బైక్ ఇంధనాన్ని ఆదా చేసుకొని మైలేజ్ పెంచుకునేందుకు చిట్కాలు

Fuel Saving Tips
నానాటికీ పెరుగుతున్న పెట్రోల్ ధరలను గమనిస్తున్న ప్రతివారికీ పెట్రోల్ వినియోగాన్ని తగ్గించుకుంటే బావుండు, లేదా బైక్ అధిక మైలేజ్ ఇస్తే బావుండనిపిస్తుంది. ఇలా ఆలోచించే వారికోసమే ఇంధనాన్ని ఎలా ఆదా చేసుకోవాలో తెలిపే కొన్ని చిట్కాలు..

* బైక్‌ను ఎల్లప్పుడూ కండిషన్‌లో ఉంచుకొని, ఎప్పటికప్పుడు సర్వీసింగ్‌లు చేయిస్తుండాలి.

* ప్రతి 3000 కి.మీ. లేగా మూడు నెలలకు ఒకసారి ఇంజన్ ఆయిల్‌ను మార్చుకోవాలి.

* క్లచ్‌ను జాగ్రత్తగా ఉపయోగించాలి. క్లచ్ స్లిప్పింగ్ ఇంధన సామర్థ్యాన్ని తగ్గిస్తుంది.

* ప్రతి 2000 కి.మీ. ఒకసారి చైన్ మరియు చైన్ స్ప్రాకెట్లను శుభ్రం చేసుకొని, సరైన లూబ్రికెంట్‌లను వాడాలి.

* వదులు (లూజ్)గా ఉండే చైన్‌తో ఎప్పుడు కూడా రైడ్ చేయకూడదు. ఇది మైలేజ్‌ను తగ్గిస్తుంది. ఇంకా ఇది ప్రమాదకరమైనది కూడా.

* రాపిడి (ఫ్రిక్షన్)ను తగ్గించేదుకు ఎల్లప్పుడు రెండు టైర్లలో సరైన గాలి పీడనం (ఎయిర్ ప్రెజర్) ఉండేలా జాగ్రత్త వహించాలి. టైర్లలో ఎయిర్ తక్కువగా ఉంటే అది మైలేజ్‌పై ప్రభావం చూపే ఆస్కారం ఉంది.

* పెట్రోల్ ట్యాంక్, ఫ్యూయెల్ పైప్, ఫ్యూయెల్ ఫిల్టర్లను తరచూ చెక్ చేసుకుంటూ ఉండాలి.

* కార్బోనేటర్‌ను సరిగ్గా ట్యూన్ చేయించుకోవాలి. ఇది మైలేజ్‌ను పెంచుతుంది. మైలేజ్‌లో ఏదైనా సమస్య తలెత్తితే కార్బోనేటర్‌ను రీ-ట్యూన్ చేయించుకోవాలి.

* కేబుళ్లు, కేబుళ్ల టిప్‌లకు తరచూ లూబ్రికెంట్‌లను వాడుతుండాలి.

* ప్రతి 2000 కి.మీ. ఒకసారి కార్బోనేటర్‌ (ఫ్లోట్ చాంబర్, జెట్స్) మరియు స్పార్క్ ప్లగ్‌లను శుభ్రం చేసుకోవాలి.

* బ్రేక్‌లు ఎక్కువ బిగుతు (టైట్)గా లేకుండా చూసుకోవాలి. దీనివల్ల బైక్ స్పీడ్ తగ్గి, బ్రేక్ షూలు త్వరగా అరిగిపోవడమే కాకుండా మైలేజ్ కూడా తగ్గుతుంది.

* ఎయిర్ ఫిల్టర్లను తరచూ శుభ్రం చేసుకోవాలి.

* ఎంపిక చేసిన / మంచి పెట్రోల్ బంకులలో మాత్రమే ఇంధనాన్ని కొనుగోలు చేయాలి. వీలైంనంత వరకూ ఇంధనాన్ని ఉదయం వేళల్లో పట్టించుకోవడం మంచిది. బైక్‌ను ఎల్లప్పుడు నీడలో పార్కింగ్ చేయటం ఉత్తమం.

* బైక్ టాప్ గేర్‌ను ఎల్లప్పుడూ 40-60 కి.మీ. రేంజ్లా మాత్రమే ఉపయోగించండి. సడెన్ బ్రేక్‌లను వేయకండి. 70 కి.మీ. వేగంగా బైక్‌ని రైడ్ చేయకండి.

* ఇంజన్‌ను రైజ్ చేయకండి. ఇది ఇంధన వినియోగాన్ని పెంచుతుంది. యాక్సిలరేషన్‌ను తగ్గించిన తర్వాత మాత్రమే గేర్‌ను మార్చండి.

* భారీ ట్రాఫిక్ సిగ్నల్స్‌లలో ఇంజన్‌ను స్విఛ్ ఆఫ్ చేయండి. ఇంధన సామర్థ్యం కోసం అనధికారిక పరికరాలను వాడకండి.

కాబట్టి పైన తెలిపిన సలహాలు పాటించి మైలేజ్‌ను పెంచుకోవడమే కాకుండా.. ధనాన్ని కూడా ఆదా చేసుకోండి.

More from DriveSpark

Article Published On: Monday, May 16, 2011, 17:45 [IST]
English summary
Car/bike users need to follow some methods to conserve fuel so that the increased prices do not affect their budgets. Avoid using your cars/bikes for short commutes. Fuel efficiency of vehicles during short trips are not high and you will also be benefited by the exercise. Always buy fuel from a reputed and reliable petrol bunk as adulterated fuel will not be efficient and can also damage your engine.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+