer driving safety tips when driving a car in india
Story first published: Friday, March 23, 2018, 17:46 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X