కారు డ్రైవింగ్‌లో క్లచ్‌ నొక్కేటప్పుడు ఈ పొరపాట్లు చేస్తున్నారా.. అయితే మీరు రిస్క్‌లో పడ్డట్లే.!!

భారత్‌లో చాలా మంది మాన్యువల్ కార్ డ్రైవర్లకు ఉన్న అతి పెద్ద సమస్య క్లచ్. చాలా మందికి క్లచ్‌ని ఎప్పుడు నొక్కాలో, ఎప్పుడు ఉపయోగించకూడదో తెలియదు. దీని ద్వారా కొందరు కారు యాక్సిలరేటర్‌ని ఆన్‌ చేసిన వెంటనే క్లచ్‌(Clutch Maintenance)ని నొక్కుతారు. అయితే దీని వల్ల కొన్ని సమస్యలు ఉన్నాయి.. అవేంటంటే..

భారత్‌లో క్రమంగా కార్ల సంఖ్య పెరుగుతోంది. ఆధునిక టెక్నాలజీకి అనుగుణంగా ఆటోమేటిక్ గేర్ కార్లు వచ్చినప్పటికీ.. కస్టమర్లు ఇప్పటికి కూడా మాన్యువల్ గేర్ కార్లను ఎక్కువగా ఇష్టపడతున్నారు. అందుకే వాటినే ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఆటోమేటిక్‌ గేర్‌ కార్లతో పోలిస్తే.. మాన్యువల్‌ గేర్‌ కార్లే ఎక్కువగా అమ్ముడవతున్నాయి. అయితే వీటిలో ఉన్న ప్రధాన సమస్య క్లచ్‌.

Car-Clutch-Manual-Cars

మాన్యువల్ గేర్ కార్లలో క్లచ్ చాలా కీలకమైన భాగం. క్లచ్ పాడైపోతే కారు పనిచేయదు. ఇంజిన్ మరియు గేర్‌బాక్స్ మధ్య క్లచ్‌ వంతెనలా పనిచేస్తుంది. గేర్ బాక్స్ ఇంజిన్‌కు ఏ స్థానంలో కనెక్ట్ చేయబడిందో క్లచ్‌ నిర్ణయిస్తుంది. కాబట్టి కారు డ్రైవ్‌ చేసేటప్పుడు క్ల్‌చను జాగ్రత్తగా ఉపయోగించాలి.

క్లచ్‌ను జాగ్రత్తగా ఉపయోగించడం ద్వారా, కారు రిపేర్‌ అవ్వకుండా చూసుకోవచ్చు. లేదంటే మెయింటెనెన్స్‌పై చాలా డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది. మీరు కారు డ్రైవింగ్‌ క్లచ్‌(Clutch in Manual Cars) సురక్షితంగా ఎక్కువకాలం ఎలా ఉండాలో ఈ కథనంలో మేము మీకు అందిస్తున్నాం.

Car-Clutch-Manual-Cars

మాన్యువల్‌ కార్‌ డ్రైవర్లు చాలా మంది ఎక్కువగా చేసే పొరపాటు ఏమిటంటే, క్లచ్‌పై చాలా వేగంగా ప్రెజర్‌ పెడుతుంటారు. లేదా సడెన్‌గా దానిపై నుంచి కాలు తీసేస్తారు. అలా కాకుండా నెమ్మదిగా క్లచ్‌పై కాలు పెట్టడం, తీయడం చేయాలి. అప్పుడే క్లచ్‌ సురక్షితంగా ఉంటుంది. క్లచ్‌ను నెమ్మదిగా విడుదల చేయడం వల్ల వాహనం వేగానికి తగ్గట్టుగా ఇంజిన్, క్లచ్‌కి కొంత సమయం లభిస్తుంది.

చాలా మంది డ్రైవర్లు ట్రాఫిక్‌లో ఆగినప్పుడు వాహనాన్ని గేర్‌లో పెట్టి క్లచ్‌ను నొక్కుతారు. కానీ ట్రాఫిక్‌లో వాహనాన్ని ఆపాల్సి వస్తే గేర్‌ని న్యూట్రల్‌కి మార్చి క్లచ్‌లోంచి కాలు తీయాలి. అదే సమయంలో, కారు బ్రేక్‌ వేసేటప్పుడు కూడా అనవసరంగా క్లచ్ నొక్కాల్సిన అవసరం లేదు. క్లచ్‌పై ఎక్కువగా ఒత్తిడి కలిగిస్తే దాని జీవితకాలం తగ్గుతుంది.

Car-Clutch-Manual-Cars

కారు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు గేర్‌లను మార్చేటప్పుడు చాలా మంది డ్రైవర్లు చేసే పొరపాటు ఏమిటంటే, క్లచ్‌ను సగం వరకు పట్టుకుని గేర్‌లను మారుస్తుంటారు. అలా కాకుండా గేర్లు మార్చేటప్పుడు క్లచ్‌ను పూర్తిగా నొక్కాలి. దీని ద్వారా ఇంజిన్‌, క్లచ్‌ రెండింటినీ వేరుచేయడానికి సమయం ఉంటుంది. లేదంటే క్లచ్‌ దెబ్బతినే అవకాశాలు ఉంటాయి.

మీరు కారు మెయింటెనెన్స్‌ చేసేటప్పుడు క్లచ్‌ను కూడా మెయింటెనెన్స్‌ చేయించాలి. దీని ద్వారా దాని జీవిత కాలం కూడా పెరుగుతుంది. క్లచ్‌ను క్రమం తప్పకుండా నిర్వహించక లేకపోతే.. దాని జీవితకాలం కూడా తగ్గుతూనే ఉంటుంది. కాబట్టి మీరు మీ కారుకు సర్వీస్ చేసినప్పుడల్లా, క్లచ్‌ని కూడా చెక్ చేయమని మెకానిక్‌ని అడగాలని గుర్తుంచుకోండి. దీని ద్వారా ఏదైనా సమస్య ఉన్నా అప్పుడే పరిష్కరించుకోవచ్చు.

Car-Clutch-Manual-Cars

కాబట్టి మీరు కారు డ్రైవింగ్ చేసేటప్పుడు క్లచ్‌ నొక్కే విషయంలో ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. డ్రైవింగ్ చేసేటప్పుడు, అవసరమైన సందర్భాల్లో మాత్రమే క్లచ్ ఉపయోగించాలి. మీరు అనవసరంగా క్లచ్ ఉపయోగిస్తే దాని సర్వీసు త్వరగా తగ్గిపోయి మీకు ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే క్లచ్‌ రిపేర్‌ అనేది ఖర్చుతో కూడుకున్న పని.. కాబట్టి కారు యజమానులు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

More from DriveSpark

Article Published On: Sunday, November 26, 2023, 11:05 [IST]
English summary
Tips to increase clutch life time in manual cars
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+