డీజిల్ కార్ కొనటానికి 6 ప్రధాన కారణాలు: మీకు తెలుసా?

Written By:

ఎవరైనా కొత్త కారు కొనుగోలు చేయటానికి ముందు చాలానే రీసెర్చ్ చేస్తారు. అయితే, డీజిల్ కారు కొనాలా లేక పెట్రోల్ కారు కొనాలా అనే విషయంలో మాత్రం తర్జనభర్జన పడుతుంటారు. వాస్తవానికి డీజిల్ కార్ల విషయంలో చాలా మంది పలు అపోహలు ఉన్నాయి. ఒకప్పుడు డీజిల్ కార్లను కొనుగోలు చేసే వారి సంఖ్య చాలా తక్కువగా ఉండేది. కానీ, ప్రస్తుతం డీజిల్ కార్లకు ప్రాధాన్యతనిచ్చే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.

పెర్ఫార్మెన్స్, మైలేజ్, ధర అంశాలకు ప్రాధాన్యతనిచ్చే వారు పెట్రోల్ కార్లను ఎంచుకుంటారు. కానీ డీజిల్ కార్ వినియోగదారులు మాత్రం కేవలం మైలేజ్‌కి మాత్రమే ప్రాధాన్యతనిస్తుంటారు. డీజిల్ కారు అధిక ధర, మెయింటినెన్స్ ఖర్చును కలిగి ఉంటుందని, డీజిల్ ఇంజన్లు ఎక్కువ శబ్ధం చేస్తాయని అలాగే ఇవి ఎక్కువ కాలుష్యాన్ని వెదజల్లుతాయనే అపోహలు ఇప్పటికీ చాలా మందిలో ఉన్నాయి.

ఇవన్నీ ఒకప్పుడు నిజమేమో కానీ, ఇప్పుడు. ప్రస్తుత తరం కార్లలో అధునాతన డీజిల్ ఇంజన్లను ఉపయోగిస్తున్నారు. పాతతరం డీజిల్ ఇంజన్లతో పోల్చుకుంటే, ఇవి ఎన్నో రెట్లు మెరుగైనవి. నేటి రీఫైన్డ్ డీజిల్ ఇంజన్లు పెట్రోల్ ఇంజన్లతో సమాంగా ఉంటున్నాయి.

మరి డీజిల్ కార్లను కొనడానికి గల ప్రధాన కారణాలు ఎంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి..!

డీజిల్ కార్ కొనటానికి 6 కారణాలు

తర్వాతి స్లైడ్‌లలో డీజిల్ కార్లను కొనుగోలు చేయటానికి గల కారణాలను తెలుసుకోండి.

అధిక మైలేజీనిస్తాయా?

అధిక మైలేజీనిస్తాయా?

మీరు నిత్యం ఎక్కువ దూరం ప్రయాణించే వారు లేదా తరచూ దూరప్రయాణాలు చేసే వారైతే మీకు డీజిల్ కార్ చక్కటి ఆప్షన్‌గా ఉంటుంది. ఎందుకంటే, పెట్రోల్ కార్లతో పోల్చుకుంటే డీజిల్ కార్లు ఎక్కువ మైలేజీనిస్తాయి కాబట్టి. అంతేకాకుండా, పెట్రోల్ ఇంధనంతో పోల్చుకుంటే డీజిల్ ఇంధన ధర కూడా చాలా తక్కువగా ఉంటుంది. వాస్తవానికి డీజిల్ కార్లు పెట్రోల్ కార్ల కన్నా 25-30 శాతం ఎక్కువ మైలేజీనిస్తాయి.

డీజిల్ ఇంజన్స్ శక్తివంతమైనవా?

డీజిల్ ఇంజన్స్ శక్తివంతమైనవా?

పెట్రోల్ ఇంజన్ కన్నా డీజిల్ ఇంజన్ ఎక్కువ టార్క్ (పుల్లింగ్)ను ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి, డీజిల్ కార్ల హార్స్ పవర్ తక్కువగా ఉన్నప్పటికీ, ప్రారంభ పికప్ మాత్రం మెరుగ్గా ఉంటుంది. పెట్రోల్ కార్ల విషయంలో ఇది రివర్సులో ఉంటుంది. ఏదేమైనప్పటికీ, మోడ్రన్ డీజిల్ ఇంజన్లను, పెట్రోల్ ఇంజన్లతో సమానమైన పెర్ఫార్మెన్స్‌ను కనబరుస్తున్నాయి.

డీజిల్ ఇంజన్స్ పర్యావరణ సాన్నిహిత్యమైనవి కావా?

