వర్షాకాలంలో మీ కారులో చెక్ చేయాల్సిన టాప్ 15 అంశాలు

ఇటీవలే తొలకరి జల్లులు మనదేశాన్ని పలకరించిన సంగతి తెలిసినదే. అంటే, త్వరలోనే మనం మరిన్ని వర్షాలను చూడబోతున్నాం అన్నమాట. సాధారణంగా వర్షాకాలంలో డ్రైవింగ్ ఎల్లప్పుడూ ప్రమాదకరంగానే ఉంటుంది. చిన్నపాటి వర్షాలకే జలమయయ్యే రోడ్లు, నీటి గుంతలు, మ్యాన్‌హోల్స్ ఇలా ప్రతి అంశం సుఖవంతమైన ప్రయాణానికి ఆటంకాలుగా మారుతుంటాయి.

వర్షాకాలంలో కండిషన్‌లో లేని వాహనాల్లో ప్రయాణం అంటే కత్తిమీద సాము లాంటిదే. అందుకే, వాహనాన్ని ఆయా కాలాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కండిషన్‌లో ఉంచుకోవటం చాలా అవసరం. వర్షాకాలంలో ఏ కారు విషయంలో చెక్ చేసుకోవాల్సిన టాప్ 10 అంశాలను గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. ఈ అంశాల గురించి తెలుసుకొని, వాటిని చక్కగా పాటిస్తే, వర్షాకాలంలో మీ ప్రయాణం మరింత సౌకర్యంగా, సురక్షితంగా మారుతుంది. అవేంటో చూద్దాం రండి.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాల కోసం ఈ ఫొటో ఫీచర్‌ను పరిశీలించండి..!

వర్షాకాలంలో చెక్ చేయాల్సినవి..

వర్షాకాలంలో మీ కారు విషయంలో చెక్ చేసుకోవాల్సిన టాప్ 10 అంశాలను తర్వాతి స్లైడ్‌లోల పరిశీలించండి.

1. టైర్లు

1. టైర్లు

వర్షాకాలంలో కారు టైర్లను చెక్ చేసుకోవటం ఎంతో అవసరం. ఫ్లాట్ ఉండే టైర్లతో తడిసిన రోడ్లపై డ్రైవ్ చేయటం రిస్క్, అలా చేయటం వలన ప్రమాదవశాత్తు కారు రోడ్డుపై నుంచి జారిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి, మీ కారు టైర్లు కండిషన్‌లో ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. టైర్లను మార్చాలనిపిస్తే, జాప్యం చేయకుండా కొత్త టైర్లను అమర్చుకోండి.

2. బ్రేక్స్

2. బ్రేక్స్

తడిసిన రోడ్లపై టైర్ల గ్రిప్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి, అలాంటి రోడ్లపై కారు వేగాన్ని నియంత్రించాలంటే బ్రేక్ పనితీరు చక్కగా ఉండాలి. కాబట్టి, వర్షాకాలం సమయంలో మీ కారులోని బ్రేక్ ప్యాడ్స్, బ్రేక్ షూస్, డిస్క్‌, ఏబిఎస్ లను కండిషన్‌లో ఉంచుకోవటం ఎంతో అవసరం. వీటిని ఎప్పటికప్పుడు చెక్ చేసుకొని, వాటి ఆయిల్స్‌ను టాప్ అప్ చేసుకుంటూ, అవసరమైన వాటిని రీప్లేస్ చేసుకోవటం మంచిది.

3. లైట్స్

3. లైట్స్

వర్షాకాలంలో డ్రైవింగ్ చేసేటప్పుడు హెడ్‌లైట్స్ చక్కగా పనిచేయటం ఎంతో అవసరం. వర్షాకాలంలో కొన్నిసార్లు దట్టమైన మేఘాల కారణంగా పగటి సమయాల్లోనే చీకటిగా అనిపిస్తూ, రోడ్డుపై కాంతి తగ్గుతుంది. అలాంటి సమయాల్లో హెడ్‌లైట్స్ ఆన్ చేసుకొని డ్రైవ్ చేయాలి. మీ కారుకు ఫాగ్ ల్యాంప్స్ ఉంటే వాటిని కూడా ఆన్ చేసుకొని డ్రైవ్ చేయటం ఉత్తమం. ఇంకా హాజర్డ్ లైట్స్, సిగ్నల్ లైట్స్, బ్రేక్ లైట్స్, రియర్ పార్కింగ్ ల్యాంప్, రియర్ ఫాగ్ ల్యాంప్స్ మొదలైనవన్నీ సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో చూసుకోవాలి.

4. వైపర్స్

4. వైపర్స్

వర్షాకాలంలో వైపర్స్ పాత్ర చాలా కీలకమైనది. వర్షం పడుతున్నప్పుడు వైపర్స్ సరిగ్గా పనిచేకపోతే, విజిబిలిటీ తగ్గి ప్రమాదాలకు కారణం అవుతుంది. కాబట్టి వైపర్ బ్లేడ్స్ బాగున్నాయో లేదో, వైపర్స్ సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో చెక్ చేసుకోవాలి. వైపర్ బ్లేడ్స్ అరిగినట్లుగా అనిపిస్తే, వాటిని తక్షణమే కొత్త వాటితో రీప్లేస్ చేసుకోవాలి.

