అలర్ట్: ఇలాంటి డ్రైవింగ్ హ్యాబిట్స్ మీ కార్ ని డేంజర్ లో పడేస్తాయి !!

Written By:

వివిధ రకాల ఆటోమొబైల్ సంస్థలు తయారు చేసిన వాహనాలలోవారు సూచించిన ఇంధనం, ఇంజన్ ఆయిల్, ట్రాన్స్‌మిషన్ ఆయిల్, ఇంజన్ కూలింగ్ ఆయిల్ మరియు బ్రేక్ ఫ్లూయిడ్‌ని నింపాల్సి ఉంటుంది.

వీటిని తయారీదారులు సూచించిన విధంగా నింపాలి. లేదంటే ఇంజన్‌లో వివిధ రకాల సమస్యలు తలెత్తి మీ వాహనాన్ని ప్రమాదంలో పడేస్తాయి. ఇవి మాత్రమే కాదు, కొన్ని రకాల డ్రైవింగ్ హ్యాబిట్స్ మీ కారును డేంజర్‌లో పడేస్తాయి. ఇలాంటి డ్రైవింగ్ హ్యాబిట్స్ మీకు కూడా ఉన్నాయేమో చెక్ చేసుకోండి.

అధిక బరువులు

అధిక బరువులు

మీరు వాహనాన్ని డ్రైవ్ చేస్తున్నపుడు అధిక బరువులను వేస్తూ ఉంటారు. పరిమితిని మించి లోడ్ చేయడం వలన వాహనంలోని కొన్ని ప్రత్యేక భాగాల మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. అందులో సస్పెన్షన్ సిస్టమ్, బ్రేకింగ్ వ్యవస్థ వంటివి పాడయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

క్లచ్‌ను తొక్కిపట్టి నడపడం

క్లచ్‌ను తొక్కిపట్టి నడపడం

ఇది అతి చెడ్డ అలవాటు, వాహనాన్ని నడిపే సమయంలో ఎప్పుడూ క్లచ్‌ను తొక్కి పట్టి నడపడం వలన క్లచ్ ముందుగానే క్షీణించడం మొదలవుతుంది. తద్వారా ఖరీదైన క్లచ్‌లు పాడవుతాయి. ట్రాఫిక్ మరియు వాహనాన్ని ఆపాల్సి వచ్చినపుడు సాధ్యమైనంత వరకు క్లచ్‌ను వినియోగించడం మానేసి యాక్సిలరేటర్ మరియు బ్రేకుల ఆధారంతో వాహనాన్ని కంట్రోల్ చేయడం మంచింది.

చక్రాలను సరిగా అమర్చకపోవడం

చక్రాలను సరిగా అమర్చకపోవడం

వాహనంలోని చక్రాలను సరిగ్గా అమర్చకున్నప్పటికీ అలాగే నడుపుతుంటారు కొంత మంది డ్రైవర్లు. ఇలా చేయడం వలన శబ్దం చేస్తూ టైర్లు అరిగిపోతాయి మరియు దీని వలన సస్పెన్షన్ సిస్టమ్ క్షీణించిపోయి వాటి జీవితం కాలం త్వరగా తగ్గిపోతుంది. ఒక్కో సారి టైర్లు పేలిపోయి ప్రమాదం సంభవించే అవకాశాలు కూడా ఉన్నాయి.

టైర్లలో గాలి తగినంతగా లేనపుడు డ్రైవింగ్ చేయడం

టైర్లలో గాలి తగినంతగా లేనపుడు డ్రైవింగ్ చేయడం

ట్రైర్లలో గాలి తయారీ దారులు సూచించిన రీతిలో ఉండునట్లు చూసుకోవాలి. తక్కువ పరిమాణంలో గాలి ఉండటం వలన టైరు రోడ్డు మీద ఎక్కువగా కాంటాక్ట్‌లో ఉంటుంది. తద్వారా మైలేజ్ తగ్గిపోతుంది మరియు టైరుకు ప్రక్కవైపుల డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరియు గాలి ఎక్కువగా నింపడం వలన, ఇంజన్ ఉత్పత్తి చేసే టార్క్‌ మొత్తం టైర్లకు చేరడం వలన టైర్లకు మరియు రోడ్డుకు మధ్య ఎక్కువ ఘర్షణ కలుగుతుంది. తద్వారా టైర్లు వెంటనే అరిగిపోతాయి.

