దీపావళి నాడు మీ వాహనాలను బాంబుల నుంచి కాపాడుకోవాలా..? టెన్షన్ ఎందుకు.. ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే సరే.

దీపావళి పండుగ అంటేనే ఎంతో సందడి. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే పండుగగా భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక. పెద్దల నుంచి పిల్లల వరకు వయసు తేడా లేకుండా అందరు పండుగ సమయంలో బాంబుల మోత మోగిస్తుంటారు. అయితే ఇలాంటి టైం లో బాంబుల కారణంగా అగ్ని ప్రమాదం సంభవించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఈ పండుగ సమయంలో వాహనాలను కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే టపాసులు పేలినప్పుడు కార్ల వంటి వాహనాలకు మంటలు అంటుకునే అవకాశం ఉంది. కాబట్టి దీపావళి నాడు వాహనాలు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా పలు జాగ్రత్తలు పాటించడం ద్వారా వాటిని అగ్నిప్రమాదాల భారీ నుంచి వాటిని రక్షించుకోవచ్చు. వాహనాలను దీపావళి నాడు ఎలా జాగ్రత్తగా రక్షించుకోవాలో కొన్ని సలహాలను క్రింది కథనంలో ఇవ్వడం జరిగింది.

అగ్ని నిరోధక కవర్లను ఉపయోగించడం: కారు పార్కింగ్ చేసిన సమయంలో వాటిపై మంచి నాణ్యమైన కవర్‌ను కప్పడం చాలా మంచిది. ఇది దుమ్ము, ధూళితో పాటు అగ్ని ప్రమాదాల నుంచి రక్షించడానికి బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా రోడ్లకు పక్కన లేదా మీ ఇంటి ముందు వాహనాలను నిలిపినట్లయితే బాంబులు పేలినప్పుడు వచ్చే పొగ నుంచి కూడా వాహనాన్ని కవర్ కాపాడుతుంది.

Top Tips To Vehicle Safe In Diwali

సాధారణ క్వాలిటీ గల కవర్‌లు కాకుండా మంచి నాణ్యత కలిగినవి ప్రస్తుతం మార్కెట్లో చాలా అందుబాటులో ఉన్నాయి. ధర కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ కారును మాత్రం అన్ని వాతావరణ పరిస్థితుల నుంచి కాపాడుతాయి. ఇండోర్ పార్కింగ్ వంటి సౌకర్యం లేని వారు ఇలాంటి కవర్‌లను ఉపయోగించడం మంచి ఆప్షన్. దీనిని వాడటం వలన కారు కలర్ కూడా ఎక్కువ కాలం చెడిపోకుండా ఉంటుంది.

షెడ్ కింద పార్క్ చేయడం: వాహనాలను బయట పార్క్ చేయడం, దీపావళి నాడు అంత శ్రేయస్కరం కాదు. బాంబులు పేలుతున్న సమయంలో వాటి నిప్పురవ్వలు ఎటు వైపు వస్తాయో తెలియదు. ఒక వేళ వాహనం రోడ్డు మీద పార్క్ చేసినప్పుడు బాంబుల నిప్పురవ్వలు వాటికి అంటుకుని ఆకస్మాత్తుగా మంటలు చెలరేగే అవకాశం ఉంది.

Tips To Vehicle Safe From Fire Hazards

కాబట్టి ప్రమాదవశాత్తు వచ్చే మంటల భారీ నుంచి వాహనాన్ని కాపాడటానికి గ్యారేజ్, కార్‌పోర్ట్ లేదా ఇతర కవర్ స్థలంలో పార్క్ చేయడం ఉత్తమం. పొరపాటున కూడా బాణాసంచా కాల్చే ప్రదేశాలకు దగ్గరగా వాహనాలు ఉంచకూడదు. వాహనాన్ని దీపావళి నాడు కాపాడుకోవాలంటే ఈ జాగ్రత్త తప్పనిసరిగా పాటించాలి.

కారు విండోలను మూసివేయడం: కారు ఇంటీరియర్‌‌ను కాపాడుకోడానికి విండోస్‌ను వీలైనంత వరకు మూసి ఉంచడం ఉత్తమం. విండోలు ఓపెన్ చేసి ఉండటం వల టపాసుల నిప్పురవ్వలు విండోస్ ద్వారా సీట్లపై పడే అవకాశం ఉంటుంది. దీని వలన కారు లోపల మంటలు చెలరేగే అవకాశం ఉంది. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు అలాగే మీరు పార్క్ చేసినప్పుడు కిటికీలను చెక్ చేసుకోవాలి.

Top Tips To Vehicle Safe From Fire Hazards In Diwali civer

సిరామిక్ పూత పూయడం: బాంబులు పేలినప్పుడు వచ్చే పొగ కారణంగా కారు కలర్ చెడిపోతుంది. బాడీ పై దుమ్ము, ధూళి భారీగా పేరుకుపోతుంటాయి. పండుగ తరువాత ఈ మరకలను తొలగించడం చాలా కష్టం. కాబట్టి ముందుగానే వాహన యజమానులు సిరామిక్ పూత వేయించుకోవడం బెస్ట్. ఇది కారుపై ఎలాంటి దుమ్ము కానీ లేదా పెయింట్‌కు హానికరమైన కణాలను అంటుకోకుండా చూస్తుంది.

మంటలను ఆర్పే పోర్టబుల్: దీపావళి నాడు అగ్ని ప్రమాదాలు జరగవని అనుకోవద్దు. ప్రమాదం జరిగిన తర్వాత బాధపడటం కంటే ముందు జాగ్రత్తగా అగ్నిమాపక యంత్రాన్ని చేతుల దగ్గర ఉంచుకోవడం ఎల్లప్పుడూ సురక్షితం. ఒకవేళ వాహనాలకు మంటలు అంటుకున్నట్లయితే మంటలను ఆర్పే డబ్బాలను ఉపయోగించి మంటలు ఆర్పి వేయవచ్చు.

More from DriveSpark

Article Published On: Thursday, October 31, 2024, 7:20 [IST]
English summary
Top tips to vehicle safe from fire hazards in diwali check all details
Read more on: #diwali #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+