5. విండ్‌స్క్రీన్స్

5. విండ్‌స్క్రీన్స్

వైపర్స్‌తో పాటుగా విండ్‌స్క్రీన్స్ (ఫ్రంట్ అండ్ రియర్) కూడా చెక్ చేసుకోవటం ఎంతో అవసరం. మురికి పట్టిన లేదా మసకబారిన విండ్‌స్క్రీన్ వర్షాకాలంలో మీ విజిబిలిటీ మరింత తగ్గిస్తుంది. విండ్‌స్క్రీన్ బాగా మురికి పట్టినట్లు అనిపిస్తే, నాణ్యమైన గ్లాస్ క్లీనింగ్ లిక్విడ్‌ను ఉపయోగించి వాటిని లోపల, వెలుపల క్లీన్ చేసుకోవాలి. అదే విండ్‌స్క్రీన్ ఎక్కువగా గీతలు (స్క్రాచెస్) పడి ఉండినట్లు లేదా మసకబారినట్లు అనిపిస్తే, దానిని కొత్త విండ్‌స్క్రీన్‌తో రీప్లేస్ చేసుకోవటం మంచిది.

6. బీడింగ్స్

6. బీడింగ్స్

కారులోని అన్ని బీడింగ్స్ టైట్‌గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. డోర్ బీడింగ్స్, బానెట్ వద్ద ఉండే బీడింగ్స్, రూఫ్ బీడింగ్స్ మొదలైన అన్ని బీడింగ్స్ బిగుతుగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ఏవైనా వదులుగా ఉన్నట్లు అనిపిస్తే, వాటిని మార్చుకోవాలి. వదులుగా ఉండే బీడింగ్స్ వలన వర్షపు నీరు కారు లోపలికి ప్రవేశించే ఆస్కారం ఉంటుంది.

7. ఏసి / హీటర్ / డిఫాగ్గర్

7. ఏసి / హీటర్ / డిఫాగ్గర్

వర్షాకాలంలో ఎయిర్ కండిషన్ కన్నా హీటర్ ఉపయోగమే ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ మీ కారులో హీటర్/ఢిఫాగ్గర్‌తో కూడిన ఏసి ఉన్నట్లయితే, అది సరిగ్గా పనిచేస్తుందో లేదో చెక్ చేసుకోవాలి. వర్షం ఎక్కువగా ఉన్నప్పుడు కారు విండ్‌‌స్క్రీన్స్‌పై ఆవిరి/పొగమంచు (మిస్ట్) ఏర్పడి విజిబిలిటీ తగ్గుతుంది. అలాంటప్పుడు హీటర, డిఫాగ్గర్‌ను ఉపయోగించి దానిని తొలగించుకోవచ్చు.

8. ఫ్లోర్‌మ్యాట్స్

8. ఫ్లోర్‌మ్యాట్స్

వర్షాకాలానికి అనువుగా ఉండే (తడిసిపోని) ఫ్లోర్‌మ్యాట్స్‌ను ఉపయోగించాలి. ఇలా చేయటం వలన కారులో ఫ్లోరింగ్ పొడిగా ఉంటుంది. అంతేకాకుండా, ఒకవేళ కారులోకి నీరు ప్రవేశించిన పొడిబట్టి సాయంతో సులువుగా క్లీన్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. మీ కారుకు ఫుల్ ఫ్లోర్ మ్యాటింగ్ (వాటర్‌ప్రూఫ్) చేయించుకున్నా కూడా మంచిదే.

9. డోర్‌విజర్

9. డోర్‌విజర్

వర్షాకాలంలో డోర్ విజర్లు చాలా చక్కగా ఉపయోగపడుతాయి. సాధారణంగా, వర్షంలో డ్రైవ్ చేస్తున్నప్పుడు చాలా మంది ఏసిని ఉపయోగించరు. అలాంటప్పుడు కారు డోర్లకు డోర్ విజర్లను అమర్చుకుంటే, అద్దాలను కొద్దిగా క్రిందకు దించుకొని డ్రైవ్ చేసే అవకాశం ఏర్పడుతుంది. ఫలితంగా సహజమైన గాలిని కారులో ఆస్వాదించవచ్చు.

10. ఎయిర్ ఫ్రెషనర్

10. ఎయిర్ ఫ్రెషనర్

సాధారణంగా వర్షాకాలంలో కార్లలో చెడు వాసన వస్తుంటుంది. ఇందు కారణం తడిసిన ఫ్లోర్ మ్యాట్స్ లేదా కారులోని తడి వాతావరణం వలన ఇలా జరగవచ్చు. కాబట్టి, కారులో మంచి ఎయిర్ ఫ్రెషనర్ లేదా పెర్ఫ్యూమ్ ఉన్నట్లయితే, వర్షాకాలంలో కూడా మీ కారు లోపల మంచి సువాసన వస్తూ, ఆహ్లాదకర వాతావరణాన్ని పొందవచ్చు.

