తాగుతూ.. తూగుతూ.. డ్రైవ్ చేస్తున్నారా... అయితే జాగ్రత్త

నేటి కుర్రకారుకి మద్యం సేవంచడం ఫ్యాషన్‌గా మారిపోయింది. మరికొందరికి ఇది వ్యసనంగా మారిపోయింది. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మధ్యపాన సేవనం అంటే సగం జీవితాన్ని కోల్పోవడమేనని. కాబట్టి మద్యం సేవించినపుడు ప్రయాణాలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించిన కొన్ని సలహాలు......
1. వీలైనంత వరకూ అవుట్‌డోర్‌లలో పార్టీలు చేసుకోకండి. ఒకవేళ అలా చేసుకోవాల్సి వస్తే.. మీ వెంట మద్యం సేవించని వ్యక్తిని కానీ.. లేదా డ్రైవర్‌ని కానీ తీసుకువెళ్లండి.
2. మీ పార్టీలను వీలైనంత వరకూ రాత్రి 10 గంటల సమయంలోపే ముగిసేలా చూసుకోండి. మద్యం మత్తు మరీ ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తే.. ఇంటికి వెళ్లడానికి టాక్సీని గానీ.. లేదా స్నేహితుడి సహాయాన్ని కానీ తీసుకోండి.
3. మద్యం సేవించినప్పుడు కారులో ఫాస్ట్‌ఫుడ్ రెస్టారెంట్లకు వెళ్లకండి. వారు మిమ్మల్ని వెయింటింగ్‌లో పెట్టించి మీ గురించి పోలీసులకు సమాచారం అందిచే ఆస్కారం ఉంది. పైగా మీ నుంచి డబ్బులు కూడా వసూలు చేయవచ్చు.
4. ఇలాంటి ఆల్కహాల్ పార్టీలు చేసుకునే సమయంలో బైక్‌లో లేదా టాక్సీలో వెళ్తున్నప్పుడు విలువైన వస్తువులు (బంగారం, ల్యాప్‌టాప్, స్మార్ట్‌ఫోన్) వంటివి మీ వెంట తీసుకువెళ్లకండి. ఎందుకంటే మద్యం మత్తులో మీరు వాటి పోగొట్టుకోవచ్చు లేదా దుండగులు దానిని అవకాశంగా తీసుకొని దొంగిలించవచ్చు.
5. ఫుల్లుగా మద్యం సేవించి డ్రైవ్ చేయడం వల్ల మీ ప్రాణాలకు ముప్పు వాటిళ్లడమే కాకుండా.. మీ వల్ల ఇతరుల ప్రాణాలకు కూడా హాని జరగవచ్చు. కాబట్టి వీలైనంత వరకూ మద్యం సేవించి డ్రైవ్ చేయకపోవడమే ఉత్తమం. కొంచెం ఆలస్యమైనా నిషా దిగే వరకూ వేచి ఉండి ఆ తర్వాతనే డ్రైవ్ చేయడం శ్రేయస్కరం.
6. ఒకవేళ మద్యం సేవించి డ్రైవ్ చేస్తూ పోలీసులకు దొరికిపోతే వారితో వాగ్వివాదానికి దిగకుండా.. నిశితంగా సమాధానమిచ్చి, వారు విధించిన జరిమానా కట్టడమో లేక మీ మిత్రులు, కుటుంబ సభ్యులకు సమాచారమివ్వడమో ఉత్తమం. అలాకాక వారితో గొడవకు దిగితే.. జరిమానాతో పాటు జైలు శిక్షను సైతం అనుభవించక తప్పదు.
కాబట్టి మద్యం సేవించినప్పుడు అస్సలు డ్రైవ్ చేయకపోవడమే ఉత్తమం. తప్పనిసరి పరిస్థితుల్లో డ్రైవ్ చేయాల్సి వచ్చినప్పుడు పైన చెప్పిన సలహాలు పాటిస్తే.. మీ ఆరోగ్యంతో పాటు మీ కుటుంబ సభ్యులు కూడా సంతోషంగా ఉండగలరు. లిక్కర్ బాటిల్ పగిలితే మళ్లీ కొనుక్కోగలం కానీ ప్రాణాన్ని కొనుక్కోగలమా..? కావున మధ్యం సేవించేప్పుడు ఒక్కసారి మీ కుటుంబం గురించి కూడా ఆలోచించుకోండి...!!


Click it and Unblock the Notifications








