కారులో ఎంతటి మొండి మరక పడ్డా.. ఈ చిట్కాలతో ఇంటి దగ్గరే చిటికెలో మాయం..

కొన్ని లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన కారును ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవడం చాలా అవసరం. లేకుంటే ఎక్స్​టర్నల్ లుక్ అయినా ఇంటర్నల్​లుక్ అయినా సరే చెడిపోతుంది. చాలా మంది కారు బయట వైపు ఎప్పుడూ శుభ్రంగా ఉంచుతారు. కానీ ఇంటీరియర్​ను క్లీన్ చేసుకోలేక అనేక ఇబ్బందులు పడుతుంటారు. రోజుల తరబడి లోపల పేరుకుపోయిన దుమ్ము ద్వారా అద్భుతంగా ఉన్న ఇంటీరియర్ లుక్ కాస్త చెడిపోతుంది. షాపులలో కారు వాషింగ్‌కు ఎక్కువ ఖర్చు అవుతుండటంతో దానిని సొంతంగా ఎలా క్లీన్ చేయాలో తెలియక ఇబ్బందులు పడుతుంటారు. అయితే కొన్ని సులువైన చిట్కాలను పాటించడం ద్వారా మన కారు ఇంటీరియర్​ను మనమే ఇంటి వద్ద చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు.

కారు ఇంటీరియర్‌ను సొంతంగా క్లీన్ చేసుకునే చిట్కాలు: ఇంటి వద్దనే కారు లోపల క్లీనింగ్ చేసుకోవడానికి వెనిగర్, నీటిని సమాన భాగాలుగా తీసుకుని వాటిని బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక క్లాత్ తీసుకుని దానిలో ముంచి లోపల డాష్‌బోర్డ్‌లు, ఇతర ప్లాస్టిక్ వంటి వాటిని తుడిచినట్లయితే పేరుకుపోయిన మచ్చలు అన్ని కూడా పోతాయి.

Top tips To cleaning the car interior

మైక్రో ఫైబర్ క్లాత్: కారు శుభ్రం చేయడానికి మైక్రోఫైబర్ క్లాత్‌లు చాలా బాగా ఉపయోగపడుతాయి. సాధారణ క్లాత్‌ల మాదిరిగా కాకుండా, వీటితో ఉపరితలంపై రుద్దినట్లయితే ఎలాంటి గీతలు లేకుండా, దుమ్ము, ధూళి తొలగిపోతుంది. పాలిష్ లుక్‌ కోసం సున్నిత ప్లేస్‌లలో ఎలాంటి గీతలు రాకుండా మృదువైన ఆకృతిని అందించడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది.

బేకింగ్ సోడా: కారు లోపల చెడు వాసనలు వస్తున్నట్లయితే బేకింగ్ సోడా ఒక అద్భుతమైన, సహజమైన ఎయిర్ ఫ్రెషర్‌గా ఉపయోగపడుతుంది. దీనిని సీట్లు, కార్పెట్‌లపై చల్లి, 15 నిమిషాల తరువాత క్లాత్‌తో తుడిచినట్లయితే మురికి పోవడంతో పాటు చెడు వాసనలు కూడా పోతాయి. ఈ పద్థతి మంచి ఎయిర్‌ ఫ్రెషర్‌గా ఉపయోగపడుతుంది.

లెదర్ ఇంటీరియర్ క్లీనింగ్: కారు లోపల లెదర్ ఇంటీరియర్స్ ఉంటే, వాటిని రెగ్యులర్‌గా క్లీన్ చేయడం చాలా అవసరం. లెదర్ భాగాలను క్లీన్ చేయడానికి ఆలివ్ ఆయిల్, వెనిగర్ చాలా మంచి ఆప్షన్. ఈ రెండింటిని బాగా కలిపిన మిశ్రమంలో క్లాత్‌ను ముంచి లెదర్ భాగాలపై రాసినట్లయితే తోలు మృదువుగా మారుతుంది. అలాగే, ఈ మిశ్రమం పగుళ్లను సైతం రాకుండా చూస్తుంది.

కారు మ్యాట్​లు మెరవడానికి షూ పాలిష్: షూ లకు పాలిష్ చేసే బ్రష్​తో కారు మ్యాట్​లను తళతళలాడేలా చేయవచ్చు. దీని కోసం మొదట కారు మ్యాట్​లను నీళ్లలో బాగా ఉతికిన తర్వాత షూను పాలిష్ చేసే బ్రష్​తో వాటిని రుద్దాలి. ఇలా చేయడం వలన మ్యాట్​లు అందంగా మారిపోతాయి.

న్యూస్ పేపర్లతో విండో క్లీనింగ్: కారు విండోలను క్లీన్ చేయడానికి న్యూస్ పేపర్లు చాలా మంచి ఆప్షన్. రంగులేని న్యూస్ పేపర్​తో కారు విండోలను క్లీన్ చేసుకోవాలి. లేదంటే విండో గ్లాస్​పై మరకలు పడే అవకాశాలు ఉన్నాయి. కారుపై ఉన్న స్టిక్కర్లను సులభంగా తొలగించడానికి కూడా న్యూస్ పేపర్ ఉపయోగపడుతుంది.

చివరగా, కారు లోపల ఇంటీరియర్‌ను శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. లేకుంటే సీట్లు, మ్యాట్‌లపై, క్యాబిన్‌లో పేరుకుపోయిన దమ్ము, ధూళి ద్వారా లేనిపోని అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇంటీరియర్ క్లీన్‌గా ఉన్నట్లయితే కారు లోపల చూడటానికి అందంగా ఉండటంతో పాటు, ఎలాంటి రోగాలు రాకుండా ఉంటాయి.

ఇంటి వద్దనే సొంతంగా అదనపు ఖర్చు లేకుండా తమ వద్ద అందుబాటులో ఉన్న వాటి ద్వారా కారు ఇంటీరియర్‌ను అద్బుతంగా మార్చుకోవచ్చు. ఇలాంటి చర్యలు కారు అందాన్ని పెంచడమే కాకుండా మీ కారు అంతర్గత భాగాలు త్వరగా చెడిపోకుండా ఎక్కువ కాలం పనిచేసేలా దోహదం చేస్తాయి.

More from DriveSpark

Article Published On: Friday, October 11, 2024, 12:09 [IST]
English summary
Top tips to cleaning the car interior very easily at home check all details in telugu
Read more on: #auto #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+