ఇంధనాన్ని ఆదా చేసుకోవడానికి చక్కని చిట్కాలు.. గుర్తుంచుకోండి ప్రతి ఇంధనపు చుక్క విలువైనదే!

ఇంధన ధరలు మండిపోతున్నాయి. కోవిడ్-19 తర్వాత దేశంలో పెట్రోల్/డీజిల్ ధరలకు రెక్కలు వచ్చాయి. పెరిగిన ఇంధన ధరలతో పాటే తమ జీతాలు, జీవితాలు మరియు వాహనాల మైలేజ్ కూడా పెరిగితే బాగుంటుందని చాలా మంది భావిస్తుంటారు. కానీ, నిజజీవితంలో అలా జరగదు. కాబట్టి మనమే పొదుపుగా వ్యవహరించాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఇంధనపు చుక్క విలువైనదే.

Recommended Video

భారతీయ మార్కెట్లో విడుదలైన 2022 Maruti Brezza | ధర & వివరాలు

మంచి నిర్వహణ మరియు డ్రైవింగ్ అలవాట్లతో వాహనాల మైలేజీని మనమే మెరుగుపరచుకోవచ్చు. తద్వారా ఇంధనంపై డబ్బు ఆదా చేసుకోవచ్చు. అదెలానో చూద్దాం రండి.

ఇంధనాన్ని ఆదా చేసుకోవడానికి చక్కని చిట్కాలు.. గుర్తుంచుకోండి ప్రతి ఇంధనపు చుక్క విలువైనదే!

1. అన్ని టైర్లలో సరైన మోతాదులో గాలిని నింపండి

కారు మైలేజ్ పెరగాలంటే అన్ని టైర్లలో సరైన మోతాదులో గాలి ఉండటం ఎంతో అవసరం. పూర్తిగా ఇన్‌ఫ్లేట్ చేయబడిన టైర్లు టైర్ వేర్‌ను తగ్గిస్తాయి మరియు వెహికల్ మెయింటినెన్స్‌ను మెరుగుపరుస్తాయి. టైర్లలో తగినంత గాలి ఉండేలా చూసుకోవడం కూడా మీ కారు ఇంధనాన్ని ఆప్టిమైజ్ చేయడంలో సహాయపడుతుంది. కాబట్టి, మీ వాహనానికి సరైన టైర్ ప్రెజర్ ఎంత అనే విషయాన్ని మీరు మీ కారు యజమాని మాన్యువల్‌లో కానీ లేదా సైడ్ డోర్‌పై అంటించబడిన లేబుల్ కానీ గుర్తించవచ్చు. టైర్లలో నిర్ధిష్ట మోతాదు తక్కువ గాలి ఉంటే, ఇంజన్‌పై అధనపు భారం పడుతుంది. తక్కువ రోలింగ్ రెసిస్టెన్స్ టైర్లను ఉపయోగించడం వలన కూడా మైలేజ్ పెరుగుతుంది.

ఇంధనాన్ని ఆదా చేసుకోవడానికి చక్కని చిట్కాలు.. గుర్తుంచుకోండి ప్రతి ఇంధనపు చుక్క విలువైనదే!

2. కారులో సరైన ఇంజన్ ఆయిల్ వాడండి

అంతర్గత దహన (IC) ఇంజన్లలో ఇంజన్ ఆయిల్ చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఇంజన్‌లో లోపల ఆయిల్ ఎంత ఫ్రెష్‌గా ఉంటే, ఇంజన్ అంత చురుకుగా పనిచేస్తుంది మరియు తక్కువ ఇంధనాన్ని మండిస్తుందని గుర్తుంచుకోండి. కాబట్టి, కారులో తరచూ ఇంజన్ ఆయిల్‌ను మార్చడం ఎంతో అవసరం. ఈ మీ కారుకి ఇంజన్ ఆయిల్‌ను ఎంచుకునేటప్పుడు థర్డ్ పార్టీ ఆయిల్స్ కాకుండా, మీ కారు తయారీదారు సిఫార్సు చేసిన మోటార్ ఆయిల్ గ్రేడ్‌ను ఎంచుకోవడం ఉత్తమం. ఇలా చేయడం వలన మైలేజ్ కూడా పెరుగుతుంది.

ఇంధనాన్ని ఆదా చేసుకోవడానికి చక్కని చిట్కాలు.. గుర్తుంచుకోండి ప్రతి ఇంధనపు చుక్క విలువైనదే!

