కారులో ఏ/సి ఎఫెక్టివ్‌గా పనిచేయాలంటే ఇలా చేయండి!!

భారత్‌లో ప్రతి ఏటా వేసవి కాలం అధికంగానే ఉంటుంది. వేసవి కాలం కాకపోయినా వాతావరణంలో జరిగే మార్పులకు ఉష్ణోగ్రత ఒక్కోసారి గరిష్ట స్థాయిని చేరుతుంటుంది. ఇలాంటి సందర్భాల్లో కారులో ప్రతి ఒక్కరూ ఏ/సి మీదనే ఆధారపడుతుంటారు.

అయితే, వేసవి కాలంలో కారులోని ఏ/సి ఏఫెక్టివ్‌గా పనిచేయాలంటే ఏం చేయాలి...? డ్రైవ్‌స్పార్క్ తెలుగు పాఠకుల కోసం ఇవాళ్టి స్టోరీలో కొన్ని టిప్స్ అందిస్తోంది....

కారులో ఏ/సి ఎఫెక్టివ్‌గా పనిచేయాలంటే ?

నీడలో పార్కింగ్ చేయడం:

మీ కారును చల్లగా ఉంచాలంటే నీడ ప్రదేశంలో పార్క్ చేయడం అతి ప్రధానమైన చిట్కా. చెట్టు క్రింద లేదా సెల్లార్‍‌లో పార్క్ చేయడం ద్వారా కారును చల్లగా ఉంచుకోవచ్చు. ఇలా చేయడంతో డ్రైవింగ్ స్టార్ట్ చేశాక ఏ/సి మీద తక్కువ లోడ్ పడుతుంది.

Recommended Video - Watch Now!
Toyota Etios Safety Experiential Drive in Bengaluru | In Telugu - DriveSpark తెలుగు
కారులో ఏ/సి ఎఫెక్టివ్‌గా పనిచేయాలంటే ?

విండ్ స్క్రీన్ రిఫ్లెక్టర్లు:

పాత కాలంలో ఎక్కువ మంది ఈ చిట్కాను పాటించేవారు. ముందు మరియు వెనుక అద్దాల మీద ఇలాంటి నల్లటి రిఫ్లెక్టర్లను అతికిస్తారు. ఈ అద్దాలు మిగతా వాటితో పోల్చితే చాలా విశాలంగా ఉంటాయి కాబట్టి ఎక్కువ వేడి వీటి మీదే పడుతుంది. సూర్యుడి నుండి వచ్చే ఎక్కువ వేడిమి ఇంటీరియర్‌లోకి వెళ్లకుండా ఈ రిఫ్లెక్టర్లు అడ్డుపడతాయి. దీంతో కారు స్టార్ట్ చేసే ముందు ఇంటీరియర్‌లో హీట్ అంతగా ఉండదు కాబట్టి ఏ/సి చక్కగా పనిచేస్తుంది.

కారులో ఏ/సి ఎఫెక్టివ్‌గా పనిచేయాలంటే ?

కారును పార్క్ చేసినపుడు మాత్రమే ఈ చిట్కాను పాటించండి:

కారు పార్క్ చేశాక చాలా మంది కారు అద్దాలన్నింటిని పూర్తిగా మూసేస్తారు. ఇది చాలా పొరబాటు. ఇలా చేయడంతో కారులో ఉన్న గాలి కొద్దిసేపటికి విపరీతంగా హీటెక్కుతుంది. అయితే అద్దాలన్నీ క్లోజ్ చేడంతో ఆ గాలి బయటకు వెళ్లదు. దీంతో వేడి మొత్తం కారు ఇంటీరియర్‌ను మరింత వేడిగా మార్చేస్తాయి.

అదే కొద్దిగా ఓపెన్ చేసి అద్దాలను మూయడంతో గాలి ప్రసరణ ఉంటుంది. దీంతో కారులో ఉన్న వేడిగాలి బయట వాతారణంలో కలిసిపోతుంది.

కారులో ఏ/సి ఎఫెక్టివ్‌గా పనిచేయాలంటే ?