11. మడ్ ఫ్లాప్స్

11. మడ్ ఫ్లాప్స్

వర్షాకాలంలో కారు మడ్ ఫ్లాప్స్‌ను చెక్ చేసుకోవటం ఎంతో అవసరం. ఇలాంటి సమయాల్లో కారుకు మడ్ ఫ్లాప్స్ లేకపోయినట్లయితే, కారు టైర్లు వెదజల్లే బురద / వర్షపు నీరు వెనుక వచ్చే వాహనాలపై పడుతుంది. ఫలితంగా అవతలి వాళ్లు అసౌకర్యాన్ని గురవుతారు. అంతేకాకుండా, ఇది మీ కారు క్రింది భాగాన్ని కూడా దెబ్బతినేలా (తుప్పుపట్టడం) చేస్తుంది.

12. యాంటీ రస్ట్ కోటింగ్

12. యాంటీ రస్ట్ కోటింగ్

మీరు సాల్ట్ వాటర్ ఎక్కువగా ఉండే ఏరియాలో డ్రైవ్ చేసేవారు లేదా వర్షాభావం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో డ్రైవ్ చేస్తున్న వారైతే మీ కారు క్రింది భాగంలో యాంటీ-రస్ట్ కోటింగ్ వేయించుకోవటం మంచిది. దీని వలన కారు క్రింది భాగం తుప్పు పట్టకుండా ఉండి, ఎక్కువ కాలం మన్నుతుంది.

13. వ్యాక్స్ పాలిష్

13. వ్యాక్స్ పాలిష్

వర్షాకాలంలో కారుకు వ్యాక్స్ పాలిష్ చేయించుకోవటం చాలా మంచిది. చాలా వరకు రుతుపవనాలకు ముందు పడే వర్షపు నీటిలో యాసిడ్స్ ఉండొచ్చని పరిశోధకులు చెబుతున్నారు. వర్షపు నీటిలోని ఈ రసాయానాలు మీ కారు పెయింట్‌ని దెబ్బతీసే ఆస్కారం ఉంది. వ్యాక్స్ పాలిష్ అనేది మీ కారు పెయింటింగ్‌పై చేసే ఓ పారదర్శక పొర లాంటింది. ఇది నీటిని కారుపై నిల్వ ఉండకుండా చూసుకుంటుంది.

ఆన్‌లైన్ మార్కెట్లో కూడా ఇవి అందుబాటులో ఉంటాయి.
14. స్పేర్ వీల్

14. స్పేర్ వీల్

వర్షాకాలంలో దూరప్రయాణాలు చేయాల్సి వచ్చినప్పుడు లేదా గతుకుల రోడ్లలో ప్రయాణిస్తున్నప్పుడు అకస్మాత్తుగా టైరు పంక్చర్ అయితే వెంటనే వీల్‌ను మార్చుకునేందుకు వీలుగా ఎల్లప్పుడూ స్పేర్ వీల్ సిద్ధంగా ఉండేలా చూసుకోండి. ఇలా చేయటం వలన చికాకు లేకుండా మీ గమ్యాన్ని సురక్షితంగా చేరుకోవచ్చు.

15. కారులో క్యారీ చేయాల్సిన వస్తువులు

15. కారులో క్యారీ చేయాల్సిన వస్తువులు

వర్షాకాలంలో డ్రైవింగ్ చేసేటప్పుడు కారులో ఈ చిన్నపాటి వస్తువులను ఉంచుకుంటే, మీ ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారుతుంది. అవేంటంటే.. టిష్యూ పేపర్స్, పాత న్యూస్ పేపర్లు, కారును క్లీన్ చేసుకునేందుకు పొడి బట్టలు, గొడుగు, పొడి టవల్, ఓ జత బట్టలు, అధనపు ఫ్యూజ్‌లు మరియు బల్బులు మొదలైన వాటిని మీ కారులో ఉంచుకోవటం మంచిది.

చివరిమాట

చివరిమాట

ఇవి వర్షాకాలంలో డ్రైవింగ్ చేసేటప్పుడు చెక్ చేసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు. ఇవి కాకుండా మీకు తెలిసిన మరిన్ని అంశాలు ఏవైనా ఉంటే మా పాఠకులతో పంచుకోగలరు..!

చిట్కాలు

చిట్కాలు

ఇది కూడా చదవండి: వర్షంలో సురక్షితంగా డ్రైవ్ చేయటం ఎలా: చిట్కాలు

More from DriveSpark

Article Published On: Monday, June 9, 2014, 14:40 [IST]
English summary
Car driving in the rain can be challenging some times. You have to check 15 most important things in your car, before you start driving in monsoon. Here is the list. Take a look.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+