3. సరైన ఇంధనాన్ని ఉపయోగించండి

సాధారణంగా, అన్ని ప్యాసింజర్ కార్లు ఒకే రకమైన ఇంధనంతో నడుస్తాయి. అయితే, కొన్ని హై-ఎండ్ లగ్జరీ కార్లు మాత్రం ప్రీమియం ఇంధనంతో నడుస్తాయి. ఇలాంటి కార్లు అధిక ఆక్టేన్ కలిగిన ఇంధనాన్ని ఉపయోగిస్తాయి. కాబట్టి, ఖరీదైన కార్లలో సాధారణ ఇంధనాన్ని ఉపయోగించడం మంచి పద్ధతి కాదు, ఇలా చేయడం వలన ఇంజన్ త్వరగా పాడవటంతో పాటుగా మైలేజ్ కూడా భారీగా తగ్గిపోతుంది. కాబట్టి, మీ కారుకి ఏది సరైన ఇంధనమో గుర్తించి, దానిని మాత్రమే ఉపయోగించండి. ఎల్లప్పుడూ ఒకే బ్రాండ్ పెట్రోల్ బంకులలో ఇంధనాన్ని నింపుకోవడానికి ప్రయత్నించండి.

ఇంధనాన్ని ఆదా చేసుకోవడానికి చక్కని చిట్కాలు.. గుర్తుంచుకోండి ప్రతి ఇంధనపు చుక్క విలువైనదే!

4. అవసరమైనప్పుడు ఇంజన్ ట్యూన్-అప్ చేయించండి

మీ కారుకి ఎప్పుడు ఇంజన్‌ ట్యూన్ అప్ చేయించాలో మీకు ముందుగానే అర్థమైపోతుంది. కాబట్టి, అవసరమైన ప్రతిసారి తప్పకుండా ఇంజన్ ట్యూన్-అప్‌ చేయించుకోండి. ఈ ట్యూన్-అప్‌లు ఇంధన ఆర్థిక వ్యవస్థను (మైలేజ్‌ను) ఆప్టిమైజ్ చేయడంలో కూడా సహాయపడతాయి. మురికిపట్టిన ఫ్యూయల్ ఫిల్టర్‌లను మార్చడం, లీక్‌ల కోసం పైపులను తనిఖీ చేయడం మరియు ఫ్యూయల్ ఇంజెక్షన్, ఎగ్జాస్ట్ సిస్టమ్‌లు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని నిర్ధారించుకోవడం వంటి సాధారణ ట్యూన్-అప్ విధానాల వలన మైలేజ్ పెరుగుతుందని గుర్తుంచుకోండి.

ఇంధనాన్ని ఆదా చేసుకోవడానికి చక్కని చిట్కాలు.. గుర్తుంచుకోండి ప్రతి ఇంధనపు చుక్క విలువైనదే!

5. కారులో అదనపు బరువును తొలగించండి

వాహనాలను ఉపయోగించే వారిలో కొంత మంది తమ వాహనంలో అవసరం ఉన్నా లేకపోయినా కొన్ని బరువైన వస్తువులను అలానే ఉంచి డ్రైవ్ చేస్తుంటారు. ఇలా చేయడం వలన కారు ఇంజన్‌పై కూడా అదనపు భారం పడుతుంది. తేలికైన కారు అంటే, అధిక మైలేజ్ అనే విషయాన్ని గుర్తుంచుకోండి. కాబట్టి, మీ కారులో ఏదైనా అనవసరమైన బరువు అనిపిస్తే, వెంటనే దానిని మీ గ్యారేజ్‌లో ఉంచేయండి. కారు బూట్‌స్పేస్‌లో ఉండే అదనపు లగేజ్ మరియు రూఫ్‌ పైన అమర్చిన క్యారియర్లు ఏవైనా ఉంటే తీసివేయండి.

ఇంధనాన్ని ఆదా చేసుకోవడానికి చక్కని చిట్కాలు.. గుర్తుంచుకోండి ప్రతి ఇంధనపు చుక్క విలువైనదే!

6. అధిక వేగాన్ని మరియు ఆకస్మికంగా బ్రేకులు వేయడాన్ని మానుకోండి

మితిమీర వేగంతో వాహనం నడపడం ఎల్లప్పుడూ ప్రమాదమే. అంతేకాకుండా, అవసరం లేకుండా ఆకస్మికంగా బ్రేకులు వేయడం కూడా ప్రమాదకరమే. అంతేకాదు, ఈ రెండు కారణాల వలన కూడా మైలేజ్ భారీగా తగ్గుతుంది. ఒక నిర్ధిష్ట వేగంతో వాహనం నడుపుతున్న ఇంధనం ఓ క్రమ పద్ధతిలో ఖర్చు అవుతుంది. అలాకాకుండా, హైవేలపై వేగంగా డ్రైవ్ చేస్తే మీ కారు ట్యాంకులో ఇంధనం కూడా అంతే వేగంగా ఖాలీ అవుతుందని గుర్తుంచుకోండి.

ఇంధనాన్ని ఆదా చేసుకోవడానికి చక్కని చిట్కాలు.. గుర్తుంచుకోండి ప్రతి ఇంధనపు చుక్క విలువైనదే!