ఏ/సి ఆన్ చేసే ముందు అద్దాలను పూర్తిగా క్రిందకు దించేయండి:

చాలా సేపు ఎండలో పార్క్ చేసిన తరువాత ప్రయాణాన్ని ప్రారంభించే ముందు దీనిని తప్పనిసరిగా పాటించండి. ఎక్కువ సేపు ఎండలో పార్క్ చేయడంతో ఇంటీరియర్ మొత్తం చాలా వేడిగా ఉంటుంది. వెంటనే డ్రైవింగ్ స్టార్ట్ చేసి ఏ/సి ఆన్ చేస్తే ఇంటీరియర్ మొత్తాన్ని కూల్ చేయడానికి ఏ/సి కి చాలా సమయం పడుతుంది.

కాబట్టి, ప్రయాణానికి ముందు అద్దాలను పూర్తిగా క్రిందకు దించేస్తే, బాహ్య వాతావరణంలో గాలిలో కారులోపలికి వెళ్లి అందులో గాలితో కలిసిపోతుంది. దీంతో ఇంటీరియర్ కాస్త చల్లబడుతుంది. ఇలా చేసిన తరువాత అద్దాలను పైకి ఎత్తేసి ఏ/సి ఆన్ చేయండి ఎంతో ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది.

Trending On DriveSpark Telugu:

మహీంద్రా & టాటా లకు మారుతి సుజుకి దిమ్మతిరిగే షాక్

బ్రేక్ ప్యాడ్స్ మార్చకపోతే ఏమవుతుంది...?

విదేశాల్లో నీరాజనాలు పడుతున్న ఆ కారుకు ఇండియాలో ఘోర పరాభవం

కారులో ఏ/సి ఎఫెక్టివ్‌గా పనిచేయాలంటే ?

ఎప్పటికప్పుడు సర్వీస్ చేయించండి:

వేసవి కాలం ప్రారంభమయ్యే ముందు ఇంటికి అమర్చుకున్న ఏ/సిని ఎలాగైతే సర్వీస్ చేస్తామో, అదే విధంగా కారులోని ఏ/సిని కూడా సర్వీసింగ్ చేయించాలి. దీంతో దూర ప్రాంత ప్రయాణాలు చేయాల్సివచ్చినపుడు ఎలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉండదు.

కారులో ఏ/సి ఎఫెక్టివ్‌గా పనిచేయాలంటే ?

కారు ఏ/సి సర్వీసింగ్‌లో ప్రధానంగా చెక్ చేయాల్సినవి:

1 ఎయిర్ వెంట్ టెంపరేచర్ చెక్ చేయడం

2.ఏసి గ్యాస్ మార్చడం

3. ఏసి ఫిల్టర్లను మార్చడం

4. ఏసి లోని డ్రైవ్ బెల్ట్ మరియు పుల్లీ(గిలక)లను అడ్జెస్ట్ చేయడం

5. వాల్వ్స్ మరియు థెర్మోస్టార్ట్స్ పనితీరును పరీక్షించడం

6. ఏసి వ్యవస్థ మొత్తానికి లీక్ టెస్ట్ చేయడం

7. కండెన్సర్ ఫిన్స్ క్లీన్ చేయడం

8. ఏసి సిస్టమ్ మొత్తాన్ని పరిశుభ్రంగా ఉంచడం

కారులో ఏ/సి ఎఫెక్టివ్‌గా పనిచేయాలంటే ?

ఈ మొత్తం సర్వీసింగ్ కోసం సుమారుగా సగం రోజు పడుతుంది. కాబట్టి దగ్గరుండి ఏసిని సర్వీసింగ్ చేయించుకోవడంతో మరో ఏడాది పాటు ఎలాంటి ఇబ్బందిపడాల్సిన అవసరం ఉండదు. అయితే, నిష్ణాతులైన కారు ఏ/సి మెకానిక్‌ల వద్దే సర్వీసింగ్ చేయించుకోవడం మరువకండి.

Most Read Articles

English summary
Read In Telugu: Five ways to make your car’s AC super effective
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X