సూచించిన సమయానికి సర్వీసింగ్ చేయించకపోవడం

సూచించిన సమయానికి సర్వీసింగ్ చేయించకపోవడం

తయారీ సంస్థలు సూచించిన సమయానికి సరిగ్గా సర్వీసింగ్ చేయించడం ఎంతో ఉత్తమం. లేదంటే వాహనంలోని కొన్ని బాగాలు డ్యామేజ్ అయ్యి వాహనం యొక్క పనితీరు క్షీణింపచేస్తాయి.

వాలు తలం మీద బ్రేకులు వినియోగించడం

వాలు తలం మీద బ్రేకులు వినియోగించడం

వాలు తలం మీద క్రిందకు ప్రయాణిస్తున్నపుడు గరిష్టం వేగంలో బ్రేకులు ఉపయోగించడం వలన బ్రేకు మీద ఉన్న బ్రేకు ప్యాడ్లు గరిష్ట ఘర్షణకు గురయ్యి అత్యధిక వేడిని రాజేస్తుంది. తద్వారా బ్రేకులు మరియు బ్రేకు ప్యాడ్‌లు ఆకారాన్ని కోల్పోయి, అరిగిపోయే అవకాశం ఏర్పడుతుంది. ఆ తర్వాతా వాహనం నిలపాలన్నా బ్రేకులు పడకపోవడం, అదుర్లకు గురి కావడం, వంటి సమస్యలు తలెత్తుతాయి.

అనవసరంగా ఇంజన్‌ను రైస్ చేయడం

అనవసరంగా ఇంజన్‌ను రైస్ చేయడం

ప్రయాణాన్ని ప్రారంభించడానికి ముందుగా చాలా ఇంజన్‌ను తదేకంగా రైస్ చేస్తుంటారు. ఇలా చేయడం వలన ఇంజన్ చుట్టూ వేడి పెరిగిపోతుంది. ఇది తయారీదారులు సూచించి వేడికన్నా అధికమవడం వలన ఇంజన్‌లోని చిన్న చిన్న భాగాలు ఆకారాలు మారిపోతాయి. దీనికి బదులుగా ఇంజన్‌ను ఆన్ చేసి కొంత సమయం పాటు ఐడిల్ ఉంచడం ఉత్తమం.

మందున్న వాహనాలకు దగ్గరగా వెళ్లడం

మందున్న వాహనాలకు దగ్గరగా వెళ్లడం

వాహనాలలో ప్రయాణిస్తున్నపుడు ముందున్న వాహనాలకు నిర్ణీత దూరంలో ఉండటం మంచిది. ఎందుకంటే ముందు వాహనాల ప్రమాదానికి గురైతే వెంటనే స్పందించే సమయం కాస్త ఉంటుంది. అలా కాకుండా వారి వెంబడి ప్రయాణించడం వలన ముందున్న వాహనం ప్రమాదానికి గురయితే మీ వాహనం కూడా ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది.

హ్యాండ్ బ్రేకులను వినియోగించకపోవడం

హ్యాండ్ బ్రేకులను వినియోగించకపోవడం

వాలు తలం మీద పైకి లేదా క్రిందకు ప్రయాణిస్తున్న సందర్భాలలో వాహనాన్ని ఆపాల్సి వచ్చినపుడు హ్యాండ్‌బ్రేకులను వినియోగించడం ఎంతో ఉత్తమం. పొరబాటున వాహనాలు కదిలితే లోయల్లోకి పడిపోవడం ఖాయం. ఇలాంటి వాటిని నివారించడంలో హ్యాండ్‌బ్రేకులు ఎంతో బాగ పనిచేస్తాయి. కాబట్టి ఇలాంటి అలావాటు లేని వాళ్లు అలవరచుకోవడం ఎంతో ఉత్తమం.

డ్రైవింగ్ పద్దతి (బిహేవియర్)

డ్రైవింగ్ పద్దతి (బిహేవియర్)

ఇది అన్నింటికంటే ఎంతో ముఖ్యం. వాహనాన్ని నడిపే వ్యక్తి అన్నింటి కన్నా ముఖ్యంగా ఎంతో పద్దతితో ఉత్తమ బిహేవియర్‌ను కలిగి ఉండాలి. మీ ప్రయాణం సుఖంగా, సేఫ్టీతో సాఫీగా సాగాలంటే డ్రైవర్‌ సీటులో ఉన్న వ్యక్తి స్వభావం సుముఖంగా అన్ని సమస్యలను అవరోధించి వెంటనే నిర్ణయాలు తీసుకునే స్వభావాన్ని కలిగి ఉండాలి.

డ్రైవింగ్ చిట్కాలు
  
English summary
These 10 driving habits are bad for your car
Story first published: Friday, July 22, 2016, 12:54 [IST]
Please Wait while comments are loading...

Latest Photos