మీ బైక్ మైలేజ్ పెరగాలంటే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి.. లేదంటే మీ జేబుకు చిల్లులే.!!
బైక్ రైడింగ్ చేసేటప్పుడు చాలా మంది కొన్ని తప్పులు చేస్తుంటారు. దీని ద్వారా మైలేజ్ తక్కువగా వస్తుంది. ఈ విషయం తెలియని చాలా మంది.. కంపెనీ పేర్కొన్న మైలేజ్ ఇవ్వడం లేదని వాపోతుంటారు. కానీ మీరు బైక్ రైడింగ్‌లో కొన్ని చిట్కాల(Bike Mileage Tips)ను పాటించడం ద్వారా అధిక మైలేజ్‌తో పాటు సరైన నిర్వహణను పొందవచ్చు.
కారు నేర్చుకోవడం కంటే బైక్ నడపడం నేర్చుకోవడం కొంచెం కష్టంతో కూడుకున్నది. ఇది చాలా మందికి తెలిసిందే. చాలా ఏకాగ్రతగా బైక్ రైడింగ్ చేయాల్సి ఉంటుంది. ఏ మాత్రం కంట్రోల్ తప్పినా బోల్తా పడటం ఖాయం. అయితే కొత్త బైక్ కొన్న తర్వాత చాలా మంది తమకు ఎదురయ్యే సమస్యల్లో మొదటగా చెప్పేది.. మైలేజ్ తక్కువగా వస్తుందని చెబుతుంటారు.

అయితే ఇక్కడ చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే, వాహన తయారీదారులు బైక్ నడపడం ద్వారా తమకు వచ్చే మైలేజీని నివేదిస్తారు. దానిని క్లెయిమ్ చేస్తారు. అయితే మీ బైక్ నడుపుతున్నప్పుడు చేసే చిన్న చిన్న పొరపాట్లు.. బైక్ మైలేజ్‌పై ప్రభావితం చూపిస్తుంది. దీని ద్వారా మైలేజ్ తగ్గుతుంది.
సరైన వేగంతో గేర్ మార్చడం(Gear): బైక్ మైలేజ్ తగ్గకుండా ఉండాలంటే ముందుగా మీరు పాటించాల్సింది.. బైక్ నడుపుతున్నప్పుడు సరైన వేగంతో గేర్‌ను మార్చాలని గుర్తుంచుకోవాలి. మీరు ఖాళీగా ఉన్న రహదారిపై ప్రయాణిస్తున్నట్లయితే, బైక్ అదే వేగంతో వెళ్లాలంటే మీరు టాప్ గేర్‌లో వెళ్లాలి. దీని ద్వారా ఇంజిన్‌పై అధిక ఒత్తిడి పడకుండా ఉంటుంది.

అదే సమయంలో బైక్‌పై నిదానంగా వెళ్తున్నట్లయితే రెండు లేదా మూడో గేర్‌లోనే ప్రయాణించాల్సి ఉంటుంది. ఇలా చేస్తే మార్గమధ్యంలో బైక్ ఆగకుండా ప్రయాణం సాఫీగా సాగుతుంది. తద్వారా మీకు ట్రాఫిక్‌లో సమస్య అనిపించదు. తక్కువ వేగంతో ఎక్కువ గేర్‌లో ప్రయాణించడం ద్వారా ఇంజిన్‌పై ప్రభావం చూపుతుంది. దీని ద్వారా మైలేజ్ తగ్గుతుంది.
బ్రేక్‌పై కాలు పెట్టి నడపకండి(Brakes): చాలా మంది బైక్ లేదా స్కూటర్ నడుపుతున్నప్పుడు బ్రేక్‌పై కాలు పెట్టి నడుపుతుంటారు. బ్రేక్‌ను పట్టుకోకపోయినా దానిపై కాలు తేలికగా ఉంచి నడుపుతుంటారు. ఇది ఓ రకంగా మంచిదే.. అయితే అకస్మాత్తుగా ఏదైనా వాహనం ఎదురైతే మీరు తక్షణమే బ్రేక్ వేయాల్సి రావచ్చు. కానీ మీ పాదాలను బ్రేక్‌పై ఎల్లవేళలా ఉంచడం వల్ల బ్రేక్‌కి తేలికపాటి ఒత్తిడి కలుగుతుంది.

టైర్ ప్రెజర్(Tyre Pressure): చాలా మంది బైక్ యజమానులు పట్టించుకోని మరో విషయం టైర్ ప్రెజర్. సాధారణంగా చాలా మంది పెట్రోల్ నింపేటప్పుడు మాత్రమే ఎయిర్ ప్రెజర్ చెక్ చేస్తారు. కొంతమంది నెలకోసారి తనిఖీ చేస్తారు. కొందరైతే తనిఖీ చేయకుండానే వెళ్లిపోతుంటారు. కానీ ప్రతి రెండు రోజులకు ఒకసారి టైర్ ప్రెజర్‌ను తనిఖీ చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ క్రమంలో బైక్‌లో టైర్ ప్రెజర్ తగ్గినా వాహనం మైలేజ్ తగ్గుతుంటుంది. టైర్ ప్రెజర్ తక్కువగా ఉంటే, ఇంజిన్ ఎంత వేగంగా యాక్సిలరేట్ చేసినా, అధిక వేగంతో టైర్ ప్రయాణించదు. దీని ద్వారా టైర్ భూమితో మరింత ఒత్తిడిని కలిగిస్తుంది. కాబట్టి ఎప్పటికప్పుడు టైర్ ప్రెజర్ చెక్ చేసుకోవడం ద్వారా మైలేజ్‌పై ప్రతికూల ప్రభావం చూపించదు.

అయితే చాలా మంది ద్విచక్ర వాహనదారులకు పైన చెప్పిన కారణాల ద్వారా మైలేజ్ తగ్గుతుందనే విషయం తెలియదు. అందుకే చాలా మంది ఇలా చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ రైడింగ్ చేస్తుంటారు. కానీ ఈ చిట్కాలను పాటించడం ద్వారా మీ బైక్ మైలేజ్‌ను పెంచుకోవచ్చు. పెరుగుతున్న పెట్రోల్ ఖర్చుల నుంచి ఉపశమనం పొందవచ్చు.


Click it and Unblock the Notifications








