ఈ చిన్న టిప్స్‌తో సమ్మర్‌లో మీ కారు క్యాబిన్ సిమ్లాలా మారుతుంది.. వెంటనే ఇలా చేయండి.!!
చలికాలం, వర్షాకాలంతో పోలిస్తే వేసవి కాలంలో ప్రజలు ఎక్కువగా లాంగ్ టూర్లు చేయడానికి ఇష్టపడతారు. ముఖ్యంగా ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి కార్లలో పర్యాటక ప్రాంతాలకు క్యూ కడుతుంటారు. అయితే సమ్మర్ ఎఫెక్ట్ మీ ప్రశాంతమైన జర్నీపై పడకుండా ఉండాలంటే.. కారులో ఏసీ అనేది సరిగ్గా పనిచేస్తుండాలి.
వేసవి కాలం మొదలైంది. ఇక ఇంట్లోనే కాదు.. జర్నీ చేసినా కూడా ఉక్కపోతే. ఇక కార్లలో అయితే చెప్పాల్సిన పని లేదు. సమ్మర్‌లో కారులో ఏసీ లేకపోతే.. మీరు అందులో అడుగు కూడా పెట్టలేరు. వేడి తాపం కారణంగా బయటి ఉష్ణోగ్రతలతో పోలిస్తే కారులో టెంపరేచర్ మరింత ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ కాలంలో కారులో ఏసీ మెయింటెనెన్స్ చాలా కీలకం.

సమ్మర్‌లో కారు ఏసీ సరిగా పనిచేయకపోతే ప్రయాణం చాలా కష్టంగా ఉంటుంది. దీంతో మీరు చిన్నపాటి ప్రయాణాన్ని కూడా ఆస్వాదించలేరు. ఇక ట్రాఫిక్ ఎదురైతే ఆ ఉక్కపోతకు.. ఆ రద్దీకి మీకు ఇంకా చెమటలు ఎక్కువగా పట్టాల్సిందే. అందుకే ఎండలు ముదరకముందే మీరు కారు ఏసీ పనితీరుపై ఓ లుక్కేసుకోవాలి.
ఎండలు పెరగకముందే మీ కారు యొక్క AC సర్వీస్‌ను మెయింటెనెన్స్ చేయించడం చాలా ముఖ్యం. కారు AC ఏ ఆటంకం లేకుండా సవ్యంగా పనిచేసేలా చూసుకోవడానికి ఇదే సరైన సమయం. ఇందుకోసం మీరు కొన్ని చిట్కాలు పాటించాలి. వీటిని అనుసరించడం ద్వారా వేసవిలో మీ కారు యొక్క AC కంటే ఇంకా మంచి కూలింగ్‌ను అంటే మీరు హిమాలయాల్లో ఉన్న అనుభూతిని ఆస్వాదించవచ్చు.

ముందుగా మీరు కారులో ప్రయాణాన్ని ప్రారంభించే ముందు, వేడి గాలి బయటకు వచ్చేలా కాసేపు దాని డోర్ లేదా విండోలను తెరిచి ఉంచాలి. మీ కారులో సన్‌రూఫ్ కూడా ఉన్నట్లయితే, సన్‌రూఫ్‌ను కూడా కొద్దిగా తెరిచి ఉంచండి. తర్వాత, మీరు కారులో కూర్చున్నప్పుడు, AC ఆన్ చేయడంతో పాటు, రీసర్క్యులేషన్ మోడ్‌ను ఆఫ్ చేయండి. తద్వారా AC బయటి గాలిని చల్లబరుస్తుంది.
కొద్ది సేపటి తర్వాత క్యాబిన్ చల్లబడిందని మీరు భావించినప్పుడు, రీసర్క్యులేషన్ మోడ్‌ను తిరిగి ఆన్ చేయాలని గుర్తుంచుకోండి. దీంతో ఏసీ క్యాబిన్‌లోని గాలిని మాత్రమే ఉపయోగిస్తూ మీకు చల్లగాలిని ఇస్తుంది. తద్వారా మీకు సాధారణం కంటే ఎక్కువ చల్లటి గాలిని మీరు ఆస్వాదిస్తారు.
అయితే మీకు ఇంకా కూలింగ్ కావాలనుకుంటే.. మీరు AC టెంపరేచర్‌ను మీరు ఇంకా తక్కువకు సెట్ చేసుకోవచ్చు. దీని ద్వారా చల్లగాలి ప్రవాహం మరింత పెరుగుతుంది. అయితే, ఇది కారు మైలేజ్‌పై ప్రభావం చూపిస్తుంది. దీన్ని గమనించుకుంటూ మీరు ఏసీ టెంపరేచర్‌ను సెట్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఒకవేళ మీరు కారులో ఒంటరిగా కారులో ప్రయాణిస్తున్నట్లయితే, మీ వైపున ఉన్న AC వెంట్లను మాత్రమే ఉంచుతూ మిగిలిన వాటిని మూసివేయండి. తద్వారా గాలి మొత్తం మీ వైపునకే వీస్తుంది. అదే సమయంలో, కారులో మీతో పాటు ముందు సీటు ప్రయాణికుడు ఉన్నట్లయితే, ముందు AC వెంట్లను మాత్రమే ఆన్ చేయండి. వెనుక AC వెంట్లను క్లోజ్ చేయండి. దీని ద్వారా మీకు మెరుగైన కూలింగ్ అందుతుంది.
పైన చెప్పిన టిప్స్‌ను పాటించడం ద్వారా సమ్మర్‌లో మీరు కారులో విసుగులేని చల్లని ప్రయాణ అనుభూతిని పొందవచ్చు. ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు లేకుండా హడావుడిగా ఏసీ ఆన్ చేస్తూ జర్నీ స్టార్ట్ చేశారంటే మీకు తరచూ ఏసీ రిపేర్ సమస్యలు తలెత్తవచ్చు.


Click it and Unblock the Notifications