డీజిల్ ఇంజన్స్ పర్యావరణ సాన్నిహిత్యమైనవి కావా?

డీజిల్ ఇంజన్లు ఎక్కువ కార్బన్ డై ఆక్సైడ్‌ని విడుదల చేస్తాయనే అపోహ చాలా మందిలో ఉంది కానీ, ఇది అవాస్తవం. పెట్రోల్ కన్నా డీజిల్ ఇంజన్లే తక్కువ ఇంధనాన్ని వినియోగించుకుంటాయి కాబట్టి, వీటి సిఓ2 స్థాయి కూడా తక్కువగానే ఉంటుంది. ప్రస్తుతం మనదేశంలో భారత్ స్టేజ్ 4 (యూరో 4) కాలుష్య నిబంధనలు అమల్లో ఉన్నాయి కాబట్టి, కార్ మేకర్లు కూడా డీజిల్ ఇంజన్ సిఓ2 స్థాయి విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాయి. కాబట్టి, ప్రస్తుత డీజిల్ ఇంజన్లు పర్యావరణ సాన్నిహిత్యమైనవే.

డీజిల్ ఇంజన్స్ శబ్ధం చేస్తాయా?

డీజిల్ ఇంజన్స్ శబ్ధం చేస్తాయా?

నిజమే ఒకప్పుడు డీజిల్ ఇంజన్లు, ట్రాక్టర్ల మాదిరిగా శబ్ధం చేసేవి. కానీ, ఇప్పుడు డీజిల్ ఇంజన్లు చాలా వరకూ రీఫైన్ అయ్యాయి. పెట్రోల్ కార్లతో పోల్చుకుంటే, బయట వైపు డీజిల్ కార్ల శబ్ధం కాస్తంత ఎక్కువగానే అనిపించినప్పటికీ, క్యాబిన్ లోపల మాత్రం ఇంప్రూవ్డ్ ఎన్‌విహెచ్ లెవల్స్ కారణంగా ప్రస్తుత డీజిల్ కార్ల శబ్ధం తక్కువే అని చెప్పొచ్చు.

డీజిల్ కార్లకు రీసేల్ వ్యాల్యూ ఉంటుందా?

డీజిల్ కార్లకు రీసేల్ వ్యాల్యూ ఉంటుందా?

వాస్తవానికి పెట్రోల్ కార్లతో పోల్చుకుంటే డీజిల్ కార్లకే ఎక్కువ రీసేల్ వ్యాల్యూ ఉంటుంది. మీరు తరచూ కార్లను మార్చే వ్యక్తిత్వం కలవారైతే గుడ్డిగా డీజిల్ కార్లను కొనుగోలు చేయవచ్చు. ఉదాహరణకు.. పెట్రోల్ కారు రీసేల్ వ్యాల్యూ దాని వాస్తవ విలువలో 44 శాతం ఉంటే, డీజిల్ కారు రీసేల్ వ్యాల్యూ దాని వాస్తవ విలువలో 50 శాతం వరకూ ఉంటుంది. అంటే, డీజిల్ కార్లపై తొలుత ఎక్కువ మొత్తం వెచ్చించినా, రీసేల్ చేసేటప్పుడు మాత్రం మనకి నష్టం రాదన్నమాట.

డీజిల్ కార్ల ధర అధికంగా ఉంటుందా?

డీజిల్ కార్ల ధర అధికంగా ఉంటుందా?

నిజమే.. పెట్రోల్ కార్లతో పోల్చుకుంటే డీజిల్ కార్ల ధర ఎక్కువగానే ఉంటుంది. అయితే, డీజిల్ కార్‌పై ఇన్షియల్‌గా వెచ్చించే మొత్తాన్ని మరియు లాంగ్ రన్‌లో పెట్రోల్ కారు ఇంధనం కోసం వెచ్చించిన మొత్తం సరిచూసుకుంటే, డీజిల్ కార్ కొనుగోలు చేయటంలోనే లాభం ఉందనిపిస్తుంది. కాబట్టి, ప్రారంభంలో డీజిల్ కారుపై ఎక్కువ మొత్తం వెచ్చించినా, అది ఇంధనం రూపంలో మనకు ఆదానే అవుతుంది.

డీజిల్ కార్ కొనటానికి 6 కారణాలు

మరి మీ చాయిస్ ఏంటి? పెట్రోల్ కారా లేక డీజిల్ కారా?

English summary
Diesel cars are rapidly increasing accross the world. Infact, diesel cars are now outselling the petrol cars. Here are top 6 reasons why you should buy a Diesel car.
Story first published: Wednesday, November 19, 2014, 17:04 [IST]
Please Wait while comments are loading...

Latest Photos