7. క్రూయిజ్ కంట్రోల్‌ను ఉపయోగించండి

ప్రస్తుతం, మార్కెట్లో లభిస్తున్న అనేక కార్లలో క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్ అందుబాటులో ఉంటోంది. ఈ ఫీచర్ సాయంతో కారును హైవేపై నడుపుతున్నప్పుడు యాక్సిలరేటర్ నొక్కాల్సిన అవసరం లేకుండానే నిర్ధిష్ట వేగంతో ఆటోమేటిక్‌గా నడిచేలా చేయవచ్చు. ఇంధన వినియోగాన్ని తగ్గించడంలో మృదువైన యాక్సిలరేషన్ మరియు బ్రేకింగ్ చాలా కీలకమని గుర్తుంచుకోండి. హైవేపై సాఫీగా డ్రైవింగ్ చేయడానికి, క్రూయిజ్ కంట్రోల్‌ను ఉపయోగించడం మంచిది.

ఇంధనాన్ని ఆదా చేసుకోవడానికి చక్కని చిట్కాలు.. గుర్తుంచుకోండి ప్రతి ఇంధనపు చుక్క విలువైనదే!

8. మెరుగైన మైలేజీనిచ్చే కారుని ఎంచుకోండి

కొత్తగా కారును కొనుగోలు చేసేటప్పుడు ఆ కారులో ఉండే ఫీచర్లను చూసి మోసపోకుండా, అది ఎంత మైలేజీనిస్తుందనే విషయాన్ని ధృవీకరించుకోండి. కారులోని ఫీచర్లు కంఫర్ట్‌ను మాత్రమే అందిస్తాయి, కానీ ఇంధనంపై వెచ్చించే ఖర్చు మీ కారు రన్నింగ్ కాస్ట్‌ను భారీగా పెంచుతాయని గుర్తుంచుకోండి. పెట్రోల్ వాహనాలైతే సగటున 15-20 కిలోమీటర్ల మైలేజీనిచ్చే కార్లను ఎంచుకోండి. అదే డీజిల్ కార్లయితే సగటున 20-25 కిలోమీటర్ల మైలేజీనిచ్చే కార్లను ఎంచుకోండి.

ఇంధనాన్ని ఆదా చేసుకోవడానికి చక్కని చిట్కాలు.. గుర్తుంచుకోండి ప్రతి ఇంధనపు చుక్క విలువైనదే!

9. మీ పర్యటనలను ఏకీకృతం చేయండి

ఇంధనంపై అధికంగా ఖర్చు చేయకూడదనుకుంటే, మీరు మీ ప్రయాణాలను ఏకీకృతం చేయడం చాలా అవసరం. అంటే, మీరు చేయాలనుకున్న చిన్న చిన్న ప్రయాణాలను అన్నింటినీ కలిపి ఒకేసారి ప్లాన్ చేసుకోవడం మంచిది. మీ కారు ఇంజన్ చల్లగా ఉన్నప్పుడు మీ ఇంధన ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది మరియు అది వేడెక్కినప్పుడు మెరుగుపడుతుంది. అంటే, ఇంజన్ చల్లబడితే, అది తిరిగి ఆన్ కావడానికి ఎక్కువ ఇంధనం ఖర్చు అవుతుంది. అదే వేడిగా ఉన్న ఇంజన్ తిరిగి ఆన్ కావడానికి తక్కువ ఇంధనం మాత్రమే ఖర్చు అవుతుంది. కాబట్టి, మీ ప్రయాణాన్ని చక్కగా ప్లాన్ చేసుకుంటే, ఇంధనం కూడా ఆదా అవుతుంది.

ఇంధనాన్ని ఆదా చేసుకోవడానికి చక్కని చిట్కాలు.. గుర్తుంచుకోండి ప్రతి ఇంధనపు చుక్క విలువైనదే!

10. వీలైనంత తక్కువ డ్రైవ్ చేయండి

ఇది వినడానికి కాస్తంత విచిత్రంగా అనిపించినప్పటికీ, అనవసరమైన ప్రయాణాలను మానుకోవడం మంచిది. ఇలా చేయడం వలన ఇంధనం ఆదా అవుతుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు ఇంధనం ఆదా చేయడానికి మీరు చేయగలిగే అత్యంత ప్రభావవంతమైన విషయం ఏదైనా ఉందంటే, అది తక్కువగా డ్రైవింగ్ చేయడమే. చిన్నపాటి దూరాలను చేరుకునేందుకు కాలినడక లేదా ప్రత్యామ్నాయ ప్రజా రవాణా వ్యవస్థలను ఉపయోగించండి. ప్రస్తుత, పరిస్థితుల్లో పార్కింగ్ దొరకడం కూడా చాలా కష్టమైన విషయమే కాబట్టి, వీలైనంత వరకూ అనవసరమైన ప్రయాణాలను మానుకోండి.

Most Read Articles

English summary
Tips to save fuel remember every drop counts
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X