కారు పార్కింగ్‌లోనూ టెక్నాలజీ.. మీ కారులో ఇలాంటి అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయా.??
ఇటీవలి కాలంలో టెక్నాలజీ విస్తృతమవుతుండటంతో ఆటోమొబైల్ పరిశ్రమలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. దీని ద్వారా వాహన యజమానులకు రైడింగ్ సులభతరమవుతోంది. అయితే ఇక్కడ కీలక విషయం ఏమిటంటే కారు పార్కింగ్(Car Parking Technology) విషయంలోనూ టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తోంది. పూర్తి వివరాలు ఈ కథనంలో..
ప్రస్తుత కాలంలో నగరాల్లో, పట్టణాల్లో కారు పార్కింగ్ పెద్ద సమస్యగా మారింది. రద్దీ రోడ్లు, ట్రాఫిక్ కారణంగా కారును సరైన స్థలంలో పార్కింగ్ చేయడం సవాలుతో కూడుకున్న పని. అందుకే సరైన పార్కింగ్ స్థలం చూసుకుని పార్క్ చేయాల్సి ఉంటునంది. ఇక కారును పార్కింగ్ చేశాక.. మళ్లీ అక్కడి నుంచి కారును బయటకు తీయడం ఇంకా కష్టమైన పని. ఆ సమయంలో కార్లపై స్క్రాచ్‌లు ఏర్పడే ప్రమాదం కూడా ఉంటుంది.

అయితే కారు పార్కింగ్ విషయంలో ఈ సమస్యలన్నింటిని పరిష్కరించడానికి టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. డ్రైవింగ్ చేసేటప్పుడు ఎదురయ్యే సమస్యలను గుర్తించి ఆ సమస్యలను పరిష్కరించేందుకు వివిధ సాంకేతికతలను ఆటోమొబైల్స్‌లో అనుసంధానం చేస్తున్నారు. చాలా ఇరుకైన ప్రదేశాల్లో కూడా పార్కింగ్ చేసే టెక్నాలజీని తీసుకువచ్చారు.
కార్ల సేల్స్‌ను పెంచుకునేందుకు ఆటో మేకర్లు తమ వాహనాల్లో ఇటువంటి సాంకేతికతలను తీసుకువస్తున్నారు. ఇలా కారు పార్కింగ్‌కు సంబంధించి ప్రస్తుతం మూడు టెక్నాలజీలు అందుబాటులో ఉంటున్నాయి. ఇవి మీ కారులో ఉన్నట్లయితే.. ఎటువంటి తలనొప్పి లేకుండా మీ కారును పార్కింగ్ చేసుకోవచ్చు.

360-డిగ్రీ కెమెరా: నేడు విక్రయించబడుతున్న కార్లలో 360-డిగ్రీ కెమెరా అత్యంత ముఖ్యమైన టెక్నాలజీగా పరిగణించబడుతుంది. ఇది భద్రతా సాంకేతికత. ఈ కెమెరాను ఆన్ చేయడం వలన కారు పైన కెమెరా ఉన్నట్లుగా, మీ కారు చుట్టూ ఉన్న వాటిని మీరు చూడవచ్చు. దీని ద్వారా మీరు రివర్స్ చేసేటప్పుడు కారును జాగ్రత్తగా తీసుకెళ్లవచ్చు.
ఈ టెక్నాలజీ ఎలా పనిచేస్తుందంటే.. దీని కోసం వాహనం చుట్టూ కెమెరాలు పెట్టి, ఆ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలను సాంకేతిక పద్ధతిలో మేళవించి, వాహనంపై నుంచి ఒకేసారి చూసేలా డిజైన్ చేస్తారు. ఖరీదైన కార్లలో, కారు కింద, ముందు భాగంలో, కింది భాగంలో ఉండే వస్తువులను కూడా పర్యవేక్షించేందుకు కెమెరాలను ప్రవేశపెడుతున్నారు.

పార్కింగ్ సెన్సార్: నేడు సరసమైన కార్లలో కూడా పార్కింగ్ సెన్సార్‌ను ఆటో మేకర్లు అందుబాటులోకి తీసుకొచ్చాయి. అయితే కొన్ని పాత వాహనాలకు ఈ సెన్సార్లు లేకపోయినా, ఇప్పుడు ఈ రకమైన సెన్సార్లు ఆఫ్టర్ మార్కెట్‌లో కొనుగోలు చేసుకోవచ్చు. దీన్ని కొనుగోలు చేసి మీ వాహనాల్లో అమర్చుకునే సదుపాయం కూడా కల్పిస్తోంది. ఈ క్రమంలో ఈ సెన్సార్ లేకుండా కారు లేదంటే అతిశయోక్తి కాదు.
పార్కింగ్ సెన్సార్ అమర్చిన వాహనాల్లో ఇతర వాహనాలు ఢీకొనే రీతిలో ఫలానా వాహనానికి దగ్గరగా వస్తే సెన్సార్లు వెంటనే గుర్తించి డ్రైవర్‌ను హెచ్చరించే విధంగా దీన్ని ఏర్పాటు చేశారు. ఇది రివర్స్ తీసుకునేటప్పుడు వాహనాన్ని టర్నింగ్ చేయడం వల్ల స్క్రాచెస్ లాంటివి పడకుండా కాపాడుకోవచ్చు.

పార్కింగ్ కెమెరాలు: భారత మార్కెట్లో నేడు అందుబాటులో ఉన్న కార్లలో పార్కింగ్ కెమెరాలు తప్పనిసరిగా ఉంటున్నాయి. ఇది 360 డిగ్రీల కెమెరాల కోసం కూడా దోహదపడుతుంది. ఈ కెమెరాలను కలిగి ఉండటం వలన వాహనం రివర్స్‌లో ఉన్నప్పుడు లేదా ముందు పార్కింగ్ చేసేటప్పుడు క్రాష్ కాకుండా నిరోధించడంలో సహాయపడుతుంది.
ఇప్పుడు అన్ని ఆటోమోటివ్ కంపెనీలు వాహన భద్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయి. తద్వారా వాహనాల పార్కింగ్‌లోనూ మరింత సాంకేతికత అమలవుతోంది. కాబట్టి కొత్తగా కారు కొనుగోలు చేయాలనుకునేవారు ఇలాంటి ఫీచర్లు ఉన్న కార్లను కొనుగోలు చేయడం ద్వారా మీ కారుకు చిన్న గాయం కూడా కాకుండా భద్రంగా కాపాడుకోవచ్చు.


Click it and Unblock the Notifications








