మీ వాహన మైలేజీని పెంచుకునేందుకు చిట్కాలు

By Ravi

ప్రస్తుతం భగ్గుమనే ఇంధన ధరలు పరిగణలోకి తీసుకొని వాహనాలను కొనుగోలు చేసే వారందరూ ప్రధానంగా మైలేజ్ (ఫ్యూయెల్ ఎఫీషియన్సీ)కే ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వటం జరుగుతుంది. ప్రస్తుతం వినియోగిస్తున్న వాహనాలనే ఆచితూచి డ్రైవ్ చేసినట్లయితే, ఇంధనం వృధా కావాటాన్ని అరికట్టి అధిక మైలేజ్‌ను పొందవచ్చు. ఈ చిన్ని చిట్కాలను పాటిస్తే మెరుగైన మైలేజ్‌ మీ సొంతమవుతుంది.

1. వివేకంతో డ్రైవ్ చేయటం. మితిమీరిన వేగం, అనవసరమైన యాక్సిలరేషన్, అసందర్భ బ్రేకింగ్‌లను తగ్గించుకోగలిగినట్లయితే, ఇంధన వినియోగం తగ్గి మైలేజ్ పెరుగుతుంది. హైవేలపై ఎక్కువ వేగంతో వెళ్లటం వలన సుమారు 30 శాతానికి పైగా మైలేజ్‌ను కోల్పోవటం జరుగుతుంది. అలాగే, సిటీ రోడ్లపై అనవసర బ్రేకింగ్, యాక్సిలరేషన్ కారణంగా సుమారు 5 శాతం మైలేజ్‌ను కోల్పోవటం జరుగుతుంది.

2. వాహనాన్ని ఎంచుకునేటప్పుడే అధిక మైలేజీనిచ్చే వాహనాలను ఎన్నుకోవాలి. ముఖ్యంతా ప్రత్యామ్నాయ ఇంధనాలతో నడిచే వాహనాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. హైబ్రిడ్ వాహనాలు లేదా సిఎన్‌జి, ఎల్‌పిజి వంటి పర్యావరణ సాన్నిహిత్యత కలిగిన ఇంధనాలతో నడిచే వాహనాలను ఎంచుకోవటం వలన ఇటు మైలేజ్ పెరగటమే కాకుండా, అటు మన చుట్టూ ఉండే పర్యావరణానికి మేలు చేసినట్లు అవుతుంది.

3. మీరు సిటీల్లో ఎక్కువగా ప్రయాణించే వారయితే, మీ ప్రయాణాన్ని ముందుగానే ప్లాన్ చేసుకొని, పదే పదే తిరిగిన ప్రాంతం చుట్టూ పలుమార్లు తిరగకుండా, వీలైనంత వరకూ ఒకదాని తర్వాత ఒకటిగా ప్లాన్ చేసుకోవాలి. అంటే, తక్కువ దూరం కలిగిన ప్రాంతాలను ముందుగా సందర్శించి, తిరిగి ఆ ప్రాంతాన్ని రాకుండా ఉండే విధంగా ఒకేసారి అక్కడి పనులను చక్కదిద్దుకోవాలి.

4. ఇంజన్‌ను తరచూ ట్యాన్ చేయించుకుంటూ, మంచి రన్నింగ్ కండిషన్‌లో ఉంచుకోవాలి. ఎయిర్ ఫిల్టర్లను ఎప్పటికప్పుడు మార్చుకోవటం ద్వారా మైలేజ్‌ను 10 శాతం మేర పెంచుకోవటమే కాకుండా, ఇంజన్ జీవిత కాలాన్ని కూడా పెంచుకోవచ్చు.

5. అన్ని టైర్లలో గాలి పీడనం సరిగ్గా ఉందో లేదో బయలుదేరే ముందే చూసుకోవాలి. టైర్లలో నిర్దేశిత మోతాదు కన్నా తక్కువ గాలి ఉన్నట్లయితే, రన్నింగ్ లోడ్ పెరిగి మైలేజ్ భారీగా తగ్గిపోయే ఆస్కారం ఉంది.

6. కారు మ్యాన్యువల్‌లో లేదా అధీకృత సర్వీస్ ఇంజనీర్లు సూచించే ఇంజన్ ఆయిల్‌ను మాత్రమే వాడాలి. నాసిరకం ఇంజన్ ఆయిల్‌ను ఉపయోగించడం వలన మైలేజ్ తగ్గడమే కాకుండా, ఇంజన్ పాడయ్యే ఆస్కారం కూడా ఉంది.

7. మైలేజ్, కార్ మెయింటినెన్స్ ఖర్చులు తగ్గించుకునేందుకు టెలీకమ్యూటింగ్, కార్‌ పూలింగ్, పబ్లిక్ ట్రాన్సిట్ వంటివి పరిగణలోకి తీసుకోవటం ఉత్తమం

8. కారులో అనవసర బరువులు, వస్తువులను ఉంచకండి. దీని వలన పేలోడ్ పెరిగి మైలేజ్ తగ్గే ఆస్కారం ఉంది. అవసరం లేదనుకున్నప్పుడు రూఫ్ ర్యాక్‌లను తొలగించుకోవటం ఉత్తమం.

9. మరీ అవసరమైనప్పుడు మాత్రమే ఎయిర్ కండిషన్‌ను ఉపయోగించండి. సాధారణ సమయాల్లో ఎయిర్ కండిషన్‌కు బదులు విండోను కొద్దిగా ఓపెన్ చేసి బయటి గాలిని ఆస్వాదించండి. ఎయిర్ కండిషన్ ఆన్‌లో ఉంచి డ్రైవ్ చేయటం వలన ఇంజన్ పెర్ఫామెన్స్, పవర్ తగ్గిపోవటమే కాకుండా మైలేజ్ కూడా భారీగా తగ్గుతుంది.

More from DriveSpark

Article Published On: Monday, September 24, 2012, 18:32 [IST]
English summary
Mileage is an important factor that will make a break a person's decision to buy a car. In a market like India, price and mileage are important factors even for premium cars. With fuel prices going sky high every month, there is little doubt abut the importance of mileage be it in a car or a two wheeler.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+